నువ్వు-నేను 

-యలమర్తి అనూరాధ

నిశ్శబ్ద సంగీతాన్ని అవలోకిస్తూ నువ్వు 
గిన్నెల శబ్దాలతో వంటింట్లో
ఉక్కిరిబిక్కిరవుతూ నేను 
అందమైన ఊహల్లో ఎగిరిపోతూ నువ్వు 
రేపటి పనిని ఈరోజుకే కుదించుకుంటూ నేను
జాగింగ్ లో ఆరోగ్యాన్ని పెంచుకుంటూ నువ్వు
అంతులేని పనితో శుష్కించిపోతూ నేను
ఆర్డర్లు వేయటంలో బిజీగా నువ్వు 
అమలుచేయడంలో ఖాళీ లేకుండా నేను
అభివృద్ధి పథంలో మహిళలు.. పేపర్లో చదువుతూ నువ్వు 
నీ షూస్ కి పాలిష్ చేస్తూ
నా ఆఫీసుకు వేళవుతోందని నేను 
ఆ పనికి సిద్ధమవుతూ నువ్వు 
వ్యతిరేకత మనసు నిండా ఉన్నా 
ఒప్పుకుంటూ నేను
నిద్రకు చేరువ కావాలని తపనలో నువ్వు
అలసిన మనః శరీరాలను
సేదతీర్చుకోవాలని నేను
పడక మీద మాత్రం ఇద్దరం 
జీవితపు ఆటలు కూడా కలిసి
పయనిస్తే
ఎంత అందం? ఎంత ఆనందం?  
ఇద్దరం ఒకటిగా కలిసి 
కష్టం సుఖం పంచుకుంటే 
అసలైన సమానత్వం అదేనని నమ్ముతా!
***
Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.