image_print

సంపాదకీయం-నవంబర్, 2025

“నెచ్చెలి”మాట కొత్త బంగారు లోకం -డా|| కె.గీత  అవునండీ మీరు విన్నది కరెక్టే కొత్త బంగారు లోకమే! ఏవిటండీ మీ పరాచికాలు! ఓ పక్క బంగారం ధర మండిపోతుంటేనూ! అయ్యో కొత్త బంగారు లోకం అంటే కొత్తగా బంగారంతోనో మణులతోనో తయారుచేసిన లోకం కాదండీ! ఎప్పుడూ ఈసురోమంటూ ఉండే రోజులు పోయి ఉత్తేజితమైన తేజోవంతమైన సరికొత్త రోజులు కూడా వస్తాయని నమ్మడమన్నమాట అన్నమాటేవిటీ ఉన్నమాటే ఉదాహరణకి న్యూయార్క్ నగరం వైపు ఓ సారి చూడండి చింతకాయ పచ్చడి […]

Continue Reading
Posted On :

నెచ్చెలి ఛానల్ కోసం ఆడియో (లేదా) వీడియో రచనలకు ఆహ్వానం!

నెచ్చెలి ఛానల్ కోసం ఆడియో (లేదా) వీడియో రచనలకు ఆహ్వానం! -ఎడిటర్ నెచ్చెలి యూట్యూబ్ ఛానల్ కోసం ఆడియో (లేదా) వీడియో రచనలకు ఆహ్వానం!* మీ రచన (కథ / కవిత/ ట్రావెలాగ్/ సాహిత్య ప్రసంగం) ని రికార్డ్ చేసి గూగుల్ డైవ్ లో పెట్టి editor@neccheli.com కు పంపండి. దానితో బాటూ రచన ప్రతిని యూనికోడ్ లో వర్డ్/ గూగుల్ డాక్ లో పంపించడం మర్చిపోకండి. *** నిర్వాహకులు: డా.కె.గీత, సంస్థాపక సంపాదకులు,  నెచ్చెలి అంతర్జాల వనితా మాస […]

Continue Reading
Posted On :

అనుబంధాలు-ఆవేశాలు – 1 (నవల) (ఈ నెల నుండి ప్రారంభం)

అనుబంధాలు-ఆవేశాలు – 1 (నవల) (ఈ నెల నుండి ప్రారంభం) – ప్రమీల సూర్యదేవర ముందుమాట ముఖంలో భావాలు తెలుపటానికి కళ్ళు అద్దాలవంటివని అంటారు. కాని గాజుకళ్ళలా ఉన్న ఆ కళ్ళల్లో భావాలు ఎక్కడ దాగి ఉన్నాయో!! క్షణికోద్రేకాలకు లోనైన వారి చర్యల ఫలితమే వారిని ఇక్కడకు చేర్చింది. ఒకానొకప్పుడు వారివారి కుటుంబాలతో కష్టసుఖాలు పంచుకుంటూ, వారివారి వృత్తులు నిర్వహించుకుంటూ ఉండేవారు. కిటికీకి ఈవలవైపున ఉన్న మనందరిలాగానే సమాజంలొ కష్టసుఖాలని ఎదుర్కొంటూ, వారివారి స్నేహితుల, బంధువుల ప్రేమాభిమానాలను […]

Continue Reading

శబ్దాల శాంతి (నెచ్చెలి-2025 పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ)

 శబ్దాల శాంతి (నెచ్చెలి-2025 కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ) – డా.లక్ష్మీ రాఘవ పార్వతి మరో సారి పిలిచింది కూతురు వాణిని.. దగ్గరలోకూర్చుని ఉన్నా మౌనంగా తలతిప్పిన వాణితో “ఏమిటో ఎప్పుడూ రెండుసార్లు పిలవాలి నిన్ను. మొదటి సారి పలకనే పలకవు..” విసుగ్గా అంది. ఎవరు మాట్లాడినా వాణికి ప్రతి పదం చెవికి అస్పష్టంగా వినిపించేది… గొల్లగొల్లు, బద్దలైన రేడియోలా. కానీ, వాళ్ల మనసులో ఏముందో మాత్రం ఆమెకు స్పష్టంగా వినిపించేది. అందుకేనేమో చిన్నప్పటి […]

Continue Reading
Posted On :
Suguna Sonti

ఋణానుబంధం

 ఋణానుబంధం -అక్షర అమ్మకు అంత్యక్రియలు జరిపి నేను, మా అబ్బాయ్ సంజూ , శ్రీనివాస్ తో కలిసి ఇంటికి తిరిగి వచ్చాము. వాళనాన్నమ్మ ఇంక ఉండదు అని తెలిసిన దగ్గర నుంచి వాడు కంటికి మంటికి ఏక ధారగా ఏడుస్తూనే ఉన్నాడు. “ ఇన్నాళకి నాకు కష్టం మీద దొరికిన నాన్నమ్మని కూడా దేముడు ఇంత త్వరగా తీసుకు పోయాడు” అంటూ నన్ను భారతిని పట్టుకుని కుమిలిపోతున్న కొడుకుని ఎలా సముదాయిం చాలో తెలీక మేమిద్దరం మౌనం […]

Continue Reading
Posted On :

దీపం వెలిగించాలి (నెచ్చెలి-2025 పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కవిత)

దీపం వెలిగించాలి  (నెచ్చెలి-2025 పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కవిత) – ములుగు లక్ష్మీ మైథిలి ఒక పాలు గారే చందమామను రాహు, కేతువులు మింగివేసినప్పుడు కూడలిలో నాలుగు కొవ్వొత్తులు వెలిగించినపుడు వెన్నెల కాంతి వెదజల్లదు కొన్ని గొంతులు కలిసి ఆక్రోశిస్తూ న్యాయం కావాలనే నినాదాలతో రోడ్డెక్కి దిక్కులు దద్దరిల్లేలా అరిస్తే భీతిల్లిన బాధితుల ఆక్రందనలు ఆగిపోవు అమ్మల పేగులు మెలిపెట్టినపుడు మీడియా ప్రశ్నల వర్షం కురిపిస్తే కడుపులో రగిలిన చిచ్చుతో జవాబులన్నీ నిప్పురవ్వలే చిమ్ముతాయి ఆరిపోయే […]

Continue Reading

ప్రమద- శకుంతలా దేవి

ప్రమద మ్యాథ్స్ తో మ్యాజిక్ చేసిన మానవ కంప్యూటర్ – శకుంతలా దేవి -నీరజ వింజామరం            సర్కస్ లో పని చేసే ఒక  వ్యక్తి తన మూడేళ్ల కూతురితో కార్డ్స్ ఆడుతున్నాడు. ప్రపంచాన్నే తన గారడీలతో మెప్పించ గల ఆ వ్యక్తి , మాటలు కూడా సరిగ్గా రాని తన చిన్నారి కూతురిచేతిలో ఓడిపోతున్నాడు. ఆ క్షణంలో కన్న ప్రేమతో పొంగిపోయి నప్పటికీ, తన కూతురు ఒక అద్భుతమని అతను […]

Continue Reading
Posted On :

ఈ తరం నడక-19- మెర్సీ మార్గరేట్ “యుద్ధకాలపు శోకగీతం”

ఈ తరం నడక – 19 మెర్సీ మార్గరేట్ “యుద్ధకాలపు శోకగీతం” -రూపరుక్మిణి వర్తమానమంతా యుద్ధ గీతాల్ని ఆలపిస్తూ, ఆలకిస్తూ బ్రతకాల్సి రావడం నేటి దుర్భరమైన పరిస్థితి. ఎటు చూసినా యుద్ధ విద్వంసమే. అధికారం కోసం ఒకడు పన్నిన కుట్రలో అనేక మందిని ఈ భూమి పొరల్లో కప్పి వేయబడుతున్నారన్న వాస్తవాన్ని గొంతెత్తి పలికేందుకు కూడా ఈ అధికారం అవకాశాన్ని లేకుండా చేస్తోన్న రోజుల్లో మనం జీవిస్తున్నాం. యుద్ధాన్ని కోరుకున్న వాడు,  ప్రకటించిన వాడు యుద్ధభూమికి రాడు. […]

Continue Reading
Posted On :

తుఫాన్ (నెచ్చెలి-2025 పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ)

 తుఫాన్ (నెచ్చెలి-2025 కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ) -పారుపల్లి అజయ్ కుమార్ సిరిమువ్వ ************ రైలు నెమ్మదిగా కదులుతోంది. ఆకాశం అంతా కారు మేఘాలు దట్టంగా అలుముకుని వున్నాయి. తూర్పుదిశ నుండి గాలులు వేగంగా వీస్తున్నాయి. చలి అనిపించి కిటికీ అద్దాన్ని క్రిందికి దించాను. రెండు రోజుల క్రితమే టీవీలో, పేపర్ లో తుఫాను హెచ్చరిక వచ్చింది. ఉదయం నుండి అడపాదడపా చిరుజల్లులు పడుతూనే వున్నాయి. చిన్న చిన్న చినుకులుగా కురుస్తున్న వాన పెద్దదవడం  […]

Continue Reading

(హిందీ: `చలాకీ పిల్ల – సముద్రస్నానం’ (चुलबुली लड़की, समंदर और डुबकियाँ) డా.బలరామ్ అగ్రవాల్ గారి కథ)

చలాకీ పిల్ల – సముద్రస్నానం चुलबुली लड़की, समंदर और डुबकियाँ హిందీ మూలం – డా.బలరామ్ అగ్రవాల్ తెలుగు అనువాదం – డా. కూచి వెంకట నరసింహారావు పోర్ట్ బ్లెయిర్ లో అది బహుశా మాకు మూడోరోజు. హేవ్ లాక్, నీల్ తిరిగి వచ్చాక మేము కార్బిన్ కోవ్స్ చూడటానికి బయలుదేరాం. అటువైపు వెడుతూ అనుకోకుండా నాదృష్టి నౌకలోని డెక్ మీద ఉన్న గుంపులో నిలబడివున్న ఒక కొత్త దంపతుల జంట మీద పడింది. అమ్మాయి […]

Continue Reading

నేల మీద నడక (కవిత)

నేల మీద నడక – నర్సింహా రెడ్డి పట్లూరి నేల నిండా పరుచుకున్న దారులు కాదని.. ఆకాశంలో లేని గీతల్ని ఊహించుకొని మరీ..! దేని కోసం దేన్ని కోల్పోతామో కోల్పోతే గాని అర్థం కాదు. అన్ని సార్లు దిద్దుబాటు ముగ్గు చెల్లుబాటు అవ్వదు. ప్రయాణానికి ప్రాణం వేగం. కక్ష్య దాటితే వేగం ప్రమాదాన్ని కౌగిలించుకుంటుంది. ఒకవైపు గాయాల పాలవుతూనే మరో వైపు దిగ్బంధం. నాణానికి రెండు వైపులా శూన్యం రంగురంగులుగా ఆవహిస్తుంది. దిగ్మండలం ఒక అద్భుతమైన కాంతుల […]

Continue Reading

ఆ కాగితం నా సహచరుడు (కవిత)

ఆ కాగితం నా సహచరుడు – సాయి కిషోర్ గిద్దలూరు సుగంధద్రవ్యాలు నాలోనే నేను దాచుకున్నాను అవి కనిపించవు, నా హృదయాలలో దాగున్నాయి. కనివిని ఎరుగని చోటు లేని అంతరంగంలో నేను ఒంటరివాడినైనప్పుడు నాలో ఆ ప్రశాంతత, సంతోషపు హాయిగా, ఆలోచనాత్మకంగా నా సిరాతో ఆ కాగితం పై నాలుగు వాక్యాలు రాస్తే ఎంతో ఆనందాన్ని ఇస్తుంది, అందుకే నాలో నేను ఆ కాగితంగా ఒంటరినై తపిస్తూ, ప్రవహిస్తూ ఎప్పటికీ ఎన్నటికైనా నేను ఒంటరివాడినే కానీ నాతో ఆ […]

Continue Reading

దుర్దశ దృశ్యాలు (కవిత)

