చిన్నిపిట్ట పెద్ద మనసు

-ఆదూరి హైమావతి 

పూర్వం ఒకాడవిలో చెట్లమీద చాలా పక్షులు గూళ్ళు కట్టుకుని నివసి స్తుండేవి.అక్కడి నాగావళీ నదీ సమీపాన ఒక పెద్ద బూరుగు చెట్టు ఉండే ది.దానికొమ్మలు బాగా పైకి పెరిగి చాలా చెట్లకంటే ఎత్తుగా ఉండేది.

దానిపై కొమమ్మీద ఒక కాకి కర్రలతో గూడు కట్టుకుని నివసించేది.అది రోజూ తన గూడు నుంచీ క్రింద కొమ్మ ల మీద ఉన్న పక్షులను హేళనగా చూస్తూ “క్రింది వారంతా బావున్నారా! నేనూ కాకమ్మను, తలలు పైకెత్తి చూస్తేకానీ కనిపించను. మీపైన ఉన్నాను.” అనేది .
అంతా కాకి బడాయికి నవ్వుకునేవారు. అదే చెట్టుమీద క్రిందికొమ్మలో ఒక పిచ్చుక పిడకలతో గూడు కట్టుకుని నివసించేది. కాకి పిచ్చుకను బాగా హేళన చేసేది.
ఐనా పిచ్చుక పట్టించుకునేదేకాదు. “బాగున్నాను, కాకమ్మక్కా!” అని మాత్రం చెప్పేది.
కాకమ్మ కూం పిచ్చుకమ్మకూ తమ గుడ్ల నుంచీ రేండేసి పిల్లలచొప్పున గుడ్లనుంచీ వచ్చాయి.
పిచ్చుక పిల్లలు అరుస్తుంటే కాకమ్మ “అబ్బా! పిచ్చుకా! నీ పిల్లలనోర్లు మూయించు. ఆగోలకు మాపిల్లలు నిద్రపోలేక పోతున్నారు.”అని దబా యించేది. “సరే అక్కా! అలాగే ” అని ,”పిల్లల్లారా! పెద్దగా అరవకండి, మెల్లిగా కబుర్లు చెప్పుకోండి, కాకమ్మత్తకు నిద్రా భంగంట” అనితన పిల్లల కే చెప్పుకునేది.
నిజానికి కాకి పిలల్ల కా కా అరుపులే అందరికీ నిద్రాభంగం కలిగిం చేవి. ఐనా కాకి ఇతరులను దబాయించేది.
ఒకమారు బాగా వర్షం కురిసింది. ఆవానకు పిచ్చుకమ్మ పిడకల గూడు కరిగిపోయింది.పిచ్చుకమ్మ పిల్లలు చలికి గజ గజా ఒణుకుతూ ఉన్నాయి .
పిచ్చుక తానున్న చెట్టు మీదే వున్న కాకమ్మ గూడు దగ్గరకెళ్ళి “కాకమ్మక్కా!కాకమ్మక్కా! నాగూడు వానకు కరిగిపోయింది. పిల్లలు చలికి ఒణుకుతున్నారు. ఈ రాత్రికి కాస్త నీ గూట్లో నాపిల్లలకు చోటిస్తావా!” అని అడిగింది.
కాకమ్మ వెంటనే” ఛీ ఛీ నీ పిల్లల ఉచ్చా పియ్యా మాకు కంపు కొడతాయి. వీలుకాదు పోపో ” అని ధఢాలున తలుపేసుకుంది.
పాపం పిచ్చుక దిగులుగా వచ్చి పక్కనే ఉన్న మఱ్ఱి చెట్టు మొదట్లోకి పిల్లలను తెచ్చి ఉంచి క్రిందపడ్డ మఱ్ఱి ఆకులు తెచ్చి వాటికి కప్పిం, రాత్రం తా కాపలా కాస్తూ ఉంది.
ఎలాగో తెల్లవారి పోయింది, వానా ఆగిపోయింది. పిల్లలను పైన ఒక వెడల్పైన కొమ్మ మొదట్లో ఉంచి, పిల్లలకు కాస్త తిండి తెచ్చిపెట్టిది . ‘కదలకుండా అరవకుండా ఉండ’మని హెచ్చరించింది.నదీ సమీపానికి వెళ్ళి తనకు కావలసిన గడ్డి తీగలను తెచ్చుకుంది.ఈలోగా పిచ్చుకమ్మ స్నేహితురాలు వచ్చింది ,రాత్రి వానకు తన నెచ్చెలిఎలా ఉందో పలక రించను.
