“ నది అంచున నడుస్తూ ” – ఒక ఆర్ద్ర స్పందన

-డా. నల్లపనేని విజయలక్ష్మి

నది అంచున నడుస్తూకవితా సంపుటి రచయిత్రి డా.చిల్లర భవానీ దేవి గారు బహుముఖ ప్రజ్ఞాశాలి.ఆంగ్ల ,హిందీ సాహిత్యాలలో పాండిత్యం కలిగినవారు. తెలుగు సాహిత్యంలో అపారమైన కృషి చేసినవారు. కవిత్వం, కథలు, నవలలు, బాల సాహిత్యం, వ్యాస సంపుటాలు, నాటికలు,టివి సీరియల్స్, నియో లిటరేచర్, అనువాదాలుఇలా ఆధునిక సాహిత్య  ప్రక్రియలన్నింటిలోనూ రచనలు చేసి తనదైన ముద్ర వేసినవారు. యువ భారతి, ఆరాధన, చేతన వంటి సాహితీ, సాంస్కృతిక సంస్థల నిర్వహణ బాధ్యతను మోసినవారు. ఉత్తమ కవయిత్రిగా, ఉత్తమ కథా రచయిత్రిగా తాను చేసిన సాహిత్య కృషికి గాను ముఫ్పైకి  పైగా పురస్కారాలు అందుకొన్నవారు.

అందం ఆనందం సాహిత్య పరమావధిఅంటారు తిలక్.అందం సాధించి ఆనందాన్నివ్వని రచన కవితే కాదని ఆయన అభిప్రాయం.చక్కని లయ వల్ల, వర్ణనా సౌందర్యం వల్ల అందం సమకూరుతుంది.అయితే ఆనందం దేని వల్ల కలుగుతుంది అన్న ప్రశ్న ఎదురవుతుంది. వాదాలకు, ఉద్యమాలకు, రాజకీయ, ఆర్ధిక సిద్ధాంతాలకు పరిమితమైన కవిత్వం కంటే సార్వకాలిక విలువలైన మానవీయ విలువలను ప్రతిపాదించే కవిత్వం అందరికీ ఆనందాన్ని పంచుతుందని చెప్పాలి.మానవీయ విలువలకి కవిత్వంలో చోటున్నప్పుడు కవితలకుండే స్పందన వేరుగా ఉంటుంది.అవి పాఠకుల హృదయాలను కదిలిస్తాయి.అటువంటి మానవీయ విలువలను,కుటుంబ బంధాలను,స్త్రీల అస్తిత్వ వేదనను అపూర్వంగా అక్షరబద్ధం చేసి మనకందించిన కవితా సంపుటినది అంచున నడుస్తూ ” . నది అంచున నడుస్తూ ఉంటే భావసౌకుమార్యం, అర్థగాఢత, సందేశాత్మకత, సృజనాత్మకత, సామాజిక వేదనల సంలీనతఇలా ఎన్నో గలగలలు నదీ ప్రవాహం లోంచి వినబడుతూ అన్నీ కలసి మానవీయ విలువలతో కూడిన ప్రపంచానికి ఆహ్వానం పలుకుతూ హృదయాన్ని ఆర్ద్రం చేస్తాయి.ఇందులో బాపు,మంగళంపల్లి బాల మురళీ కృష్ణ, సి. నా. రె స్మృతిలో వ్రాసిన కవితలున్నాయి. ప్రకృతితో మమేకమై పరవశించిన అనుభూతుల్ని వర్ణించిన కవితలున్నాయి. విడిపోవడం లోని వేదనను, వలసదారుల కష్టాలను, ఉప్పెనల జ్ఞాపకాలను పంచిన కవితలున్నాయి. మనవడి బుడిబుడి నడకల ఆనందాన్ని, ఆత్మీయ మిత్రురాలి మరణ దుఃఖాన్ని మనతో పంచుకొన్న కవితలూ ఉన్నాయి. విషయం ఏదైనా చక్కని భావ చిత్రాలతో,వర్ణనా నైపుణ్యంతో, సరళమైన శైలితో వ్యక్తీకరించడం భవానీ దేవి గారి ప్రతిభకి నిదర్శనం.