దుర్దశ దృశ్యాలు -ఎరుకలపూడి గోపీనాథరావు వ్యాపార వాతావరణ కాలుష్యం దట్టంగా వ్యాపించిన బజారు వంటి సమాజంలో బహు విధాల వస్తువులుగా మార్పిడి చెందుతూ త్రోసుకుంటూ, రాసుకుంటూ సర్వత్రా మానవాకృతుల మాదిరి దివారాత్రులూ దిర దిరా సంచరించే ఆకారాలు మర తోలు బొమ్మల ఆకృతులే! అచ్చమైన మానవుని దర్శన భాగ్యం అందడం అతి కష్టమిక్కడ! సంబంధాలన్నీ ఆర్ధిక ప్రయోజనాల అయస్కాంతాల నంటి ఉండే కఠిన ధాతు శకలాలైన దైన్యం అంతటా విస్పష్టమిక్కడ! ఇక్కడి ప్రతి కూడలి ధనం లావాదేవీల […]

Continue Reading

ఆమె దేవత (నెచ్చెలి-2025 పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కవిత)

ఆమె దేవత  (నెచ్చెలి-2025 పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కవిత) – సురేష్ బాబు ఆమె దేవత…! ఆమె నింగిని ముద్దాడిన చోటే వెన్నెల పుట్టింది ఆమె చూపుల అమ్ము తగిలి నేల గుండె నిలువునా పులకలు పొడిచే పచ్చని కోరిక పుట్టుకొచ్చింది ఆమె నీలికళ్ళ నీడ నేల అద్దంలో సంద్రమై పొంగింది ఆమె నవ్వుకు చీకటి తెర తూట్లుపడి చుక్కల జననం జరిగింది గాలి కెరటాలపై తొలి పాట పల్లవి మోసుకొచ్చిన ఆనవాలు ఆమె గొంతు […]

Continue Reading
Posted On :

సిలికాన్ లోయ సాక్షిగా (కథలు)-6 ఫుడ్డు- వేస్టు ఫుడ్డు

సిలికాన్ లోయ సాక్షిగా (కథలు) 6. ఫుడ్డు- వేస్టు ఫుడ్డు అమెరికా గురించి వినడానికీ, ప్రత్యక్షంగా జీవించడానికీ మధ్య ఉన్న గీతని సుస్పష్టం చేసే సందర్భాలివన్నీ- పైకి గొప్పగా కనిపించే సమాజ అంతర్గత సంఘర్షణలో నలిగిన కొత్త మనిషి ఆంతరంగ ఆవేదనలివన్నీ- సిలికాన్ లోయ గుండె లోతుల్లో రహస్యంగా దాగి ఉన్న కథలివన్నీ… -డా||కె.గీత           “ఓర్నాయనో ఆపిల్ చెట్టు” దాదాపుగా చెట్టుకేసి పరుగెత్తుతూ అన్నాను.         […]

Continue Reading
Posted On :

కాదేదీ కథకనర్హం-18 తిరిగిరాని గతం 1

కాదేదీ కథకనర్హం-18 తిరిగిరాని గతం -డి.కామేశ్వరి  ఆటో దిగి శ్రీవల్లి లోపలికి అడుగుపెట్టింది. అప్పుడే ఇంట్లోంచి ఏదో శవం వెళ్ళినట్లు ఇల్లంతా నిశ్శబ్దంగా వుంది. అంతా తలోమూల వాడిన మొహాలతో కూర్చుని వున్నారు. మహిమ తండ్రి పేపరు ముఖానికి అడ్డం పెట్టుకున్నారు. పెద్దన్నయ్య శ్రీధర్ ఓ పుస్తకం, చిన్నన్నయ్య శ్రీకర్ ఓ పుస్తకం పట్టుకుని కూర్చున్నారు. – మహిమ ఎక్కడుందో కనపడ లేదు — ‘అంకుల్….ఏమయింది? ఎందుకు అంత అర్జంటుగా రమ్మన్నారు….’ వల్లి అందర్నీ చూస్తూ ఆరాటంగా […]

Continue Reading
Posted On :

దేవి చౌధురాణి (నవల) – రెండవ భాగం – మూలం-బంకిమ చంద్ర ఛటోపాధ్యాయ, తెనుగు సేత-విద్యార్థి

దేవి చౌధురాణి (రెండవ భాగం) మూలం – బంకిమ చంద్ర ఛటోపాధ్యాయ తెనుగు సేత – విద్యార్థి భోజనం అయ్యిన తరువాత నిశి వ్రజేశ్వర్‌ని దేవీ రాణి శయ్యాగారంలోకి ప్రవేశ పెట్టింది. అక్కడ ఒక రాజ దర్బారులాగా అంతా అమర్చి వుంది. ఎదురుగా ఒక స్వర్ణ సింహాసనం వుంది. ముత్యాల సరాలు వెనుకగా వ్రేలాడుతున్నాయి. కానీ వ్రజేశ్వరుడీ ధ్యానమంతా ఆ ఐశ్వర్యానికి స్వామిని ఎవరా అనే విషయం మీదనే వున్నది. అప్పుడు ఒక మూల సాధారణమైన కొయ్య […]

Continue Reading
Posted On :

అనుసృజన – హసరత్ జైపురి ప్రేమ గీతం

అనుసృజన హసరత్ జైపురి ప్రేమ గీతం మూలం : హసరత్ జైపురీ అనుసృజన: ఆర్ శాంతసుందరి జబ్ ప్యార్ నహీ( హై తో భులా క్యో( నహీ( దేతేఖత్ కిస్ లియే రక్ఖే హై( జలా క్యో( నహీ( దేతేకిస్ వాస్తే లిక్ఖా హై హథేలీ పే మేరా నామ్మై హర్ఫ్-ఏ-గలత్ హూ( తో మిటా క్యో( నహీ( దేతేలిల్లాహ్ శబ్-ఓ-రోజ్ కీ ఉలఝన్ సే నికాలోతుమ్ మేరే నహీ( హో తో బతా క్యో( నహీ( […]

Continue Reading
Posted On :

నడక దారిలో(భాగం-59)

నడక దారిలో-59 -శీలా సుభద్రా దేవి జరిగిన కథ:- (తండ్రి మరణానంతరం ఆర్థిక సంక్షోభంలోనే డిగ్రీ చదువుతో బాటు సాహిత్యం , సంగీతం బాపూ బొమ్మలు చూసి వేయటం. శీలా వీర్రాజుతో సభావివాహం. మా జీవితంలో పల్లవి చేరింది. వీర్రాజు గారు స్నేహితునితో కలిసి అడ్వర్టైజ్ ఏజెన్సీ పెట్టటం, ఆర్టీసి హైస్కూల్ లో చేరిక. వీర్రాజుగారు స్వచ్ఛందవిరమణ ,.అమ్మ చనిపోవటం, పల్లవి వివాహం, నాకు హిస్టెరెక్టమీ ఆపరేషన్, పల్లవికి పాప జన్మించటం, మా అమెరికా ప్రయాణం, పాప […]

Continue Reading

నా జీవన యానంలో (రెండవ భాగం) – 59

నా జీవన యానంలో- రెండవభాగం- 59 -కె.వరలక్ష్మి కార్యక్రమం మధ్యలో గునుపూడి అపర్ణగారి పుస్తకం ‘ఘర్షణ’ ను నాచేత ఆవిష్కరింపజేసారు. ఇండియా నుంచి పిలిచిన టి.వి.9 ఆర్టిస్టులు కొన్ని మిమిక్రీ కార్యక్రమాలు చేసారు, సినిమా నటుడు నారా రోహిత్ కి ఇక్కడ ఏవో షూటింగ్స్ ఉన్నాయట. అతన్ని పిలిచేరు. అతని చేత నాకు షాల్ కప్పించి సన్మానం చేసారు. మస్తుగా యాపిల్ ముక్కలు వేసిన ఉగాది పచ్చడి తిని తిరిగొచ్చాం. ఆ మర్నాడు అపర్ణగారింట్లో వీక్షణం మంత్లీ […]

Continue Reading
Posted On :

వ్యాధితో పోరాటం- 36

వ్యాధితో పోరాటం-36 –కనకదుర్గ బయట హాల్వేలో రోజులో మూడు నాలుగుసార్లు నడిచేదాన్ని. ఇవాళ రమ్య వచ్చిరాత్రి పడుకునే ఆఖరి రోజు. ఇంకా ఎపుడు డిశ్చార్జ్ చేస్తారో ఇప్పటిదాక చెప్పలేదు. ఈ రోజు చెబ్తారేమోనని ఎదురు చూస్తున్నాము. రేపు ఎలాగ? నాకు కొంచెం ధైర్యం వస్తుందనుకున్నాను కానీ సర్జరీ వల్ల ఒంట్లో శక్తి, మానసికంగా ఉండే శక్తి రెండూ పోయాయి నాకు. వాళ్ళు నొప్పికి ఇచ్చే మందు నేను హాస్పిటల్స్ లో ఉన్నన్ని రోజులు ఇస్తూనే వున్నారు. అది […]

Continue Reading
Posted On :

నా అంతరంగ తరంగాలు-32

నా అంతరంగ తరంగాలు-32 -మన్నెం శారద తప్పిపోయిన నా గురువులు గుర్రం మల్లయ్య గారు… ‘అయ్యో మీ గురువులు ఎక్కడ తప్పిపోయారూ?’ అని కంగారు పడకండి. నాకు ఆయన శిష్యరికం చేసి  చిత్రకళ నేర్చుకునే మహద్భాగ్యం తప్పిపోయిందని నా భావం. నాకు అయిదేళ్ళోచ్చేవరకు మేము ఒంగోల్లొనే వున్నాం. అదే మా నాన్నగారి ఊరు! “అదేంటి… మీ నాన్నగారి ఊరు నీది కాదా? ” అని మరో ప్రశ్న కూడా మీరడగడానికి వీలుంది. సహజంగా తల్లి ప్రభావం పిల్లల […]

Continue Reading
Posted On :

నా కళ్ళతో అమెరికా -4 (లాస్ ఏంజిల్స్ – మొదటి భాగం)

నా కళ్ళతో అమెరికా -4 లాస్ ఏంజిల్స్ – మొదటి భాగం డా|| కె. గీతామాధవి “నా కళ్లతో అమెరికా”- డా.కె.గీత చెప్తున్న ట్రావెలాగ్ సిరీస్. ఇందులో అమెరికాలోని కాలిఫోర్నియాతో ప్రారంభించి, అనేక ప్రాంతాల్ని గురించిన విశేషాలు ఉంటాయి. ఇవన్నీ అమెరికా చూడాలనుకున్న వారికి సులభమైన గైడ్లుగా ఉపయోగపడతాయి. ***** డా||కె.గీతడా|| కె.గీత పూర్తిపేరు గీతామాధవి. వీరు “నెచ్చెలి” వ్యవస్థాపకులు, సంపాదకులు. తూ.గో.జిల్లా జగ్గంపేటలో జన్మించారు. ప్రముఖ కథా రచయిత్రి శ్రీమతి కె. వరలక్ష్మి వీరి మాతృమూర్తి. భర్త, […]

Continue Reading
Posted On :

కథావాహిని-29 పరవస్తు లోకేశ్వర్ గారి “కల్లోల కలల మేఘం” కథ

కథావాహిని-29 కల్లోల కలల మేఘం రచన : పరవస్తు లోకేశ్వర్ గళం :కొప్పర్తి రాంబాబు ***** రాంబాబు కొప్పర్తికొప్పర్తి రాంబాబు  1959 ఆగస్ట్ 8వతేదీన కళా వాచస్పతి జగ్గయ్య గారి ఊరు కాంటినెంటల్ కాఫీ పరిమళాల దుగ్గిరాలలో జన్మించారు. అమ్మ లలితమ్మ, నాన్న సుబ్బారావు గారు. పెరిగింది, చదువుకున్నది సాహితీ కేంద్రమైన తెనాలిలో. 1980 లో ఇండియన్ బ్యాంక్ లో చేరి ముంబై , చెన్నై నగరాల్లో ఎక్కువ కాలం పనిచేసి 2019 లో విశాఖపట్నం డిప్యూటీ […]

Continue Reading

వినిపించేకథలు-53 – డా||సోమరాజుసుశీల గారి కథ “కరువు”

