ప్రముఖ రచయిత్రి రేణుకా అయోలా గారితో నెచ్చెలి ముఖాముఖి

-డా||కె.గీత 

(రేణుకా అయోలా గారితో నెచ్చెలి ప్రత్యేక ముఖాముఖి వీడియోని పైన ఇస్తున్నాం. చూసి, మీ అభిప్రాయాలు తప్పక తెలియజెయ్యండి.)

***

          రేణుక అయోల ఒరిస్సాలోని కటక్ ప్రాంతంలో జన్మించారు. ఈమె అసలు పేరు రేణుక అయ్యల సోమయాజుల. ఉద్యోగరీత్యా మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉండడం వల్ల హిందీ గజల్స్ వినడం, వాటిపై ఆసక్తి పెంచుకోవడం చేశారు. ఈ క్రమంలో చాలా గజల్స్‌ ను ఆమె తెలుగులోకి అనువదించారు. జగ్జీత్ సింగ్, పంకజ్ ఉదాస్, మెహదీహసన్, హరి హరన్ ఈమె అభిమానించే గజల్ కళాకారులు. గజల్స్ పై ఉన్న మక్కువే ఆమెను కవిత్వం రాయడానికి పురిగొల్పింది. ఆమె రాసిన ‘లోపలి స్వరం’ కవితా సంపుటిలో సగానికి పైగా కవితలు ఆమె దైనందిన జీవితంలో తారసపడ్డ సంఘటనలు, ఆమె జీవితం లో ముడిపడ్డ సన్నిహితుల గురించి, స్థలాల గురించి చెప్పినవే. 

రచనలు

 • రెండు చందమామలు (కథల సంపుటి)
 • పడవలో చిన్ని దీపం (కవితా సంపుటి)
 • లోపలి స్వరం (కవితా సంపుటి)
 • మూడవ మనిషి (హిజ్రాలపై దీర్ఘ కావ్యం)
 • ఎర్ర మట్టి గాజులు
 • సౌభాగ్య (రేణుక అయోల కవిత్వ విశ్లేషణ)
 • పృధ… ఒక అన్వేషణ (దీర్ఝకావ్యం)

పురస్కారాలు

 • రంజని కుందుర్తి (మంచి కవిత)
 • ఆంధ్రసారస్వత సమితి పురస్కారం ( వచన కవిత్వం)
 • రమ్యభారతి కథా పురస్కారం
 • ఇస్మాయిల్ అవార్డు ( వచన కవిత్వం 2012)
 • లేఖిని (మాతృదేవోభవ) పురస్కారం

*****

Please follow and like us:

4 thoughts on “ప్రముఖ రచయిత్రి రేణుకా అయోలా గారితో నెచ్చెలి ముఖాముఖి”

 1. కవన స్నేహితురాలు రేణుకా అయోలా గారి తో
  డా. కె.గీత గారు జరిపిన ముఖా
  ముఖి ఇంటర్వ్యూ .రేణుక గారి జీవితం,తన జీవితం పురిగొల్పిన తన కవిత్వ పరిచయం .. దీర్ఘ కవితల నేపద్యం విషయాలు తెలిసాయి …ఇరువురికి అభినందనలు👏💐❤️

 2. ప్రముఖ రచయిత్రి రేణుకా అయోలా గారి గురించి నెచ్చెలి ముఖాముఖి లో డా. కె.గీత గారు వెలువరించిన వివరాలు తెలుసుకోవటం ఆనందం కలిగించింది.రేణుకా గారి గురించి గతం లో విన్నాను.వారి గజల్స్,లోపలి స్వరం కవితా సంపుటి పరిచయమే.వివరాలు అందించిన గీత గారికి ధన్యవాదములు

Leave a Reply

Your email address will not be published.