అనుసృజన

మీనాకుమారి హిందీ కవిత-5

అనువాదం: ఆర్.శాంతసుందరి

అలనాటి మేటి హిందీ నటి మీనా కుమారి అసలు పేరు మాహ్ జబీన్. ఆమె కవయిత్రి అన్న విషయం మీకు తెలుసా? ఆమె మరణించాక గుల్జార్ ఆమె కవితలని సీడీగా రికార్డు చేశారు, మీనా కుమారి తన కవితలను స్వయంగా చదివి రికార్డ్ చేసిన వీడియోలు కొన్ని దొరికాయి. మూల (హిందీ) కవితలను తెలుగులో రాసాను, పాడుకోవడానికి వీలుగా ఉంటుంది. తెలుగు అనువాదం ఆమె కవితల్లోని భావాన్ని అర్థం చేసుకోవడానికి పనికొస్తుంది.
 

5.

 
ఆగాజ్ తో హోతా హై అంజామ్ నహీ( హోతా
జబ్ మేరీ కహానీ మే వో నామ్ నహీ( హోతా
జబ్ జుల్ఫ్ కీ కాలిఖ్ మే ఘుల్ జాయే కోయీ రాహీ
బద్ నామ్ సహీ లేకిన్ గుమ్ నామ్ నహీ( హోతా
హ(స్ హ(స్ కే జవాన్ దిల్ కే హమ్ క్యోం న చునే టుకడే
హర్ శఖ్స్ కీ కిసమత్ మే ఈనామ్ నహీ( హోతా
బహతే హుయే ఆంసూ నే ఆంఖోం సే కహా థమ్ కర్
జో మయ్ సే పిఘల్ జాయే వో జామ్ నహీ( హోతా
దిన్ డూబే హై( యా డూబీ బారాత్ లియే కశ్తీ
సాహిల్ పే మగర్ కోయీ కోహరామ్ నహీ( హోతా
 
నా జీవితంలో ఆ పేరు లేకపోతే
ప్రారంభం ఉంటుంది కాని దానికి ముగింపు ఉండదు
ఒక బాటసారి నల్లని కురులలో కరిగిపోతే
అపకీర్తి పాలౌతాడేమో కానీ కనపడకుండా పోడు
బద్దలైన హృదయం ముక్కలని నేను నవ్వుతూ ఎందుకు ఏరుకో కూడదు
ప్రతి వ్యక్తికీ బహుమతులే అందుకునే అదృష్టం ఉండదు కదా
ప్రవహించే కన్నీళ్ళు ఆగి కళ్ళతో ఇలా అన్నాయి
మధువులో కరిగిపోయేది మధుపాత్ర కాదు
పొద్దువాలిందో లేక పెళ్ళివారి నావ మునిగిపోయిందో కాని
తీరం వద్ద ఎటువంటి గగ్గోలూ , గలభా లేదు

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.