వినిపించేకథలు-53 కరువు రచన : డా||సోమరాజుసుశీల గారి కథ గళం : వెంపటి కామేశ్వర రావు  ***** వెంపటి కామేశ్వర రావువెంపటి కామేశ్వర రావు తమ వినిపించేకథలు యు ట్యూబ్ చానల్ ద్వారా సుప్రసిద్ధ రచయితల/రచయిత్రుల కథలు వినిపిస్తూ శ్రోతల మన్ననలు పొందుతున్నారు. ప్రయివేట్ సెక్టార్ లో పర్సనల్ మేనేజర్ గా సుదీర్ఘకాలం సేవలందించిన వీరు తమ విశ్రాంత జీవితం లో తమకిష్టమైన అభిరుచులకు మెరుగులు దిద్దుకుంటున్నారు.ఆకాశవాణి లో casual news reader,auditioned drama artist. గతంలో […]

Continue Reading
K.Geeta

గీతామాధవీయం-50 (డా||కె.గీత టాక్ షో)

గీతామాధవీయం-50 (డా||కె.గీత టాక్ షో) -డా||కె.గీత “గీతామాధవీయం” టోరీ టాక్ షో (Geetamadhaveeyam Tori Talk Show- Week-50) అసమాన సాహిత్యం! ఆపాతమధురసంగీతం!! ప్రతి ఆదివారం- మధ్యాహ్నం 2 గం.- 3గం. PST (USA) జులై 23, 2022 టాక్ షో-50 లో *సాహిత్యం: వెనుతిరగని వెన్నెల భాగం-50 (కథ) Listen Live @ http://onlineradios.in/embed/teluguone/ Calling Numbers during the show: USA: 703-659-2199 UK: 020-3287-8674 Australia: 02-8006-8674 India: 9666-77-8674 *** డా||కె.గీతడా|| […]

Continue Reading
Posted On :

యాత్రాగీతం-73 అమెరికా నించి ఐరోపాకి (ఇంగ్లాండ్ -ఫ్రాన్స్ – ఇటలీ) ట్రావెలాగ్ భాగం-8

యాత్రాగీతం అమెరికా నించి ఐరోపాకి (ఇంగ్లాండ్ -ఫ్రాన్స్ – ఇటలీ) ట్రావెలాగ్ భాగం-8 -డా||కె.గీత ఇటీవల మేం చేసిన ఐరోపా యాత్రని గురించి నా ట్రావెలాగ్ సిరీస్ “యాత్రాగీతం” లో భాగంగా ఫేస్ బుక్ సిరీస్ గా రాస్తున్నాను. చదవాలనుకున్న మిత్రులు నేరుగా నా వాల్ మీద చదవొచ్చు. చదివి మీ అభిప్రాయం పెట్టడం మర్చిపోకండి.* *** ఇంగ్లాండ్ -లండన్ (రోజు-1) లండన్ విహారం ప్రారంభం అండర్ గ్రౌండ్ రైలు: లండన్ లో మా అంతట మేం […]

Continue Reading
Posted On :
Kandepi Rani Prasad

అనీమియా

అనీమియా -కందేపి రాణి ప్రసాద్ ఉదయం 9 గంటలు కావస్తూ ఉన్నది. అదొక స్కూలు. పిల్లలందరూ అప్పుడే లోపలకు వస్తూ ఉన్నారు. బ్యాగుల మోతలతో, జారుతున్న కళ్ళ జోళ్ళను సరి చేసుకుంటూ హడావిడిగా వస్తున్నారు. ప్రేయర్ టైముకు పిల్లలంతా హాజరు కావాలి. తర్వాత వచ్చిన వాళ్ళకి స్కేలుతో రెండు దెబ్బలు కొట్టాకనే లోపలికి పంపుతారు. ప్రేయర్ బెల్ మోగింది. పిల్లలందరూ లైన్లలో నిలబడుతున్నారు. టీచర్లు కూడా వాళ్ళను సరిగా నిలబెట్టటంలో బిజీగా ఉన్నారు. క్లాసుల వారీగా చక్కగా […]

Continue Reading

పౌరాణిక గాథలు -34 – కపాలమోచన తీర్థ౦

పౌరాణిక గాథలు -34 -భమిడిపాటి బాలాత్రిపుర సు౦దరి కపాలమోచన తీర్థ౦ తీర్థము అ౦టే నీరు. అది కొలనులో ఉ౦డేదేనా కావచ్చు .. నదో .. సముద్రమో.. కోనేరులో నీరో కావచ్చు. ఇ౦టికెవరేన వచ్చినప్పుడు కొ౦చె౦ మ౦చి తీర్థ౦ పుచ్చు కు౦టారా? అని అడగడ౦ మనకు పరిపాటే. కపాలమోచన తీర్థ౦ కాశీలో ఉ౦ది. కాశీ వెళ్ళిన వాళ్ళ౦దరూ తాము చేసిన పాపాలు పోవాలని దీ౦ట్లో మునిగి స్నాన౦ చేసి వస్తు౦టారు. అ౦టే పాపాలు చేసినప్పుడల్లా దీ౦ట్లో మునగమని కాదు. […]

Continue Reading

రాగసౌరభాలు- 20 (శ్రీ రంజని రాగం)

రాగసౌరభాలు-20 (శ్రీ రంజని రాగం) -వాణి నల్లాన్ చక్రవర్తి సన్మిత్రులందరికి శుభాభినందనలు. క్రిందటి నెల మనమందరం ఘనంగా ధనలక్ష్మీ దేవిని ఆహ్వానించి,  పూజించి, రంగు రంగుల దివ్వెల కాంతులలో దీపావళి పర్వదినం చేసుకున్నాము. అలాగే పరమ పవిత్రమైన కార్తీక మాస పూజలకు శ్రీకారం చుట్టాము కదా? లక్ష్మీ అమ్మవారిని రంజింపజేసే మరియొక రాగం, శ్రీరంజని రాగ విశేషాలు ఈ నెల మీకోసం. ఈ రాగం మరీ పురాతనమైనది కాదు. 72 మేళకర్తలని ఏర్పరచి, ఒక్కొక్క రాగంలో జన్యరాగాలను […]

Continue Reading

గజల్ సౌందర్యం-6

గజల్ సౌందర్యం- 6 -డా||పి.విజయలక్ష్మిపండిట్           తెలుగు గజల్ రచనలో భావాలు, భాష, చమత్కారం వంటి అంశాలలో కొత్త మార్పులు వస్తున్నాయి. ఇది తెలుగు గజల్‌కు ఒక ఆధునిక రూపాన్ని ఇస్తోంది.           ప్రస్తుతం చాలామంది కవులు తమ గజళ్లను వారు స్వయంగా లేదా గాయకులతో పాడించి, వాటిని YouTube , ఇతర సామాజిక మాధ్యమాల్లో వీడియోలుగా పెడుతున్నారు. ఇది విస్తృతంగా తెలుగు గజళ్లను దృశ్య, శ్రవణ […]

Continue Reading

కనక నారాయణీయం-74

కనక నారాయణీయం -74 –పుట్టపర్తి నాగపద్మిని           గట్టిగా స్వచ్చంగా నవ్వుతున్న పుట్టపర్తి నిర్మల వదనంలో ఏదో తెలియని ఆకర్షణ, వల్లంపాటిని నిరుత్తరుణ్ణి చేసింది.           నాన్నెప్పుడూ అంటూ ఉంటారు. సౌందర్య లహరిలో ‘శరజ్యోత్స్నా శుద్ధాం శశియుత జటాజూట మకుటాం.. ‘ అనే శ్లోకం నిరంతర పారాయణం చేస్తూ ఉంటే, వాక్ శక్తినిస్తుందట ఆ తల్లి! ఆ కరుణ పుట్టపర్తి పై నిండుగా వర్షిస్తున్నదా జగన్మాత!’ […]

Continue Reading

బొమ్మల్కతలు-34

బొమ్మల్కతలు-34 -గిరిధర్ పొట్టేపాళెం            ఆట పాటలతో, బామ్మ బొమ్మల కథలతో హాయిగా సంతోషంగా గడిచి పోయే కాలం బాల్యం. జీవితంలో ఏ చీకూ చింతా లేని అందమైన, ఆనందమైన, అమరమైన అతి చిన్నదైన భాగం. ఎప్పుడు పెద్దవుతామా అనుకునేలోపే పెరిగి పెద్దయిపోతాం. ఆటలు పాటలు తగ్గుతూ, చదువు సంధ్యలు పెరుగుతూ, బడి, పుస్తకాలు, హోమ్ వర్కులు, పరీక్షలు ఇలా ఒక్కో క్లాస్ పైకెళ్ళే కొద్దీ చదువు బాధ్యతలే రోజులో ఎక్కువ […]

Continue Reading
Posted On :

చిత్రం-68

చిత్రం-68 -గణేశ్వరరావు ఆర్టెమిజా జెంటిలెక్సి 17వ శతాబ్దపు ఇటాలియన్ చిత్రకారిణి. ఆమె 1620లో గీసిన ఈ చిత్రం పేరు – జూడిత్, హోలోఫర్నెస్ తల నరకడం. ఓల్డ్ టెస్టమెంట్లోని కథ. అస్సిరి యన్ ఆర్మీ జనరల్ హోలోఫర్నెస్ జుడిత్ ఉన్న నగరాన్ని ముట్టడి చేస్తాడు. బాగా తాగి ఉంటాడు. ఆమె అదే అదనుగా అతని తల నరికి, తన సేవకురాలితో సొంత ఊరికి తిరిగి వస్తుంది. ఈ ఇతివృత్తాన్ని ఆర్టెమిజా అందరినీ అబ్బురపరచేటట్టు స్పష్టమైన దృశ్య రూపంలో […]

Continue Reading
Posted On :

మధురాంతకం నరేంద్ర నవల ‘మనోధర్మ పరాగం’ పరిచయం

2020 ఆటా బహుమతి పొందిన మధురాంతకం నరేంద్ర నవల ‘మనోధర్మ పరాగం’ పరిచయం -పి. యస్. ప్రకాశరావు 19, 20 శతాబ్దాలలో తంజావూరు, మధురై పట్టణాలలోని దేవదాసీలబాధాతప్త హృదయాల చిత్రీకరణే ‘మనోధర్మ పరాగం’ నవల. స్త్రీ, పురుషుడి పడక సుఖం కోసమే అని భావించే వాతావరణం నుంచి పుట్టినదే దేవదాసీ వ్యవస్థ. రచయిత ఈ సమాచారం కోసం చాలా పరిశోధన చేసినట్టు తెలుస్తోంది. బ్రిటిష్ వాళ్ళు పన్నులద్వారా వచ్చే ఆదాయానికి గండి పడుతోందని దేవదాసీల ఈనాం భూముల్ని […]

Continue Reading

ఎమ్మెస్సార్ జాతీయ స్థాయి కథల పోటీ- 2025 కి కథలకు ఆహ్వానం

ఎమ్మెస్సార్ జాతీయ స్థాయి కథల పోటీ- 2025 కి కథలకు ఆహ్వానం -ఎడిటర్ (జాతీయస్థాయి కథల పోటీకి నవ్యత, సృజన, సామాజిక స్పృహ  కలిగిన కథలకు ఆహ్వానం!) కీ.శే. శ్రీ మలిశెట్టి సీతారామ్ గారి స్మారకార్థం ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఔత్సాహిక రచయితల నుండి కథలు ఆహ్వానిస్తున్నాము. బహుమతి పొందిన కథలతో పాటు మరి కొన్ని ఎంపిక చేసిన ఉత్తమ కథలతో “కథా ప్రపంచం 2025” పుస్తకం ప్రచురించబడుతుంది.            […]

Continue Reading
Posted On :

సంపాదకీయం-అక్టోబర్, 2025

“నెచ్చెలి”మాట (అ)సంతృప్తి -డా|| కె.గీత  సంతృప్తి – అసంతృప్తి – ఒక్క అక్షరం తేడాలో ఏముంది?! కాదు కాదు ఆ ఒక్క అక్షరంలోనే అంతా ఉంది- ప్రపంచమంతా ఉంది- అ(దే) అన్నిటినీ తలకిందులు చేస్తుంది అసలు ఎవరికైనా దేనికైనా సంతృప్తి అనేది ఉందా?! ఎన్ని చేసినా ఇంకా ఎవరో ఏదో చేయలేదనే – నిరంతరం ఎవరో ఒకరి మీద నెపాలే నిరంతరం ఏదో ఒక దానికి ఫిర్యాదులే అసలు ఎవరైనా మనకు ఏదైనా ఎందుకు చెయ్యాలి? అసలు […]

Continue Reading
Posted On :

నెచ్చెలి ఛానల్ కోసం ఆడియో (లేదా) వీడియో రచనలకు ఆహ్వానం!