పిచ్చుకమ్మ స్నేహితురాలు చెప్పిందికదా” పిచ్చిదానా! మనం సివిల్ ఇంజనీర్లమే!మన పధ్ధతిప్రకారం గూడు కట్టు, నేను నీకు ముందే చెప్పా ను. నీవు వినలేదు.పదపద నేనూ కాస్తంత సాయం చేస్తాను. మన గూడు అలాకట్టుకుంటే ఒక్క చినుకు కూడా పడదు. “అని తానూ సహకరిం చింది. తిండీ విశ్రాంతీ మరచి ఇద్దరూ కలసి సాయంకాలానికి వారి పధ్ధతిప్రకారం చక్కని గూడు నిర్మించారు మఱ్ఱి చెట్టు మధ్య కొమ్మ మీద దాన్ని వ్రేలాడేలా ఆలోచించి నిర్మించారు.
పిచ్చుకమ్మ తన పిల్లలను ఇద్దరినీ గుటికి చేర్చేపని లో ఉండగా పిచ్చు క మ్మ స్నేహితురాలు వారి ముగ్గురికీ తిండి తెచ్చి పెట్టి వెళ్ళింది. స్నేహితురాలికి కృతజ్ఞత చెప్పుకుంది పిచ్చుకమ్మ.
కాలం గడుస్తున్నది.
ఈమారు పెద్ద తుఫాన్ వచ్చింది.విపరీతమైన గాలికి ఎత్తుగా ఉండే బూరుగు చెట్టు కొమ్మలన్నీ ఫెళఫెళావిరిగి పడిపోయాయి.కాకమ్మ గూడూ క్రిందపడి చెదరి పోయింది. కాకమ్మ పిల్లలు చలికి ఒణుకుతూ పెద్దగా అరవసాగాయి.
కాకమ్మ నిస్సిగ్గుగా పిచ్చుకమ్మ గూడు దగ్గకెళ్ళి” పిచ్చుక చెల్లాయ్! నాగూడు పడిపోయింది. నాపిల్లలు చలికి ఒణుకుతున్నాయ్! ఓరాత్రికి కాస్త చోటిస్తావా!” అని అడిగింది.
పిచ్చుకమ్మ తలుపు తెరచి “రా కాకమ్మక్కా! నీవూ లోనికిరా! నాకొత్త గూట్లో ఒక అతిధి గదికూడా ఉంది” అని ఆహ్వానించింది.
కాకమ్మ పిచ్చుకమ్మ గూట్లో తలదాచుకుంది. తెల్లా రింది. గాలీ వాన ఆగిపోయాయి. కాకమ్మ పిచ్చుకమ్మతో “పిచ్చుకచెల్లాయ్! నీదెంత మంచి మనసు, నీవు అడిగి నపుడు కాదన్నా, నాకూ నా పిల్లలకూ చోటిచ్చి పెద్ద మనసుతో ఆదుకున్నావ్!నీముందు సిగ్గుతో తలవంచు కుంటున్నాను, నన్ను మన్నించు” అని తలవంచు కుని చెప్పింది.
పిచ్చుకమ్మ ” అదేంటక్కా! తోటివారికి సాయం చేయ కుండా ఎలా ఉంటామూ! ఫరవాలేదు. రారా నేనూ సాయంచేస్తాను,ఆబూరుగుచెట్టుమీద కాక ఈ మఱ్ఱి చెట్టు మీదే గూడు కడదాం. ఈ చెట్టు కొమ్మలు గట్టిగా ఉంటయై విరగవు. అనిచెప్పి కాకమ్మకు గూడు కట్టుకోడంలో సాయపడింది.పిచ్చుకమ్మ చిన్నదైతేనేం ఎంత పెద్ద మనస్సుతో తనను సాయంకాదన్నా కాకమ్మకు ఎలా సాయం చేసిందో చూడండి.
తోటివారికి సాయంచేసే వారు నిజమైన జీవులు అని మనకు పిచ్చుకమ్మ వలన తెలుస్తునందికదా!

*****

Please follow and like us:

One thought on “చిన్నిపిట్ట పెద్ద మనసు(బాలల కథ)”

  1. పిల్లలికి అర్ధమయ్యే రీతిలో మంచి సందేశాత్మక కథ. సుమతీ శతకము లో చెప్పినట్లుగా “ఉపకారికి నుపకారము” అన్నట్టుగా ఉన్న మంచి నీతి ఉన్న కథ.

Leave a Reply

Your email address will not be published.