
మారెమ్మల శోకం
-జూపాక సుభద్ర
సీత , రామున్ని సిటెం గూడా యిడువక అడవికి అడుగిడిoది సావిత్రి సత్య వంతుని సాయిత కోసం ఎముని ఎంటబడి ఎదిరించింది ద్రౌపది ఒంటరి మంటల మొసాడక పతులతో పాదచారియై పయనమైంది దమయంతి దాపు కోసమేకారడివికి నలునితో నడిచింది లక్ష్మీదేవయితే , విష్ణువు గుండెల గుంజ పాతి అడ్డ బిటాయించింది పార్వతమ్మ శంకరయ్య శరీరాన్ని సగం బడ పకడ్బందీగా పట్టా చేస్కున్నదిసరస్వతమ్మ బ్రహ్మ నోటిని కుటీరంగకోట గట్టుకున్నదిగంగా దేవమ్మ శివుని నెత్తిమీదనే మెత్తేసుకున్నది గీళ్లంతా మొగల నీడ లేకుండా నెగుల లేని విహంగీలు.గిసొంటి వాసాలు, ఆవాసాలు గోడలు, గోదాములు గూడెపాడోల్లకు యేడున్నయి పోషమ్మతో పొందుకొచ్చిన సుందరాంగుడుమైసమ్మ మనసు పడ్డ మారాజుఎల్లమ్మ ను కళ్లల్లో నింపుకున్న కాంతుడుఉప్పలమ్మ, ఊరడమ్మ వుప్పుసలను ఒప్పినొడు నూకాలమ్మ ,గంగానమ్మ ,పోలేరమ్మ ల ముద్దు తీర్సిన పొద్దోడుచరిత్ర పొలిమేర్లను పొతంబెట్టినాతోడు తొవ్వలు కానరాని కటిక చీకటి కాంతి పుంతలు.ఈ అవ్వల మహా బలాలు,తలాలువూరు, వాడలకు వూడిగం జేసినఉత్పత్తి శక్తి యుక్తులు.పల్లె పచ్చలకు బతుకు వెచ్చలకు’పొలి’ బలిగంపలుసెరువుకు నీటి కరువు దరి చేరనియ్యని నీళ్ళమేటలుఊరంచులకు కంచలైన కావల్లుకాలాన్ని కాటేసే ‘కరోనా ఎవ్వతివే’అంటే ,.,.ఎగిరిపడ్డ మహిలా మంటలు పెదవుల్ని కొరుక్కున్న ఫెమినిస్టులు ‘కరోనా మహమ్మారి’ అని వాడుకగా వల్లించినా మౌనాల చెల్లింపులేపెయిల పొక్కులు పొటమరిస్తే’అమ్మ తట్టు’ ‘అమ్మోరు పోసింద’ని అమ్మ తల్లుల్ని బద్నామ్ చేసినా బైసు గాదు, ఏ జెండర్ కుండలు మండయి .ఆదిశక్తి కి ఆశ జూపి బుదుగరిచ్చి బూడిది జేసిన త్రిమూర్ఖంఅంకమ్మ అతారెలను, జ్ఞాన కంటినికాజేసినోడు ముక్కంటిగా మొక్కులoదు కుంటoడు.ఆ మహా బలశాలుల ముందు మనలేని సతుకులుదండి మొండి జబ్బులకి జమానతు గా’ మహమ్మారి ‘ అనే నిందల నిప్పులు,నిద్ర బోనియ్యని హీన ముద్రలు.పేగుల్ని పెగ లేసే శోకాలుగీ మకిలి లోకం మనసు తట్టేనా……
******

జూపాక సుభద్ర కవయిత్రి, కథకురాలు, కాలమిస్టు, వ్యాసకర్త, అనువాదకురాలు, పరిశోధకరాలు, వక్తగా, సంఘసేవకురాలు, ప్రభుత్వ ఉన్నతాధికారిణి. బహుముఖ ప్రజ్ఞాశాలి. ప్రస్తుతం తెలంగాణ ఉద్యోగుల సంఘంలో కీలకంగా పనిచేస్తున్నారు.
సుభద్ర గారు తెలుగు సాహిత్యంలో, మహిళా సాహిత్యంలో ఉన్న అగ్రకుల బావజాలాన్ని ప్రశ్నిస్తూ, ఆధునిక సాహిత్యంపై విమర్శ చేస్తూ దళిత, బహుజన సాహిత్యం యొక్క ఉన్నతిని పెంపొందిస్తూ రచనలు చేసున్నారు.