నెచ్చెలి ఛానల్ కోసం ఆడియో (లేదా) వీడియో రచనలకు ఆహ్వానం! -ఎడిటర్ నెచ్చెలి యూట్యూబ్ ఛానల్ కోసం ఆడియో (లేదా) వీడియో రచనలకు ఆహ్వానం!* మీ రచన (కథ / కవిత/ ట్రావెలాగ్/ సాహిత్య ప్రసంగం) ని రికార్డ్ చేసి గూగుల్ డైవ్ లో పెట్టి editor@neccheli.com కు పంపండి. దానితో బాటూ రచన ప్రతిని యూనికోడ్ లో వర్డ్/ గూగుల్ డాక్ లో పంపించడం మర్చిపోకండి. *** నిర్వాహకులు: డా.కె.గీత, సంస్థాపక సంపాదకులు,  నెచ్చెలి అంతర్జాల వనితా మాస […]

Continue Reading
Posted On :

31 రోజుల నెల (హిందీ: “31 का महीना” డా. లతా అగ్రవాల్ గారి కథ)

31 రోజుల నెల 31 का महीना హిందీ మూలం – డా. లతా అగ్రవాల్ తెలుగు అనువాదం – డా. కూచి వెంకట నరసింహారావు కాంత తన కష్టసుఖాలు నాతో చెప్పుకుంటూ ఉంటుంది. నేను కూడా వీలయినంత వరకు నా సఖీధర్మాన్ని నిజాయితీతో నిర్వహిస్తున్నాను. కాని ఇవాళ ఎందుకో ఏదో విషయాన్ని కాంత దాచటానికి ప్రయత్నిస్తోందని నాకనిపించింది. ఆమె ముఖంలో ఒక మొహమాటంలాంటిది కనిపించింది. తను మాటిమాటికీ పైకి మెట్లవైపు ఏకాగ్రంగా చూస్తోంది. అప్పుడే మనుమరాలు […]

Continue Reading

నీ కనుపాపను నేనై (నెచ్చెలి-2025 పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ)

నీ కనుపాపను నేనై (నెచ్చెలి-2025 కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ) -వేలూరి ప్రమీలాశర్మ ఆటో దిగి ఆశ్రమం గేటు వైపుకి రెండు అడుగులు వేసిన స్వాతి… ఒక్క క్షణం ఆగి పైన బోర్డు మీద రాసి ఉన్న అక్షరాలు మరోసారి చదువుకుంది. “సునందా మానసిక వికలాంగుల సంరక్షణాలయం” గుండ్రని అక్షరాలతో పొందికగా రాసి ఉన్న ఆశ్రమం బోర్డుకి రెండు వైపులా… అపురూపంగా బిడ్డను పొదివి పట్టుకున్న మాతృమూర్తి చిత్రం ఒకవైపూ, నీడ నిస్తున్న మహావృక్షం […]

Continue Reading

ఐనా..నేను ఓడిపోలేదు (నెచ్చెలి-2025 పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కవిత)

ఐనా..నేను ఓడిపోలేదు  (నెచ్చెలి-2025 పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కవిత) – బి.కళాగోపాల్ నీ మనోవాంఛలు తీర్చుకోవడానికి నన్నో దేవిని చేసి పూజించావు/ నీ దైహికవాంఛలు తీర్చుకోవడానికి నన్నో వేశ్యను చేసి రమించావు/ శిరోముండనాలు, సతీసహగమనాలు, అలనాటి సనాతన సాంప్రదాయమన్నావు/ గడపదాటని కట్టడి బతుకుల గానుగెద్దు చాకిరీలు/ నోరువిప్పనీయని కంటిచూపుల శాసనాలు/ ఒకప్పటి పురాతన ధర్మమన్నావు/ మరి నేటి యుగధర్మమేమి బోధిస్తుంది అనాది పురుషా?!/ అలాగా తల్లులపై అత్యాచారం మినహా / అంటుడు ముట్టుడు అన్నింటికి అంటున్న […]

Continue Reading
Posted On :

ఈ తరం నడక-18- మిణుగురులు (చల్లపల్లి స్వరూపారాణి)

ఈ తరం నడక – 18 మిణుగురులు (చల్లపల్లి స్వరూపారాణి) -రూపరుక్మిణి  చీకటిని చీల్చిన దివ్వెలు చీకటి మాటున వెలుగు ఎప్పుడూ ఉంటుంది. అనుమానమే లేదనడానికి నిదర్శనాలు నాకు చాలా ఎదురవుతూనే వున్నాయి. అటువంటి మరో నిదర్శనమే ఈసారి నే పరిచయం చేయబోతున్న పుస్తకం. కొన్ని పుస్తకాలు మనం ఎంచుకుంటాం. మరికొన్ని పుస్తకాలు మాత్రం మనల్ని వెతుక్కుంటూ వచ్చి మన కోసమే మనల్ని చేరుతాయి. అటువంటి అరుదైన పుస్తకం అందుకోవడానికి నేను చాలా దూరమే ప్రయాణం చేయాల్సి […]

Continue Reading
Posted On :

ప్రమద- సుధా చంద్రన్

ప్రమద సుధా చంద్రన్ -నీరజ వింజామరం  నటరాజ పాదాల నాట్య మయూరి… రోడ్డు ప్రమాదంలో కాలు పోగొట్టుకున్న ఒక  17 ఏళ్ల అమ్మాయి, ‘జైపూర్ ఫూట్’ అనే కృత్రిమ పాదంతో మళ్లీ నృత్యం చేయగలనని ప్రపంచానికి నిరూపించింది. ఈ సాహసమే ఆమెను దేశానికి స్ఫూర్తి చిహ్నంగా నిలబెట్టింది. ఆమె కథ కేవలం వ్యక్తిగత విజయం కాదు, పట్టుదల ఉంటే వైకల్యం అనేది ఒక అడ్డంకి కాదని నిరూపించిన గొప్ప సామాజిక సందేశం. ఆమె మరెవరో కాదు, నాట్య […]

Continue Reading
Posted On :

త్వంజీవ శరదాం శతమ్ (నెచ్చెలి-2025 పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ)

త్వంజీవ శరదాం శతమ్ (నెచ్చెలి-2025 కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ) -గౌతమ్ లింగా నా రిటైర్మెంట్ జీవితానికి రెండు సంవత్సరాలు.. మనసుగా మనిషిగా కూడా చాలా నిదానంగా ఉంటున్నాను. ఉద్యోగంలో ఉన్నన్నాళ్ళు ఆలోచనల్లో పనుల్లో పనులు చేయించడంలో చాలా చురుకుగా ఉండేదాన్ని ఇప్పుడా చురుకుదనం లేదు కావాలనే తగ్గించుకున్నాను. వయసు కూడా 60 సంవత్సరాలు దాటింది నా ఉద్యోగ జీవితమంతా ఉరుకులు పరుగులే. స్త్రీ శిశు సంక్షేమ శాఖలో అధికారిణిగా దాదాపు నలభై సంవత్స రాలు పనిచేసాను. ముప్పై నలభై […]

Continue Reading
Posted On :

మళ్ళీ చూస్తానా! (నెచ్చెలి-2025 పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కవిత)

మళ్ళీచూస్తానా!  (నెచ్చెలి-2025 పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కవిత) – మళ్ళ.కారుణ్య కుమార్ మళ్ళీ చూస్తానా చిరు చినుకుల తాకిడికి పరవశించి తాండవం చేసిన ఆ మట్టి రేణువుల ఆనందాన్ని! చినుకును ఆలింగనం చేసుకున్న ఆ మాగాణిలో రేగిన సుగంధాన్ని! పూల వెల్లువై మురిసిపోతూ సిగ్గు పడుతూ మెల్లమెల్లగా నేల రాలుతున్న ఆ చినుకులుతో కరచాలనం చేసి వెళ్లివిరిసిన ఆ సూర్య కిరణాలు స్పృశించిన హరివిల్లును! మళ్ళీ చూస్తానా రహదారికి ఇరువైపులా నిటారు చెట్టుల చిటారు కొమ్మలకు […]

Continue Reading

పరాజితుణ్ణి (కవిత)

పరాజితుణ్ణి -ఉదయగిరి దస్తగిరి రంగుపూసల్లాంటి నవ్వుల్ని ఆమె పెదవుల నుండి లాక్కుంటాను మాటకత్తినిసిరి కళ్ళలో నిద్రని హత్య చేస్తాను ఏడాదంతా శిశిర ఋతువుని శరీరమంతా పండిస్తాను వాడిన పువ్వవుతుందనుకుంటే సీతాకొకచిలుకలా నన్ను స్పర్శిస్తూ పాత ప్రేమని మాగిన పండులా గుండెకు తినిపిస్తుంది నిద్రిస్తున్న పాప పసితనాన్నంత ఒంట్లోకి వొంపి తానో పాపవుతుంది నావొడిలో ఆక్షణం గతం నీటిబుడగై నేనో ప్రేమకొలనవుతా కలువ తానై రాత్రికి వెన్నెల చిత్రాల్ని గీయిస్తూ రోజుల పేజీలని తిప్పేస్తుంది దాయాదిరాళ్ళో పొరుగింటి కొప్పులో […]

Continue Reading

స్వల్పధరకే నిద్ర (కవిత)

స్వల్పధరకే నిద్ర (కవిత) – శ్రీ సాహితి నిద్రను అమ్మే సంత ఇంకా తెరచుకోలేదు నీలో జేబు నిండా తృప్తితో కొనే స్తోమత ఉంటే అతి స్వల్ప ధరకే పెద్ద మొత్తంలో నీకే అమ్ముతుంది. పడక, పరుపు, మత్తు, మైకం అక్కరలేని కళ్ళు స్వేచ్ఛగా నీకు కాస్తా దూరంగా తీసుకెళ్ళి ఏది గుర్తుకురాలేంత ప్రదేశంలో వదలివస్తాయి నిన్ను. ఒక్కడివే సంతోషంగా మేల్కొని తిరిగిస్తుంటే మెరిసిపోతూ మురిపిస్తాయి. ***** సాహితి -మా ఊరు అద్దంకి, ప్రకాశం జిల్లా, (ఆంధ్రప్రదేశ్.) […]

Continue Reading
Posted On :

సిలికాన్ లోయ సాక్షిగా (కథలు)-5 డ్రైవింగు- లైసెన్సు

సిలికాన్ లోయ సాక్షిగా (కథలు) 5. డ్రైవింగు- లైసెన్సు అమెరికా గురించి వినడానికీ, ప్రత్యక్షంగా జీవించడానికీ మధ్య ఉన్న గీతని సుస్పష్టం చేసే సందర్భాలివన్నీ- పైకి గొప్పగా కనిపించే సమాజ అంతర్గత సంఘర్షణలో నలిగిన కొత్త మనిషి ఆంతరంగ ఆవేదనలివన్నీ- సిలికాన్ లోయ గుండె లోతుల్లో రహస్యంగా దాగి ఉన్న కథలివన్నీ… -డా||కె.గీత డ్రైవింగ్ లైసెన్స్ మాట ఎత్తేసరికి సూర్య ముఖం మళ్లీ కంద గడ్డలా తయారైంది. అదెందుకో అర్థం కావాలంటే సూర్య డ్రైవింగ్ లైసెన్సు కథ […]

Continue Reading
Posted On :

కాదేదీ కథకనర్హం-17 పురోగమనానికి పునాదిరాళ్ళు

కాదేదీ కథకనర్హం-17 పురోగమనానికి పునాదిరాళ్ళు -డి.కామేశ్వరి  “సారీ సునీతా, ఐయామ్ వెరీ సారీ . ఐయామ్ హెల్ప్ లెస్ …….కమిటీ మెంబర్లంతా తేల్చాక నేను ప్రతిసారీ కలుగజేసుకోడం బాగుండదు గదా….” ప్రిన్సి పాల్ జయలక్ష్మీ తేల్చి చెప్పేసింది. సునీత నిట్టూర్చి కుర్చీలోంచి లేచి నిలబడింది. నిజమే, ఎవరు ఎన్నాళ్ళు సహాయం చేస్తారు. ఆరేళ్ళ బట్టి ఎలాగో ట్రాన్స్ ఫర్ లేకుండా ప్రతిసారీ ఎవరినో పట్టుకుని బతిమిలాడి అపు చేయించుకుంటోంది. ‘సునీతా ప్రతీవాళ్ళకి ఏదో యిబ్బందులుంటాయి ఉద్యోగం అన్నాక. […]

Continue Reading
Posted On :

దేవి చౌధురాణి (నవల) – రెండవ భాగం – మూలం-బంకిమ చంద్ర ఛటోపాధ్యాయ, తెనుగు సేత-విద్యార్థి

దేవి చౌధురాణి (రెండవ భాగం) మూలం – బంకిమ చంద్ర ఛటోపాధ్యాయ తెనుగు సేత – విద్యార్థి జరుగుతున్న పరిణామాలకి వ్రజేశ్వర్ నిర్ఘాంతపోయాడు. కొంచెం తేరుకున్న తరువాత. “సాగర్, నువ్వు ఇక్కడకు ఎలా వచ్చావు?” అని అడిగాడు. “సాగరపతి, మీరు ఇక్కడకు ఎలా వచ్చారు?” అని ప్రతి ప్రశ్న వేసింది సాగర్. “నేను బందీని, నువ్వు కూడా బందీవా? నన్ను డాకూలు ఇక్కడికి పట్టుకువచ్చారు. నిన్ను కూడా అలాగే పట్టుకు వచ్చారా?” “నేనేమీ బందీని కాదు. నన్ను […]

Continue Reading
Posted On :

అనుసృజన – మొక్క మూగదా?

