ఉరితాళ్ళే గతాయే

-నల్లెల్ల రాజయ్య

 

అహో ! నా పాలక వర్గమా

మా కడుపులు నింపే

అన్నదాతని అందలమెక్కించి

అంగలారుస్తూ చొంగ కారుస్తవ్ !

దేశానికే ఎన్నెముకలు.

నా రైతన్నలని అదేపనిగా

అంటుంటవ్ !

కని మీ మనసు నిండా

అన్నదాతల ఎన్నెముకల్లోని

మూలుగను సైతం లేకుండా

పీల్చుకతినే నయవంచక

ఎవ్వారం నీది.

నీ మాటల్లో మర్మముంటది

చేతల్లో చెప్పలేనంత

సత్తెన నాశన కార్యాలు

జరిపిస్తుంటవ్ !

గిట్టుబాటు ధరలివ్వని

గిదేం రాజ్యమనీ

ఆగ్రహించిన అన్నదాత

ఆక్రోషిస్తే చేతుల్లకు సంకెళ్ళెస్తవ్ 

కాదు లేదు పొమ్మంటే కాల్చిపారేస్తుంటవ్ !

ఇగ జూడు ఎవుసాయంల

ఎవ్వల్జేయన్ని ఎక్కడ లేనన్ని

అవ్వల్దర్జ సంస్కరణలూ

సట్టుబండలు చేస్తున్నామని 

చాటింపేసుకుంటా 

కార్పోరేట్ కంపిన్లకు

కట్టుబానిసవై

అన్నదాతను అగచాట్ల పాల్జేస్తవ్ !

నూతన ఎవుసాయ బిల్లులని

అందినంత అంగబలముందని

ఆమోద ముద్రలేసుకుని

పెట్టుబడిదార్లకే పెద్ద పీటలేస్తవ్ 

ఆరుగాలం శ్రమించే

అన్నదాతకు అలవికాని దగాజేస్తవ్ !

బహుళజాతి కంపిండ్ల

బద్మాషీగిరిక బాంచెన్ గిరీ

చేసుడు నీ కలవాటైపాయే 

అన్నిట్లో ఆగమై

ఎటూపాలుపోని

నా అన్నదాతకు

ఉరితాళ్ళే గతాయే.

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.