నా పల్లె లోకం లో …

– గవిడి శ్రీనివాస్

వేలాడే  ఇరుకు గదుల నుంచీ
రెపరెపలాడే  చల్లని గాలిలోకి
ఈ ప్రయాణం ఉరికింది .
ఔరా |
ఈ వేసవి తోటల చూపులు
ఊపిరి వాకిలిని శుభ్ర పరుస్తున్నాయి .

కాలం రెప్పల కిలకిలల్లో
ఎంచక్కా  పల్లె మారింది.

నిశ్శబ్ద మౌన ప్రపంచం లో
రూపు రేఖలు కొత్త చిగురులు  తొడిగాయి .

పండిన పంటలు
దారెంట పలకరిస్తున్నాయి .

జొన్న కంకులు ఎత్తుతూ కొందరు
ఆవులకు  గడ్డిపెడుతూ కొందరు
మామిడి తోట కాస్తూ కొందరు
ఇక్కడ చిరు నవ్వుల తోటను చూసాను .

కాసింత పల్లె గాలికి వికశించాను

ప్రయాణాలు ఎన్ని చేసినా
దూరాలు ఎన్ని మారినా
చెదరని స్వప్నంలా  నా పల్లె నిలిచింది.

ఇంటిలో కూచుంటే చాలు
చుట్టూ కాకుల కూతలు
పిచ్చుకల  కిచకిచలు
ఆప్యాంగా వాలుతుంటాయి.
తడితడిగా మనసుని కుదుపుతుంటాయి .

పల్లె తాకిన ప్రపంచం లో
మరో కొత్త అనుభవం పరచుకుంటుంది .

ఈ చల్లని పల్లె గాలుల్లో  తడిస్తే చాలు
కోల్పోయినవి  అనుభూతి చెందుతున్నట్లు ఉంటుంది .

****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.