అనుసృజన మొక్క మూగదా? మూలం : కుమరేంద్ర మల్లిక్ అనుసృజన: ఆర్ శాంతసుందరి ఆలోచనల్లో తేలిపోతూఒక రోజు ఉదయాన్నే మొక్కలకి నీళ్ళు పడుతుంటేనా కుడి చెవి మీదపక్కింటి గోడ మీదుగా వాలినతీగొకటి తగిలి నట్టనిపించిందిఒక్క క్షణందాన్ని తోసెయ్యాలనీతుంపి పారెయ్యాలనీ అనిపించిందికానీ నేనలాటి పనేదీ చెయ్యలేదు,దాన్ని చేత్తో పట్టుకుని గోడ మీంచి తొంగి చూశాను.దాని పాదు పూర్తిగా నీళ్ళులేక ఎండిపోయి కనిపించింది…మౌనంగా ఆ తీగ నాకేం చెప్పాలనుకుందో తెలిసింది,’నాకు కూడా దాహంగా ఉందిఒక బకెట్టు నీళ్ళు నాకు కూడా […]

Continue Reading
Posted On :

నడక దారిలో(భాగం-58)

నడక దారిలో-58 -శీలా సుభద్రా దేవి జరిగిన కథ:- (తండ్రి మరణానంతరం ఆర్థిక సంక్షోభంలోనే డిగ్రీ చదువుతో బాటు సాహిత్యం , సంగీతం బాపూ బొమ్మలు చూసి వేయటం. శీలా వీర్రాజుతో సభావివాహం. మా జీవితంలో పల్లవి చేరింది. వీర్రాజు గారు స్నేహితునితో కలిసి అడ్వర్టైజ్ ఏజెన్సీ పెట్టటం, ఆర్టీసి హైస్కూల్ లో చేరిక. వీర్రాజుగారు స్వచ్ఛందవిరమణ ,. అమ్మ చనిపోవటం, పల్లవి వివాహం, నాకు హిస్టెరెక్టమీ ఆపరేషన్, పల్లవికి పాప జన్మించటం, మా అమెరికా ప్రయాణం, […]

Continue Reading

నా జీవన యానంలో (రెండవ భాగం) – 58

నా జీవన యానంలో- రెండవభాగం- 58 -కె.వరలక్ష్మి 2015 జనవరిలో మా గీత నాకోసం టిక్కెట్టు కొనేసి మరోసారి నాకు అమెరికా ప్రయాణం పెట్టింది. ఫిబ్రవరి 4న మా అబ్బాయి, కోడలు, చిన్నమనవరాలు సవర్ణిక వచ్చి తెల్లవారు ఝామున 4 గంటలకి నన్ను ఎయిర్ పోర్ట్ లో దిగబెట్టేరు. బ్రిటిష్ ఎయిర్ వేస్ లో చెకిన్ తొందరగానే అయిపోయింది. ఉదయం 7. కి ఫ్లైట్ కదిలింది. పది గంటలు గాల్లో ప్రయాణించి లండన్ హీత్ రో ఎయిర్ […]

Continue Reading
Posted On :

వ్యాధితో పోరాటం- 35

వ్యాధితో పోరాటం-35 –కనకదుర్గ మధ్యాహ్నం వరకు కునుకులు తీస్తూనేవున్నాను. జూలియాని కెఫెటీరియాకెళ్ళి లంచ్ తిని రమ్మన్నాను. నేను క్యాన్సర్ వార్డ్ లో వున్నపుడు నాతో బాగా మాట్లాడిన స్టూడెంట్ డాక్టర్ వచ్చింది నాకు చెప్పినట్టుగానే. కానీ నేనెక్కువగా మాట్లాడలేక పోయాను. నేనెక్కువగా మాట్లాడకపోయేసరికి తను ఏం చేయాలో తెలియక వెళ్ళిపో యింది. తను గుర్తు పెట్టుకుని వచ్చినందుకు సంతోషంగా వుంది అనైనా అనలేక పోయినందుకు నాకు బాధగా అనిపించింది. శ్రీనివాస్ మధ్యాహ్నం ౩ గంటలకు వచ్చాడు. అంతకు […]

Continue Reading
Posted On :

నా అంతరంగ తరంగాలు-31

నా అంతరంగ తరంగాలు-31 -మన్నెం శారద 5వ శతాబ్దానికి చెందిన మహా పండితుడయిన విష్ణు శర్మను మూర్ఖులయిన తన ముగ్గురు కొడుకులకు విద్యదానం చేయమని , అందుకు తగిన పారితోషకం ఇస్తానని ఒక రాజు ప్రాధేయ పడతాడు. తనకెటువంటి పారితోషకాలు వద్దని, విద్యను తాను అమ్ముకోనని వారిని తీర్చి దిద్దుతానని మాట ఇచ్చి వారిని తనతో తీసుకు వెళ్తాడు విష్ణుశర్మ. వారు మూర్ఖులు కనుక వారికి అర్ధమయ్యే రీతిలో జంతువుల పాత్రలను  ఆకర్షణీయంగా పంచతంత్రం పేరిట నాలుగు […]

Continue Reading
Posted On :

నా కళ్ళతో అమెరికా -3 (శాంతాక్రూజ్)

నా కళ్ళతో అమెరికా -3 శాంతాక్రూజ్ డా|| కె. గీతామాధవి “నా కళ్లతో అమెరికా”- డా.కె.గీత చెప్తున్న ట్రావెలాగ్ సిరీస్. ఇందులో అమెరికాలోని కాలిఫోర్నియాతో ప్రారంభించి, అనేక ప్రాంతాల్ని గురించిన విశేషాలు ఉంటాయి. ఇవన్నీ అమెరికా చూడాలనుకున్న వారికి సులభమైన గైడ్లుగా ఉపయోగపడతాయి. ***** డా||కె.గీతడా|| కె.గీత పూర్తిపేరు గీతామాధవి. వీరు “నెచ్చెలి” వ్యవస్థాపకులు, సంపాదకులు. తూ.గో.జిల్లా జగ్గంపేటలో జన్మించారు. ప్రముఖ కథా రచయిత్రి శ్రీమతి కె. వరలక్ష్మి వీరి మాతృమూర్తి. భర్త, ముగ్గురు పిల్లలతో కాలిఫోర్నియాలో నివాసముంటున్నారు. […]

Continue Reading
Posted On :

కథావాహిని-28 గురజాడ అప్పారావు గారి “దేవుళ్లారా మీ పేరేమిటి?” కథ

కథావాహిని-28 దేవుళ్లారా మీ పేరేమిటి? రచన : గురజాడ అప్పారావు గళం :కొప్పర్తి రాంబాబు ***** రాంబాబు కొప్పర్తికొప్పర్తి రాంబాబు  1959 ఆగస్ట్ 8వతేదీన కళా వాచస్పతి జగ్గయ్య గారి ఊరు కాంటినెంటల్ కాఫీ పరిమళాల దుగ్గిరాలలో జన్మించారు. అమ్మ లలితమ్మ, నాన్న సుబ్బారావు గారు. పెరిగింది, చదువుకున్నది సాహితీ కేంద్రమైన తెనాలిలో. 1980 లో ఇండియన్ బ్యాంక్ లో చేరి ముంబై , చెన్నై నగరాల్లో ఎక్కువ కాలం పనిచేసి 2019 లో విశాఖపట్నం డిప్యూటీ […]

Continue Reading

వినిపించేకథలు-52 – తెన్నేటి హేమలత గారి కథ “గోపీ హృదయం”

వినిపించేకథలు-52 గోపీ హృదయం రచన : తెన్నేటి హేమలత గారి కథ గళం : వెంపటి కామేశ్వర రావు  ***** వెంపటి కామేశ్వర రావువెంపటి కామేశ్వర రావు తమ వినిపించేకథలు యు ట్యూబ్ చానల్ ద్వారా సుప్రసిద్ధ రచయితల/రచయిత్రుల కథలు వినిపిస్తూ శ్రోతల మన్ననలు పొందుతున్నారు. ప్రయివేట్ సెక్టార్ లో పర్సనల్ మేనేజర్ గా సుదీర్ఘకాలం సేవలందించిన వీరు తమ విశ్రాంత జీవితం లో తమకిష్టమైన అభిరుచులకు మెరుగులు దిద్దుకుంటున్నారు.ఆకాశవాణి లో casual news reader,auditioned drama […]

Continue Reading
K.Geeta

గీతామాధవీయం-49 (డా||కె.గీత టాక్ షో)

గీతామాధవీయం-49 (డా||కె.గీత టాక్ షో) -డా||కె.గీత “గీతామాధవీయం” టోరీ టాక్ షో (Geetamadhaveeyam Tori Talk Show- Week-49) అసమాన సాహిత్యం! ఆపాతమధురసంగీతం!! ప్రతి ఆదివారం- మధ్యాహ్నం 2 గం.- 3గం. PST (USA) జులై 16, 2022 టాక్ షో-49 లో *సాహిత్యం: వెనుతిరగని వెన్నెల భాగం-49 (కథ) Listen Live @ http://onlineradios.in/embed/teluguone/ Calling Numbers during the show: USA: 703-659-2199 UK: 020-3287-8674 Australia: 02-8006-8674 India: 9666-77-8674 *** డా||కె.గీతడా|| […]

Continue Reading
Posted On :

యాత్రాగీతం-72 అమెరికా నించి ఐరోపాకి (ఇంగ్లాండ్ -ఫ్రాన్స్ – ఇటలీ) ట్రావెలాగ్ భాగం-7

యాత్రాగీతం అమెరికా నించి ఐరోపాకి (ఇంగ్లాండ్ -ఫ్రాన్స్ – ఇటలీ) ట్రావెలాగ్ భాగం-7 -డా||కె.గీత ఇటీవల మేం చేసిన ఐరోపా యాత్రని గురించి నా ట్రావెలాగ్ సిరీస్ “యాత్రాగీతం” లో భాగంగా ఫేస్ బుక్ సిరీస్ గా రాస్తున్నాను. చదవాలనుకున్న మిత్రులు నేరుగా నా వాల్ మీద చదవొచ్చు. చదివి మీ అభిప్రాయం పెట్టడం మర్చిపోకండి.* *** ఇంగ్లాండ్ -లండన్ (రోజు-1) ఐరోపా చేరిన వేళ! ఎట్టకేలకు సుదీర్ఘకల నించి మేల్కొన్నట్లు లండన్ హీత్రో ఎయిర్ పోర్టులో […]