భావాలెప్పుడూ అమూర్తంగానే ఉంటాయి. వాటికి మూర్తిమత్వాన్ని కల్పించడంలోనే కవుల ప్రతిభ వెల్లడవుతుంది. చక్కని భావ చిత్రాలతో అభివ్యక్తి  నైపుణ్యంతో భావాలను దృశ్యీకరించడంలో భవానీ గారు నిపుణులు. అప్పటిదాకా ఇంటిలో సందడి చేసిన పిల్లలు దూర దేశాలకు ఎగిరి వెళ్ళినపుడు తల్లిదండ్రులు అనుభవించే శూన్యాన్ని అద్భుతంగా ఆవిష్కరించిన కవితమిగిలిన గూడు ”.

ఇల్లంతా….

మళ్ళీ మౌన శూన్యాన్ని మోస్తోంది

నిన్నటి దాకా అల్లరి మాటల కెరటాలు

ఒక్క రాత్రి లోన

నిశ్శబ్ద తుఫాను నీడల ఊడలు

పిల్లలు ఉన్నంతసేపూ, వారితో మాట్లాడుతున్నంతసేపూ తల్లిదండ్రుల్లో కెరటాల్లా ఎగసిపడే ఉత్సాహాన్నిఅల్లరి మాటల కెరటాలుఅనే భావ చిత్రం కళ్ళకి కడితే వారు వెళ్ళిపోగానే తల్లిదండ్రుల్లో కలిగే నైరాశ్యాన్నినిశ్శబ్ద తుఫాను నీడల ఊడలుఅనే భావ చిత్రం కళ్ళకి కడుతుంది. హఠాత్తుగా విరుచుకు పడిన తుఫాను చెట్లనన్నింటినీ నేల మట్టం చేశాక మిగిలిపోయిన ఊడల్లా తల్లిదండ్రులు దర్శనమిస్తారు.

                     రెక్కలు వచ్చిన పక్షులు ఎగిరిపోతాయి

                     గూడు మాత్రం ఒంటరిగా మిగిలిపోయి

                     ఒక్కొక్క పుల్లని రాల్చుకుంటూ

                     మళ్ళీ కొత్త రెక్కలు తొడుక్కుంటూ

                     ఎగిరిపోయిన పక్షులకి మరో గూడవుతుంది

                     కాలం కాటుకు మాయమైన పాతగూటిని

                     కొత్త చివుళ్ళలో మళ్ళీ మొలకెత్తించుకుంటుంది

గూడును నిర్మించుకోవడం,పిల్లలు వెళ్ళిపోగానే మిగిలే ఒంటరితనం, మళ్ళీ తరువాతి తరం గూటిని నిర్మించుకోవడం, మళ్ళీ వారి పిల్లలుఇలా నిరంతరం జరుగుతూనే ఉంటుందని, ప్రతి తరం శూన్యాన్ని భరించవలసిందేనన్న తాత్వికతను చక్కని భావ చిత్రాల ద్వారా కవితలో వెల్లడించడం జరిగింది.

       ప్రకృతిని చూసి పరవశించడం ,ప్రకృతిలో మమేకం కావడం, మనల్ని మమేకం చేయడంనిశ్శబ్ద క్రాంతి ” , “ నయాగరా నవ్యానుభూతికవితల్లో కనిపిస్తుంది.

     గడ్డి పరకల నుదుళ్ళపై లేత పెదవుల నునుస్పర్శతో

     ప్రతి మంచు బిందువు పలకరించిందొక ప్రేమ పరాగం

     సమున్నత వృక్ష విరచిత వినూతన యవనికపై

     వైభవ దృశ్యకేతనం ఎగరేయడానికే వసంతం ఎదురుచూపులు

అంటూ కవయిత్రి చక్కని భావ చిత్రాలతో ప్రకృతి అందాలను దృశ్యీకరిస్తారు. పత్రాలలో పూల రంగుల్ని అలంకరించుకొన్న చెట్ల శోభను చూసిఇంతటి వర్ణార్ణవంలో నేనూ ఒక అవర్ణ పత్రాన్నై లయం కావల్సిందే

*****
Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.