ప్రముఖ రచయిత్రి నంబూరి పరిపూర్ణ గారితో నెచ్చెలి ముఖాముఖి

-డా||కె.గీత 

(నంబూరి పరిపూర్ణగారితో నెచ్చెలి ప్రత్యేక ముఖాముఖి వీడియోని పైన ఇస్తున్నాం.
చూసి, మీ అభిప్రాయాలు తప్పక తెలియజెయ్యండి.)

***

నంబూరి పరిపూర్ణగారి వివరాలు:

జననం: 1931 జూలై 1న కృష్ణా జిల్లా బొమ్ములూరు గ్రామంలో
తల్లిదండ్రులు: నంబూరి లక్ష్మమ్మ, లక్ష్మయ్య
తోబుట్టువులు: శ్రీనివాసరావు, లక్ష్మీనరసమ్మ, దూర్వాసరావు, వెంగమాంబ,  జనార్ధనరావు
విద్యాభ్యాసం: 
       ప్రాథమిక విద్య: బండారిగూడెం, విజయవాడ
       హైస్కూల్: మద్రాసు, రాజమండ్రి
       ఇంటెర్మీడియేట్: పి. ఆర్. కాలేజీ, కాకినాడ
       టీచర్ ట్రైనింగ్: సెయింట్ థెరీసా మహిళా కళాశాల, ఏలూరు
       పట్టభద్రత: ప్రైవేటుగా బి.ఏ.
వివాహం: 1949, దాసరి నాగభూషణరావుతో
పిల్లలు: దాసరి శిరీష, దాసరి అమరేంద్ర, దాసరి శైలేంద్ర 
మనవలు-మనవరాళ్లు: అరుణ్, అపర్ణ, రాహుల్, స్రవంతి, అపూర్వ
ఉద్యోగం: 1. అధ్యాపక వృత్తి – 1955-58, నూజివీడు, ఏలూరు,  గోపన్నపాలెం
 

2. ప్రభుత్వోద్యోగం – 1958-1989, 30 ఏళ్ళు పైగా సోషల్ అండ్ ఎడ్యుకేషన్ ఆఫీసర్, పంచాయితీ రాజ్, చెన్నై కొత్తపల్లి, చిట్టి గూడూరు, బంటుమిల్లి – 1958-61

లైజాన్ ఆఫీసర్, స్త్రీ శిశుసంక్షేమ శాఖ, విజయవాడ, గుంటూరు, ఏలూరు – 1961-81

కమ్యూనిటీ డెవలప్మెంట్ ఆఫీసర్, హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ – 1981-89

పదవీ విరమణ: 1989 జులై 1
సాంస్కృతిక రంగం: 1. స్టేజి నాటకాలు : లోహితాస్యుడు
 

2. భక్తప్రహ్లాద సినిమా – 1941, శోభనాచల పిక్చర్స్, ప్రహ్లాదుడి పాత్ర, దర్శకత్వం: చిత్రపు నారాయణమూర్తి, సహనటులు: వేమూరి గగ్గయ్య, చదలవాడ రాజేశ్వరి,

జి వరలక్ష్మి. సినిమాలో ప్లే బ్యాక్ లేకుండా పాటలూ పద్యాలు 3. రేడియో నాటకాలు – 1943 బాలాంత్రపురజనీకాంతరావు ఆధ్వర్యంలో

4. 1944 కమ్యూనిష్టు పార్టీ ప్రచారంలో భాగంగా రాజమండ్రిలో వేదికల పై ప్రచార గీతాలు,

5. ఇద్దరూ ఒక్కటే- టెలీఫిల్మ్, అక్కినేని కుటుంబరావు దర్శకత్వంలో ప్రధాన భూమిక, 1986

6. స్వర పూర్ణిమ- ఆడియో పాటల ఆల్బం విడుదల, సర్రాజు ప్రసన్నకుమార్ సంగీత దర్శకత్వంలో – 2004

సాహిత్య వ్యాసంగం: 1. మాకురావు సూర్యోదయాలు, నవలిక, 1985
 

2. ఉంటాయి మాకు ఉషస్సులు, కథా సంపుటి, తోలి ముద్రణ 1998 మెరుగు పరిచిన రెండో ముద్రణ 2018

3. కథా పరిపూర్ణం కథా సంకలనం, 2006 (శిరీష అమరేంద్ర శైలీంద్రలతో కలిసి)

4. శిఖరారోహణ, వివిధ సామాజిక అంశాల పై స్త్రీ సమస్యల పై వ్యాసాలూ, కథలు సంపుటి 2016

5. వెలుగు దారులలో… ఆత్మకథ, 2017

6. పొలిమేర నవల, 2018

7. మరో నవల 2022లో అచ్చు కాబోతుంది.

8. 1965 నుంచి ఆకాశవాణి విజయవాడ హైదరాబాద్ కేంద్రాల నుంచి అనేక రేడియో ప్రసంగాలు

సామాజిక సేవ: వామపక్ష ఉద్యమాల్లో విద్యార్థి కార్యకర్తగా నేతగా, 1944-49
 

కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తగా నిర్బందాలు అజ్ఞాత జీవితం –1950-52

విజయవాడ హైద్రాబాద్ ల్లో సంఘటిత అసంఘటిత మహిళలతో సామాజిక కార్యక్రమాలు

ఆలంబన స్వచ్ఛంద సేవాసంస్థతో ఇరవై ఏళ్ళ అనుబంధం, చేయూత, క్రియాశీలక పాత్ర

అవార్డులు:

: విశాలసాహితి కథా పురస్కారం, 1996

వెంకటసుబ్బు అవార్డు, 2019

ప్రస్తుత నివాసం

: ఢిల్లీ & బెంగుళూరు

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.