Continue Reading
Posted On :
Kandepi Rani Prasad

చిలుక జోస్యం

చిలుక జోస్యం -కందేపి రాణి ప్రసాద్ “మన మిత్రురాలిని అక్రమంగా నిర్బందించారు. వేట గాళ్ళను వదిలి పెట్టకూడదు మనుషుల వద్ద మన రామచిలుక ఎలా బాధపడుతున్నదో ఏమో! మనుషులంత దుర్మార్గులు ఎవరూ లేరు!” అంటూ ఆవేశంగా యువ రామచిలుకలు మాట్లాడాయి. “ఏమైంది నాకే విషయమూ తెలియలేదు ఎందుకు అంత కోపంగా ఉన్నారు” అని అప్పుడే వచ్చిన పిచ్చుక అందర్నీ చూస్తూ అడిగింది. అక్కడ కాకులు, నెమళ్ళు, చిలుక లు, పావురాలు పిచ్చుకలు వంటి పక్షులన్నీ సమావేశమై ఉన్నాయి. […]

Continue Reading

పౌరాణిక గాథలు -33 – ఋక్షవిరజుడు

పౌరాణిక గాథలు -33 -భమిడిపాటి బాలాత్రిపుర సు౦దరి ఋక్షవిరజుడు కా౦చనాద్రి మధ్యశృ౦గ౦ దగ్గర తపస్సు చేసుకు౦టున్నారు బ్రహ్మగారు. చాలా దీక్షగా తపస్సు చేసుకు౦టున్న బ్రహ్మగారి కళ్ళవె౦బడి నీళ్ళు వచ్చాయి. ఆ నీళ్ళు కి౦ద పడకూడదని తన దోసిల్లోకి పట్టారు బ్రహ్మగారు. ఆ కన్నీటి చుక్కల్లో౦చి ఒక వానరుడు పుట్టాడు. అతడికి “ ఋక్షవిరజుడు” అని పేరు పెట్టారు. అడవిలో దొరికే ప౦డ్లు తి౦టూ బతకమని అ వానరానికి చెప్పాడు బ్రహ్మ. బ్రహ్మగారు చెప్పినట్టే అడవిలో దొరికేవన్నీ తి౦టూ […]

Continue Reading

రాగసౌరభాలు- 19 (చారుకేశి రాగం)

రాగసౌరభాలు-19 (చారుకేశి రాగం) -వాణి నల్లాన్ చక్రవర్తి ప్రియ మిత్రులందరికీ దసరా శుభాకాంక్షలు. అమ్మవారి ఆశీస్సులు మన అందరిపై అపారంగా కురవాలని కోరుకుంటున్నాను. అందమైన కేశ సంపద కలిగిన అమ్మవారి ప్రతిరూపంగా ఈ నెల మనము చారుకేశి రాగం గురించిన విశేషాలు తెలుసుకుందాము. నేడు ఉపయోగించే గోవిందాచార్యుల వారి 72 మేళకర్తల పథకంలో ఈ చారుకేశి రాగం 26వ మేళకర్త. వెంకటమఖీ సాంప్రదాయ పథకంలో ఈ రాగం పేరు తరంగిణి. ముత్తుస్వామి దీక్షితుల వారు కూడా ఈ […]

Continue Reading

గజల్ సౌందర్యం-5

గజల్ సౌందర్య – 5 -డా||పి.విజయలక్ష్మిపండిట్ గజల్స్ అందం వాటి సాహిత్య లోతులో ఉంటుంది. గజల్ నిర్మాణాత్మక కవితా రూపంలో ప్రేమ, విరహం, నిరీక్షణ , అస్తిత్వ ఆందోళన అనే సామాజిక ఇతివృత్తాలపై గజల్ కవుల యొక్క భావోద్వేగాల భావ రూప చిత్రాలు ,శబ్దాలంకారాల శ్రావ్యమైన లయ లో గజల్ అందం కనిపిస్తుంది, “ఆత్మలను పలికించేదే అసలైన భాష ఆవిలువ కరువైతే అది కంట శోష “ అన్నారు సి. నా. రే. ఒక గజల్ లో. […]

Continue Reading

కనక నారాయణీయం-73

కనక నారాయణీయం -73 –పుట్టపర్తి నాగపద్మిని           ఇంటిలో ఆఖరి బిడ్డ చిన్నారి రాధ, మొట్టమొదటి దౌహిత్రుడు చి.బాణగిరి కృష్ణప్రసాద్ కేరింతల మధ్య రోజులు వేగంగా దొర్లిపోతున్నాయి. అల్లుడు రాఘవ నామకరణం తరువాత కర్నూల్ వెళ్ళిపోయాడు. సెప్టెంబర్ నెల ప్రవేశించింది.           రెండవ బిడ్డ తరులతకు కూడా హంపీ కమలాపురంలో సీమంతోత్సవం తరువాత, పుట్టింటికి రాక, పుట్టింటిలోనే సులభంగా కుమారుడు జన్మించటం, అల్లుడు రామానుజా చార్యులు […]

Continue Reading

బొమ్మల్కతలు-33

బొమ్మల్కతలు-33 -గిరిధర్ పొట్టేపాళెం           ఈ అనంత విశ్వంలో మన ప్రమేయం లేకుండా సాగిపోయే ఒక అద్భుతం – కాలం. ఇందులో “మారనిది ఇది” అంటూ ఏదీ ఉండదు. ప్రతిదీ ఇందులో ఇమిడి పోవాల్సిందే. ముందుకి పోతూ వెనకటితో పోలిస్తే ఎంతో కొంత మారి తీరాల్సిందే. అది జీవమైనా, సజీవమైనా, నిర్జీవమైనా. చెక్కు చెదరవు అనిపించే మనిషి జ్ఞాపకాలైనా, కాలంతో ఎంతో కొంత మారుతూ ముందుకి పోవాల్సిందే.         […]

Continue Reading

చిత్రం-67

చిత్రం-67 -గణేశ్వరరావు మోలీ క్రేబ్ఏపిల్ – కోపం నిండిన. చిత్ర కారిణి. 19వ శతాబ్దపు ఉద్యమ చిత్ర కారుల్లా తను నమ్మిన విశ్వాసాలకు ప్రాచుర్యం కలిగించేందుకు తన కళను వాడుతుంది. ఫోటో-పాత్రికేయురాలిగా వివాదాస్పద అంశాల మీద దృష్టి పెట్టి అధివాస్తవికత చిత్రాలు చిత్రీస్తూ వాల్ స్ట్రీట్ ఆక్రమణ.. వీధి పోరాటంలో పాల్గొని పలు ఉద్యమాలకి దృశ్యగీతం గా మారింది – పోరాటవీరులను, శరణార్ధులను, పోలీసుల బాధితులను నల్లని రేఖా చిత్రాలుగా తన శైలిలో చూపించింది. ఎన్నో వాల్యూమ్ […]

Continue Reading
Posted On :

హిమజ్వాల – వడ్డెర చండీదాస్ నవలా సమీక్ష

హిమజ్వాల – వడ్డెర చండీదాస్ నవలా సమీక్ష -పద్మావతి నీలంరాజు చెరుకూరి సుబ్రమణ్యేశ్వర రావు గారి కలం పేరు “వడ్డెర చండీదాస్”. బడుగు జనుల మీదున్న సోదరభావనే ఆయన తన పేరు మార్చుకునేందుకు ప్రేరణ అని చెప్పారు. ఆయన ప్రధమ నవల ‘హిమజ్వాల’, రెండవ నవల ‘అనుక్షణికం’, అత్యంత ఆదరణను పొందాయి. ఆయన అంటారు,” సాహిత్యము, జీవితము – ఈ రెండు హారతి కర్పూరం లాంటివి. అయితే అవి ఎప్పటికీ అరిపోని గుభాళించే భావజ్వాలల,” అని. “అలాగే […]

Continue Reading
Posted On :

‘అంతరంగం’ భారతి శ్రీవారి పుస్తక సమీక్ష

 ‘అంతరంగం’ భారతి శ్రీవారి పుస్తక సమీక్ష -డా.మారంరాజు వేంకట మానస మహిళా సాధికారతకు అక్షరాలా నిర్వచనం భారతి శ్రీవారి గారి ” అంతరంగం “. ఒక స్త్రీ సహజంగానే తన ఇల్లు బాగుండాలని కోరుకుంటుంది. ఇక చిన్నతనం నుండి తల్లిదండ్రుల మార్గదర్శకత్వం, వివాహానంతరం భర్త ప్రోత్సాహం తోడైతే ఇల్లు మాత్రమే కాదు తన చుట్టూ ఉన్న సమాజమంతా బాగుండాలని కోరుకుంటుంది. తాను ఏం చేస్తే సమాజమంతా సుఖసంతోషాలతో వర్ధిల్లుతుంది అని ఆలోచించి తన వంతుగా ఇబ్బందు లలో […]

Continue Reading

జీవితం అంచున జీవ మధువు

జీవితం అంచున జీవ మధువు -వల్లూరి రాఘవరావు కాలే నా నుదుటి మీద తన తమలపాకు అరచెయ్యి చప్పున తీసేసింది ఈ రచన.  పైపై జ్వరమే కాదు, లోలోపల అలుముకుపోయిన రంగులతోట కూడా నువ్వే అనిపించేటంత చల్లగా చెప్పిన తనదైన కధ ఇది. ఐనా సరే ఎక్కడో అక్కడ మనదే అనిపిస్తుంది. కనుకే ఇన్ని లక్షలమందికి నచ్చింది జీవితం చివరి అంచున రచన. అన్ని చోట్ల మనిషిని తెలివి మాత్రమే కాపాడలేదు. అప్పుడప్పుడు మీ మంచితనం కూడా […]

Continue Reading

“రవిక” (రేణుక అయోల’ గారి కవిత్వ సమీక్ష)

 “రవిక” (రేణుక అయోల’ గారి కవిత్వ సమీక్ష) -ఎ.రజాహుస్సేన్ ‘రేణుక అయోల’ గారి.. “రవిక ” కావ్యమ్.!” (Anthology Poems by Renuka Ayola) *ఆమెకి తన రవికలేని భుజాలు నచ్చలేదు!! *కోరిక తెల్ల సీతాకోక చిలుకై వెంటాడింది.. *చూపులవేట తప్పించుకోడానికి ఇనుప కచ్చడాలు మోసింది..!! *సంపూర్ణ స్త్రీవాద కవిత్వం.. స్త్రీ గుండె చప్పుడు .”రవిక”.!! కవిత్వంలో వైవిధ్యానికి మరో పేరంటూ వుంటే, అది ఖచ్చితంగా అది“రేణుక అయోల” అయ్యుంటుంది.” పడవలో చిన్నదీపం” నుండి మొదలైన రేణుక […]

Continue Reading
Posted On :

వీక్షణం సాహితీ గవాక్షం (కాలిఫోర్నియా) 13వ వార్షికోత్సవ సమావేశం

వైభవంగా వీక్షణం సాహితీ గవాక్షం (కాలిఫోర్నియా) 13వ వార్షికోత్సవ సమావేశం   -ఎడిటర్ వీక్షణం సాహితీ గవాక్షం 13వ వార్షికోత్సవ సమావేశం సెప్టెంబర్ 13, 2025న కాలిఫోర్నియాలోని ఫ్రీమౌంట్ లో అత్యంత వైభవంగా జరిగింది. ఈ సమావేశానికి ప్రత్యేక అతిథులుగా శ్రీమతి ఎల్.విజయలక్ష్మి (అలనాటి మేటి నటీమణి), శ్రీ సురజిత్ కుమార్ దే దత్తా, డా. కాత్యాయనీ విద్మహే, శ్రీ జి. వల్లీశ్వర్, శ్రీమతి కె.వరలక్ష్మి గార్లు విచ్చేశారు. ఈ సందర్భంగా వీక్షణం ప్రత్యేక రచనా సంకలనం, వీక్షణం […]

Continue Reading
Posted On :

సంపాదకీయం-సెప్టెంబెర్, 2025

“నెచ్చెలి”మాట దారి -డా|| కె.గీత  జీవితమున ఎన్నియో దారులెదురౌను ఐన ఎటు పోవలె? ఎటు పోయిన ఏమొచ్చును? ఎటూ పోకున్న ఏమోను? అదియే నరుడా! జీవితము- చిత్రవిచిత్రమగు జీవితము! దారులెన్నున్నా సరైన దారిని ఎన్నుకొనుటయే క్లిష్టాతిక్లిష్టము ఏ దారైనా ఇంటో బయటో ఎదురుదెబ్బలు తప్పవు! ఏ దారైనా మనోవ్యధో మనోవ్యాధో చుట్టుముట్టక తప్పదు! సుగమం దుర్గమం దారి ఏదైనా బతుకీడ్చక తప్పదు ఇంతేనా బతుకు?! దుర్గమమును సుగమముగా మార్చుట ఎట్లు? ఎల్లప్పుడు కష్టములేనా? సుఖముగ జీవించు మార్గము […]

