కొత్త పేజీ మొదలు

-సముద్రాల శ్రీదేవి

 

గతం చేతి వేళ్ళను సుతిమెత్తగా

వదిలి పెడుతూ,

 నేటి నిజం, గెలుపు భవితవ్యాన్ని 

అందుకోవాలని ప్రయత్నం.

జ్ఞాపకాల నెమలీకలను 

భద్రంగా దాచి, గుండె గుమ్మంలో

ఎదురుచూస్తుంది  కొత్తదనం కోసం.

నిన్నటికి,రేపటికి సంధి వారధిలా

నూత్న ఒరవడులకు సారథిలా

ఎదురు వస్తుంది కొత్త వత్సరం.

ఊహాల కుంచెతో బొమ్మలు గీస్తూ,

వూపిరి నింపిన కలల శిల్పం చెక్కుతూ,

ఘడియ అనే రాత్రి రెప్పలను తెరుచుకొని,

వెన్నెల పలువరుసతో  ఆహ్వానిస్తోంది

కాలాల తలుపుల తాళాలు తీసి,

అనుభవాల ముడతల, 

మడతలు  సరిచేసి,

మరో అధ్యాయపు పేజీలలో

నలిగి పోయిన పాతని ,

ఆశల అక్షరాల నగిషీలు దిద్దుతూ,

లక్ష్యాలను బ్రతుకు  కాగితంపై

అందంగా రాస్తుంది,

భవ బంధాలను పెంచుతుంది,

సమాజ సామరస్యాన్ని పంచుతుంది.

స్వాగతిద్దా వత్సరాన్ని సగౌరవంగా.

,పెదవుల పూరేకుపై పై,చిరునవ్వుల 

పుప్పొడి ,తేనె వాకల్ని,

 జాలు వారించుదాం సరికొత్తగా

 

*****

Please follow and like us:

One thought on “కొత్త పేజీ మొదలు (కవిత)”

Leave a Reply to Raja Motupalli Cancel reply

Your email address will not be published.