ప్రముఖ రచయిత్రి & కథావిశ్లేషకులు ఆర్.దమయంతి గారితో నెచ్చెలి ముఖాముఖి

-డా||కె.గీత 

(ఆర్.దమయంతిగారితో నెచ్చెలి ప్రత్యేక ముఖాముఖి వీడియోని పైన ఇస్తున్నాం. 
చూసి, మీ అభిప్రాయాలు తప్పక తెలియజెయ్యండి.)

రచయిత్రి, కథా విశ్లేషకులు, గాయని ఆర్.దమయంతి గారికి పలు వార మాస పక్ష దిన పత్రికలలో సబ్ ఎడిటర్ గా పని చేసిన అనుభవం వుంది. వంద పైని కథలు, అనేక వ్యాసాలు ప్రచురితమయ్యాయి. సమీక్షలు, సినిమా రివ్యూలు రాయడం, ఇంటర్వ్యూలు చేయడం అంటే తెగని మక్కువ. ఘాటైన విమర్శలతో సాహితీ వేత్తలని బెంబేలెత్తించడం కంటే, రచనల్లోని మంచిని గుర్తించి ప్రశంసించడం మంచిదంటారు. పొరబాట్లుంటే, సద్విమర్శతో సూచించడం వల్ల మేలైన రచనలు అందుతాయనీ, తద్వారా ఉత్తమసాహిత్యాన్ని చదవగల అవకాశం వుంటుందనీ, అదే తను చేయగల సాహితీ సేవ అని అభిప్రాయపడతారు.

          ‘కథ కాని కథ’ , ‘ఈ కథ ఎందుకు నచ్చిందంటే’, ‘నేను చదివిన కథ’ వంటి అనేక శీర్షికలను వివిధ ఆన్లైన్ మాగజైన్స్ – సారంగ, వాకిలి, సాహిత్యం (గ్రూప్) లో నిర్వహించారు. ప్రస్తుతం నెచ్చెలిలో ‘కథామధురం’,  ‘సంచిక’ ఆన్లైన్ మాస పత్రికలో ‘ట్విన్ సిటీస్ సింగర్స్ ‘ ఫీచర్ ని, ‘ తెలుగు తల్లి కెనడా ‘ మాస పత్రికలో ‘సిరిమల్లె చెట్టుకింద ..’ అనే శీర్షికలని నిర్వహిస్తున్నారు.

          వీక్షణం (కాలిఫోర్నియాలోని బే ఏరియా సాహిత్య సాంస్కృతిక సంస్థ), తెలుగు జ్యోతి (న్యూజెర్సీ)  వార్షికోత్సవ పత్రికలలో ఆర్.దమయంతి గారి కథలు ప్రచురితమయ్యాయి. ఆంధ్ర భూమి వారపత్రిక, స్వాతి (వీక్లీ, మంత్లీ) నవ్య వీక్లీ, మయూరి పత్రికలలో తో బాటు ఈమాట, కినిగె, వాకిలి, పొద్దు, సారంగ, లలో కూడా అనేక కథలు పబ్లిష్ అయ్యాయి.

         దమయంతి గారు  ప్రస్తుతం – నార్త్ కరోలినా (అమెరికా) లో నివసిస్తున్నారు.

*****

Please follow and like us:

3 thoughts on “ప్రముఖ రచయిత్రి & కథావిశ్లేషకులు ఆర్.దమయంతి గారితో నెచ్చెలి ముఖాముఖి”

 1. బహు ప్రతిభావంతులైన రచయిత్రి శ్రీమతి దమయంతిగారి అందమైన వ్యక్తిత్వాన్ని చిత్రీకరించడానికి గీత గారు చాలా చక్కటి ఇంటర్వ్యూను నిర్వహించారు.
  దమయంతిగారు చాలా నిరాడంబరమైన వ్యక్తి. రచయితలకు ఆమె ఇచ్చే సలహాలు మరియు ప్రోత్సాహం చాలా గొప్పది. ఆమె భావజాలాలు వాస్తవికమైనవి, చాలా ఆధునికమైనవి మరియు మానవతా దృక్పథంపై దృష్టి సారిస్తాయి.
  నా అభిప్రాయం ప్రకారం, ఏదైనా సంస్కరణను తీసుకురావడానికి లేదా ప్రజలను సరైన మార్గంలో నడిపించడానికి వారిని ప్రభావితం చేయడానికి రచయిత కీలకం. పెన్ చాలా జాగ్రత్తగా ఉపయోగించాల్సిన వెపన్. ఈ అంశంలో దమయంతి గారు అత్యంత ప్రతిభావంతురాలు మరియు ఆమె విలువైన రచనలు మరియు సలహాలు ఆలోచింపజేసేవి మరియు ఖచ్చితంగా సమాజంలో మంచిని తెస్తాయి

 2. బాగుందండీ. కాత్యాయని గారితో ఇంటర్వ్యూ వీడీయో కూడా చూసాను. ఆవిడ ప్రవృత్తి కి తగిన వృత్తిని ఎంచుకుని జీవితం సాఫల్యం చేసుకున్నారు. చక్కని పరిచయం. అభినందనలు.

 3. మీ గురించి ఇంత తెలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది దమయంతి గారు. కథ రాయడం, చదవడం ఇంత బాధ్యతతో చెయ్యాల్సిన పనులు కదా అనిపించింది మీరు పంచుకున్న విషయాల్ని వింటుంటే.

  మంచి ప్రశ్నలు అడిగారు గీత గారు.

  Thank you!

Leave a Reply

Your email address will not be published.