Continue Reading
Posted On :

ప్రమద- విజయ నిర్మల

ప్రమద విజయ నిర్మల -నీరజ వింజామరం  వెండితెర చరిత్ర లో బంగారు అధ్యాయం – విజయ నిర్మల అది 1950 వ సంవత్సరం. ఒక చిన్నారిని కెమెరా ముందు నిలబెట్టారు. దర్శకుడు ఆమె కళ్ళలోకి చూస్తూ, “నువ్వు ఇప్పుడు ఏడవాలి. తెలిసిందా ?” అన్నాడు. కానీ ఆ చిన్నారి ఎంత ప్రయత్నించినా ఒక్క కన్నీటి బొట్టు కూడా రాలేదు. ఆప్యాయంగా అడిగినా, నటించి చూపించి, నకలు చేయమన్నా – ఫలితం లేదు. చివరికి దర్శకుడి స్వరం కఠినంగా […]

Continue Reading
Posted On :
Suguna Sonti

వంచన

వంచన -అక్షర డోరు బెల్ విని తలుపు తీసిన నేను ఎదురుగా నిలచిన దీపని చూసి ఆనందంతో వెలిగి పోయిన నా ముఖం పక్కనే ఉన్న వ్యక్తి ని చూసి అంత కంటే ఎక్కువగా మాడి  పోయింది. మారుతున్న నా ముఖ కవళికలను గమనించన దీప… “మమ్మల్ని లోపల్కి రమ్మంటావా ?” అని అడిగింది. చేసేది లేక ముభావంగా పక్కకి తొలగి వారిద్దరికి దారి ఇచ్చాను. ఇద్దర్నీ కూర్చోమని చెప్పి నేను నా మనస్సును సర్దుకుందామని లోపలీకి […]

Continue Reading
Posted On :

ప్లీజ్ .. అర్ధం చేసుకోరూ

ప్లీజ్ .. అర్ధం చేసుకోరూ – శాంతి ప్రబోధ నాలోని వ్యాధి, అదొక నిశ్శబ్ద నీడ. గోడలపై వేలాడిన పాత పెయింటింగ్ లా, అది నాలో నెమ్మదిగా పాతుకుపోయింది. ఒకనాటి ఉదయం నిద్ర లేవగానే, నా నాలుకపై ఒక వింత పువ్వు పూసింది. అది చేదుగా ఉన్నా, సుగంధాన్ని వెదజల్లుతోంది. డాక్టర్ గదిలోకి అడుగుపెట్టగానే, ఆయన చేతిలోని స్టెతస్కోప్ గుండెచప్పుడు కాకుండా, నాలో దాగిన ఆ పువ్వు గుసగుసలు వినిపించింది. “ఇది ఒక ప్రయాణం,” ఆయన కళ్ళు […]

Continue Reading
Posted On :

ఈ తరం నడక-17- మానుషి (శాంతి బెనర్జీ)

ఈ తరం నడక – 17  మానుషి (శాంతి బెనర్జీ) -రూపరుక్మిణి  ఆత్మ అభిమానం ఆత్మస్థైర్యాన్ని నింపుకున్న కథలు మానవత్వం పరిమళించిన చూపు, మనుషుల్ని వారి సమయాన్నిబట్టి అనుకూల, అననుకూలతల మధ్య భేదాన్ని సమకూర్చుకునే శక్తి ఎంతటి అవసరమో చెప్పే కథలివి.           మారుతున్న కాలంలో మనము మారడం ఈ కథల్లో మనకు కనిపిస్తుంది. “మానుషి” ఇదో సంస్కృత పదం. స్త్రీ రూపానికి అంతర్మదనానికి గుర్తుగా ఈ పేరును నిర్ణయించారు అనుకుంటా.., […]

Continue Reading
Posted On :

అమేయ పరిశీలన అద్భుత విశ్లేషణల సుశీలమ్మ (తొలితరం తెలుగు రచయిత్రులు- అభ్యుదయ కథలు పుస్త సమీక్ష)

అమేయ పరిశీలన అద్భుత విశ్లేషణల సుశీలమ్మ (తొలితరం తెలుగు రచయిత్రులు- అభ్యుదయ కథలు పుస్త సమీక్ష)   -డా. కొండపల్లి నీహారిణి           మన కలం హలంగా చేసామంటే ఈ అక్కరల పొలంలో మొలిచిన మొక్కలన్నీ చిగురులెత్తి  పూత పూయాలి, కాతకాయాలి. అవి గట్టిగింజల్ని మొలిపించాలి. మళ్ళీ కొత్త చివురులెత్తాలంటే తెలివి అనే ఖనిజాలను, పోషకాలనూ అందించాలి. సాధారణంగా మనిషి శరీరంలో మెదడు,ఎముకలు, కండరాలు, గుండె వంటి అన్ని భాగాలు సరిగ్గా […]

Continue Reading

జీవిత చదరంగం (నెచ్చెలి-2025 పోటీలో తృతీయ బహుమతి పొందిన కథ)

జీవిత చదరంగం (నెచ్చెలి-2025 పోటీలో తృతీయ బహుమతి పొందిన కథ) -అయ్యలసోమయాజుల సుబ్రహ్మణ్యము తళతళ మెరుస్తున్న స్కూటర్ని తనివితీరా మరొక్కసారి చూసుకుని జేబురుమాల్‌ తీసి సున్నితంగా వ్యూ మిర్రర్ తుడిచి స్టాండ్ తీసి స్టార్ట్‌ చేసి రెండు సార్లు హారన్‌ మోగించాడు శరత్‌. ఆ రోజు శరత్‌ కొత్త స్కూటర్ మీద మొదటిసారి బయలుదేరబోతు న్నాడు. శ్రావణి ఇంటిలోంచి కాలు బయటికి పెట్టబోయి, చటుక్కున ఆగిపోయింది. ఒక్కసారి భూమి కంపించినట్టు , నేల చీలుకుపోతున్నట్టుగా, ఇంటి కప్పు […]

Continue Reading

పరువు (నెచ్చెలి-2025 పోటీలో ప్రత్యేక బహుమతి పొందిన కథ)

పరువు (నెచ్చెలి-2025 పోటీలో ప్రత్యేక బహుమతి పొందిన కథ) -చిట్టత్తూరు మునిగోపాల్ అడవి కలివిపండు మాదిరి నల్లగా నిగనిగలాడే బుగ్గలు లోతుకు వెళ్లిపోయాయి. చిన్న పిల్లోళ్లు కాగితం మింద బరబరా తీసిన పెన్సిలు గీతల్లా కళ్ళకింద చారలుతేలాయి. ఒత్తుగా రింగులు తిరిగి తుమ్మెదల గుంపులా మాటిమాటికీ మొగం మీదవచ్చి పడే జుట్టు పలచబడి నుదురును ఖాళీ చేసి వెనక్కి వెళ్ళింది. నల్ల కలువలాగా ఎప్పుడూ నవ్వుతో విరబూసి కనిపించే మొగం వాడి వేలాడిపోతోంది. ఆ కళ్ళనిండా ఏమిటవి.. […]

Continue Reading

పసుపుపచ్చ రిబ్బన్ (హిందీ: “पीली रिबन” డా. దామోదర్ ఖడ్సే గారి కథ)

 పసుపుపచ్చ రిబ్బన్ पीली रिबन హిందీ మూలం – డా. దామోదర్ ఖడ్సే తెలుగు అనువాదం – డా. కూచి వెంకట నరసింహారావు ఈసారి డా. ఉషాదేవీ కొల్హట్కర్ నుంచి ఉత్తరం రావడంలో చాలా ఆలస్యం అయింది. గల్ఫ్ యుద్ధం కారణంగా ఉత్తరాలు రావడంలో ఆలస్యం అవుతోంది. కవరు తెరవగానే ఒక పసుపుపచ్చని రిబ్బన్ బయటపడింది. ఒక మెరుస్తున్న సిల్కు రిబ్బన్. ఆకర్షణీయంగా, అందంగా ఉన్న రిబ్బన్. విషయం ఏమిటో అర్థం కాలేదు. కాని ఉత్తరం చదివిన […]

Continue Reading

కన్నీటి ఉట్టి (నెచ్చెలి-2025 పోటీలో తృతీయ బహుమతి పొందిన కవిత)

 కన్నీటి ఉట్టి (నెచ్చెలి-2025 పోటీలో తృతీయ బహుమతి పొందిన కవిత) – వేముగంటి మురళి ముడుతలు పడ్డ ముఖం చెప్పకనే చెపుతుంది ఇంటిని అందంగా తీర్చిదిద్దినందుకు అమ్మకు మిగిలిన నజరానా అదే అని పిల్లల్ని పెంచుతూ పందిరెత్తు ఎదిగి వంటింట్లో పొయ్యిముందు వాలిన తీగలా నేలకు జారడమే అమ్మతనం పని కాలాన్నే కాదు అమ్మ విలువైన ఆనందాన్ని తుంచేసి గడియారం ముళ్లకు బంధించేస్తుంది అందరూ కళ్ళముందు తిరుగుతున్నా లోలోపటి కన్నీటి నదిలోని కైచిప్పెడు దుఃఖాన్ని దోసిట్లోకి తీసుకోరెవరు బాపైనా […]

Continue Reading
Posted On :

ఎర్రచీర (నెచ్చెలి-2025 పోటీలో ప్రత్యేక బహుమతి పొందిన కవిత)

ఎర్రచీర (నెచ్చెలి-2025 పోటీలో ప్రత్యేక బహుమతి పొందిన కవిత) – పెనుగొండ బసవేశ్వర్ రోజు సాయంత్రం చిరు చీకట్లు ముసురుతుండగా చెమటలు కక్కి వచ్చిన అమ్మ కూలి దేహం తాగుబోతు నాయన బెల్ట్ వాతలకు చిట్లిపోయేది విరుచుకుపడుతున్న రాక్షసుడి వికటాట్టహసాల మధ్యన అమ్మ కన్నీటి రాగం గాలిలో దూదిలా తేలిపోయేది రాలిపోయిన పక్షి ఈకలా దేహం, నేలకు అతుక్కుపోయేది పొలంకాడ బొబ్బలెక్కిన అమ్మ చేతులకు పొర్లుదెబ్బలు బహుమానంగా ఇచ్చి నోటికాడి ముద్ద లాక్కుపోయిన నోట్లన్ని కల్లు కాంపౌండ్ […]

Continue Reading
gavidi srinivas

ఒకటే అలజడి (కవిత)

ఒకటే అలజడి -గవిడి శ్రీనివాస్ అలసిన సాయంత్రాలు సేదీరుతున్న వేళ మంచు వెన్నెల కురిసి చల్లని గాలుల్ని ఊపుతున్నవేళ నాతో కాసేపు ఇలానే మాట్లాడుతూ వుండు అలా నా కళ్ళల్లోకి ప్రవహిస్తూ వుండు సమయాలది ఏముందిలే మనసు కాసింత ఊసులతో కుదుటపడ్డప్పుడు . ఈ క్షణాల్ని ఇలానే పదిల పరచుకొంటాను. నీతో మాట్లాడుతుంటే రేగే అలజడిని ఆస్వాదిస్తాను. గుప్పెట్లో కాసిన్ని చిరు నవ్వుల్ని వొంపెయ్. అవి మల్లె లై వికసిస్తుంటాయ్. అలా కదిలే మేఘాల్ని చూడు మనల్ని […]

