జ్ఞాపకాల సందడి-32

-డి.కామేశ్వరి 

కావమ్మకబుర్లు-1

కావమ్మకబుర్లు —–ఎవరీ కావమ్మా ఏమకతని మీరేం ఆలోచలో పడక్కరలేదండోయి ,ఈ కామేశ్వరేఁ  కావమ్మ-ఇంట్లో పిలుపది !ఇప్పుడంటే ఎనభయో పడి లో పడ్డాను కనక కావమ్మా అన్నకాముడు అన్న కావమ్మగారన్న నాకేమి అభ్యతరం లేదు .చిన్నప్పుడు నాకు జ్ఞానం వచ్చినన్దగ్గనించి అంట ఇదే పిలుపు .పట్టుమని పదేళ్లు లేని పిల్లని అంత పెద్దదాన్ని. చేసే ఆ మోటు పిలుపు. విన్నప్పుడల్లా ఉడుకుమోత్తనం వచ్చేది .తక్కిన అప్పచెల్లెళ్లకి. సుందరి, aహేమ, శ్యామల, అన్న మంచి పేర్లు పెట్టి నన్ను మాత్రం కావమ్మా భీవమ్మా అంటే ఉక్రోషం రాదా!కామేశ్వరే మోటు పేరు దాన్ని మరింత ఘోరఅంగ వక్రేకరించి కావమ్మా. అంటుంటే కర్ణకఠోరమం గ వినిపించేది . నేనేమన్నా పోనీ అనాకారి పిల్లనా దీనిమొహానికి ఈపేరు చాల్లే అనుకోడానికి -తెల్లగా ,పొడుగ్గా ఎర్రాజుట్టేసుకుని నన్నుచూసి అందరు ఇంగ్లిష్ పిల్లవున్నావు. ఈ దేశంలో పుట్టాల్సినదానివి కావు అంటూ మెచ్చుకునేవారుకదా .మరలాటప్పుడు మంచి పేరు పెట్టచ్చు కదా .ఓ రోజు ఉక్రోషం పట్టలేక మామేనత్త దగ్గరకెళ్ళి. అందరికి అంత మంచి పేర్లు పెట్టి నాకెదుకింత చెత్తపేరు పెట్టరు అనడిగా  ఎర్రమొహం మరింత ఎర్రబడి కన్నీళ్ల పర్యంతం అయి -అన్నాను ఆరోజుల్లో ఇప్పట్లా నాన్నలతో డైరెక్ట్గగ  మాట్లాడే దేర్యం ఉండేదికాదు. నాన్నలంటే పెద్దపులి అన్నంత భయం .అమ్మ

సరే మా అంముందంటే ఆవిడకి పిల్లలల్ని కనడం పెంచడం ముగుడుకి పిల్లలకి వండివార్చడం తప్ప పిల్లని ముద్దులాడి లాలించే తీరికుండేదికాదు .మా ఇంట్లో తలచెడిన మా మేనత్త ఒకావిడ ఉండేవారు తలచెడిన అంటే బుర్ర పాడయిన  అని అర్ధం కాదండోయి ఆరోజుల్లో విడో ని అలానేవారు .ఆవిడకి పాపం పన్నెండో ఏట  పెద్దమనిషవకుండా పెళ్లి చేస్తే  పధ్నలుగో ఏట తల్లియై పుట్టినబిడ్డ కల్లప్పకుండానేపోతే. పదిహేనోఏట  భర్తపోయి పుట్టిల్లు చేరిందిట .మాతాతగారు మామ్మగారు ఒకరి తరువాత ఒకరు ఏడాది లోగపోతే అక్కగారు తమ్ముడిని పన్నెండేళ్ళకే తల్లితందృలునిపోగుట్టుకున్న తమ్ముడికి తల్లియై పెంచి పెద్దచేసిందట. అంటే అక్కయ అమ్మ అయి పెంచింది. ఆవిడా మా నాన్న ఒకే ప్రాణంలా కలిసి పెరిగారు చిన్నప్పటినించి మా ఆలనా పాలనా ముద్దుమురిపాలు కంప్లైన్ట్లు. కనీళ్ళు ,కధలు చెప్పడా లు అన్నలు తినిపించడం జుట్టు దువ్వించుకోడం అన్ని ఆవిడదగ్గరే .అదేమిటే  నీ పేరు కేమో పార్వతీదేవి మాఇంటి ఇలవేలుపు పేరుపెట్టుకున్నాం అంది . ఇలవేలుపు అంటే ఒక్కోఇంటివారికి ఇలవేల్పు అని ఉంటుంది ఈశుభకార్యం జరిగిన న ఆవిడ్ని కొల్చుకుంటారు అలాటి దేవతపేరు నీది. తప్పు కళ్ళు పోతాయి అని లెంపలేసుకుంది ——.  

సశేషం – (ఈ కబుర్లు ముందు చేతనా అనే 2008లో ఒక మాస పత్రికలో రాసాను ఓ7,8రాసాక పత్రిక. ఆగిపోయింది. ఈతరం వారు ఈ కబుర్లు విని ఉండరని రాస్తున్న ఫోటో తీసి పెడదామంటే సరిగా రాలేదు అందుకుచచ్చి చెడిటైపు చేసి పెట్ట నచ్చితే. చెపుతా కబుర్లు )

*****

Please follow and like us:

2 thoughts on “జ్ఞాపకాలసందడి -32”

Leave a Reply

Your email address will not be published.