Continue Reading

సిలికాన్ లోయ సాక్షిగా (కథలు)-4 కాలేజీ కథ

సిలికాన్ లోయ సాక్షిగా (కథలు) 4. కాలేజీ కథ అమెరికా గురించి వినడానికీ, ప్రత్యక్షంగా జీవించడానికీ మధ్య ఉన్న గీతని సుస్పష్టం చేసే సందర్భాలివన్నీ- పైకి గొప్పగా కనిపించే సమాజ అంతర్గత సంఘర్షణలో నలిగిన కొత్త మనిషి ఆంతరంగ ఆవేదనలివన్నీ- సిలికాన్ లోయ గుండె లోతుల్లో రహస్యంగా దాగి ఉన్న కథలివన్నీ… -డా||కె.గీత “కొమస్తాజ్?” స్పానిష్ లో “హౌ ఆర్యూ?” అంది మరియా. షాపు నించి వస్తూనే బైట వరండాలో వాళ్ల అమ్మతో బాటూ నిల్చుని కబుర్లు […]

Continue Reading
Posted On :

దేవి చౌధురాణి (నవల) – రెండవ భాగం – మూలం-బంకిమ చంద్ర ఛటోపాధ్యాయ, తెనుగు సేత-విద్యార్థి

దేవి చౌధురాణి (రెండవ భాగం) మూలం – బంకిమ చంద్ర ఛటోపాధ్యాయ తెనుగు సేత – విద్యార్థి వ్రజేశ్వర్ తెర తీసి అంతఃమందిరానికి వెళ్లాడు. అక్కడి వైభోగానికి విభ్రాంతితో కూడిన విస్మయ్యం పొందాడు. మందిరానికి అన్ని వైపులా దశావతారాలు, కైలాసం, వృందావనం మొదలగు అందమైన చిత్రపటాలు వున్నవి. కాలి క్రింది తివాచీ నాలుగంగుళాల మందంతో మెత్తగా వున్నది. ఎదుట చక్కని నగిషీలుతో కూడి, మెత్తని ముఖమలుతో పరిచి, అంతే విలువైన ముఖమలుతో చేసిన రంగు బాలీసులతో ఒక […]

Continue Reading
Posted On :

అనుసృజన – హరీశ్ చంద్ర పాండే

అనుసృజన హరీశ్ చంద్ర పాండే అనుసృజన: ఆర్ శాంతసుందరి (హిందీ కవి హరీష్ చంద్ర పాండే ఎన్నో కథా సంపుటాలూ , కవితా సంపుటాలూ , బాలసాహిత్యం రాసారు. 1952 లో ఉత్తరాఖండ్ లో పుట్టారు . సాహితీ పురస్కారాలు అందుకున్నారు . అలహాబాద్ లో సీనియర్ మోస్ట్ అకౌంటెంట్ గా పదవీ విరమణ చేసారు.) ప్రతిభ హంతకుణ్ణి కోర్టువారు సగౌరవంగా విడిపింపజేసేట్టు వాదించగల వకీలుదే ప్రతిభ రోగికి ఏమాత్రం తెలియనీయకుండా అతని శరీరం నుంచి మూత్రపిండాన్ని […]

Continue Reading
Posted On :

నడక దారిలో(భాగం-57)

నడక దారిలో-57 -శీలా సుభద్రా దేవి జరిగిన కథ:- (తండ్రి మరణానంతరం ఆర్థిక సంక్షోభంలోనే డిగ్రీ చదువుతో బాటు సాహిత్యం , సంగీతం బాపూ బొమ్మలు చూసి వేయటం. శీలా వీర్రాజుతో సభా వివాహం. మా జీవితంలో పల్లవి చేరింది. వీర్రాజు గారు స్నేహితునితో కలిసి అడ్వర్టైజ్ ఏజెన్సీ పెట్టటం, ఆర్టీసి హైస్కూల్ లో చేరిక. వీర్రాజుగారు స్వచ్ఛందవిరమణ ,.అమ్మ చనిపోవటం, పల్లవి వివాహం, నాకు హిస్టెరెక్టమీ ఆపరేషన్, పల్లవికి పాప జన్మించటం, మా అమెరికా ప్రయాణం, […]

Continue Reading

నా జీవన యానంలో (రెండవ భాగం) – 57

నా జీవన యానంలో- రెండవభాగం- 57 -కె.వరలక్ష్మి ‘‘లోకులు తొందరగా నిందిస్తారు లేదా, తొందరగా అభినందిస్తారు. అందుచేత ఇతరులు నిన్నుగురించి అనుకునే మాటలకు పెద్దగా విలువ ఇవ్వవద్దు.’’ ‘‘ఇవ్వడం నేర్చుకో – తీసుకోవడం కాదు. సేవ అలవరచుకో – పెత్తనం కాదు.’’ అంటారు రామకృష్ణ పరమహంస. 2014 జనవరి 14 న సీనియర్ నటి, తెలుగువారి సీతాదేవి అంజలీదేవి మద్రాసు లో కాలం చేసారు. జనవరి 22న సీనియర్ నటులు అక్కినేని నాగేశ్వర్రావు కాలం చేసారు. ఇద్దరు […]

Continue Reading
Posted On :

వ్యాధితో పోరాటం- 34

వ్యాధితో పోరాటం-34 –కనకదుర్గ సర్జరీకి కావాల్సిన పరీక్షలు చేస్తున్నారు, రిపోర్ట్స్ వస్తున్నాయి. ముఖ్యంగా గాల్ బ్లాడర్లో స్టోన్స్ వున్నాయా, లేవా అని చూస్తున్నారు. కానీ ప్రతి సారి అంతా బాగానే వుంది, స్టోన్స్ లేవు అనే చూపిస్తుంది. డాక్టర్స్ కి అనుమానం ఇంత జరుగుతున్నా గాల్ బ్లాడర్లో ఒక్క స్టోన్ కూడా లేకుండా ఎలా వుంటుంది అని. నా పరిస్థితిలో మార్పు లేదు. నా నొప్పి, డయేరియా, అప్పుడపుడు వాంతులు అవుతూనే వున్నాయి. నాలో ఒకరకమైన భయం, […]

Continue Reading
Posted On :

నా అంతరంగ తరంగాలు-30

నా అంతరంగ తరంగాలు-30 -మన్నెం శారద (ఆలస్యమైనా ఫరవాలేదు, దయచేసి చదివే స్పందించండి ) ————————————– రేపే గొప్ప ప్రారంభం… —————————– మా చిన్నప్పుడు కాకినాడలో కొత్త సినిమా రిలీజయినప్పుడు ఇలానే రాత్రి పూట పెట్రోమాక్స్ లైట్లతో ఊరేగింపు జరుపుతూ అరిచేవారు. నిజంగా ఎంత సంబరంగా ఉండేదో… చెప్పలేం. వరుసగా రకరకాల బళ్ళు పోస్టర్స్ తో వెళ్తుంటే సగం సినిమా చూసిన ఫీల్ వచ్చేసేది. ఆఁ రోజుల్లో పెద్దవాళ్ళు ఎప్పుడో జాలి తలచి ఏదో ఒక సినిమాకి […]

Continue Reading
Posted On :

నా కళ్ళతో అమెరికా -2 (యూసోమిటీ)

నా కళ్ళతో అమెరికా -2 యూసోమిటీ డా||కె.గీత మాధవి “నా కళ్లతో అమెరికా”- డా.కె.గీత చెప్తున్న ట్రావెలాగ్ సిరీస్. ఇందులో అమెరికాలోని కాలిఫోర్నియాతో ప్రారంభించి, అనేక ప్రాంతాల్ని గురించిన విశేషాలు ఉంటాయి. ఇవన్నీ అమెరికా చూడాలనుకున్న వారికి సులభమైన గైడ్లుగా ఉపయోగపడతాయి. ***** డా||కె.గీతడా|| కె.గీత పూర్తిపేరు గీతామాధవి. వీరు “నెచ్చెలి” వ్యవస్థాపకులు, సంపాదకులు. తూ.గో.జిల్లా జగ్గంపేటలో జన్మించారు. ప్రముఖ కథా రచయిత్రి శ్రీమతి కె. వరలక్ష్మి వీరి మాతృమూర్తి. భర్త, ముగ్గురు పిల్లలతో కాలిఫోర్నియాలో నివాసముంటున్నారు. ఆంధ్ర […]

Continue Reading
Posted On :

కథావాహిని-27 దేవరకొండ బాల గంగాధర తిలక్ గారి “నల్లజర్ల రోడ్డు” కథ

కథావాహిని-27 నల్లజర్ల రోడ్డు రచన : బాల గంగాధర తిలక్ గళం :కొప్పర్తి రాంబాబు ***** రాంబాబు కొప్పర్తికొప్పర్తి రాంబాబు  1959 ఆగస్ట్ 8వతేదీన కళా వాచస్పతి జగ్గయ్య గారి ఊరు కాంటినెంటల్ కాఫీ పరిమళాల దుగ్గిరాలలో జన్మించారు. అమ్మ లలితమ్మ, నాన్న సుబ్బారావు గారు. పెరిగింది, చదువుకున్నది సాహితీ కేంద్రమైన తెనాలిలో. 1980 లో ఇండియన్ బ్యాంక్ లో చేరి ముంబై , చెన్నై నగరాల్లో ఎక్కువ కాలం పనిచేసి 2019 లో విశాఖపట్నం డిప్యూటీ […]

Continue Reading

వినిపించేకథలు-51 – శాంతి ప్రబోధ గారి కథ “మనం ఎటువైపు?”

వినిపించేకథలు-51 మనం ఎటువైపు? రచన : శాంతి ప్రబోధ గారి కథ గళం : వెంపటి కామేశ్వర రావు  ***** వెంపటి కామేశ్వర రావువెంపటి కామేశ్వర రావు తమ వినిపించేకథలు యు ట్యూబ్ చానల్ ద్వారా సుప్రసిద్ధ రచయితల/రచయిత్రుల కథలు వినిపిస్తూ శ్రోతల మన్ననలు పొందుతున్నారు. ప్రయివేట్ సెక్టార్ లో పర్సనల్ మేనేజర్ గా సుదీర్ఘకాలం సేవలందించిన వీరు తమ విశ్రాంత జీవితం లో తమకిష్టమైన అభిరుచులకు మెరుగులు దిద్దుకుంటున్నారు.ఆకాశవాణి లో casual news reader,auditioned drama […]

Continue Reading
K.Geeta

గీతామాధవీయం-48 (డా||కె.గీత టాక్ షో)

గీతామాధవీయం-48 (డా||కె.గీత టాక్ షో) -డా||కె.గీత “గీతామాధవీయం” టోరీ టాక్ షో (Geetamadhaveeyam Tori Talk Show- Week-48) అసమాన సాహిత్యం! ఆపాతమధురసంగీతం!! ప్రతి ఆదివారం- మధ్యాహ్నం 2 గం.- 3గం. PST (USA) జులై 09, 2022 టాక్ షో-48 లో *సాహిత్యం: వెనుతిరగని వెన్నెల భాగం-48 (కథ) Listen Live @ http://onlineradios.in/embed/teluguone/ Calling Numbers during the show: USA: 703-659-2199 UK: 020-3287-8674 Australia: 02-8006-8674 India: 9666-77-8674 *** డా||కె.గీతడా|| […]

Continue Reading
Posted On :

నీలినీలి అలల ముంబయి

నీలినీలి అలల ముంబయి -డా.కందేపి రాణి ప్రసాద్ 2024వ సంవత్సరం సెప్టెంబరు 21వ తేదీ నుంచి 24వ తేదీ వరకూ ముంబయి లోని నెహ్రూ సైన్స్ ఆడిటోరియంలో ఎన్ఎన్ఎఫ్ వారి కాన్ఫరెన్స్ జరగుతున్నది. ఇవన్నీ పిల్లల డాక్టర్లకు సంబంధించిన సమావేశాలు. రాత్రి 8:15 కు ఎయిర్ ఇండియా ఫ్లైట్లో బయలుదేరి ముంబయి వెళ్ళాం. ఫైవ్ స్టార్ హెూటల్ ఆర్కిడ్ లోని రూం నెంబర్ 477లో దిగాము. ఈ హెూటల్ మధ్యలో ఆరు ఫ్లోర్ల పై నుంచి నీళ్ళు […]

Continue Reading

యాత్రాగీతం-71 అమెరికా నించి ఐరోపాకి (ఇంగ్లాండ్ -ఫ్రాన్స్ – ఇటలీ) ట్రావెలాగ్ భాగం-6

యాత్రాగీతం అమెరికా నించి ఐరోపాకి (ఇంగ్లాండ్ -ఫ్రాన్స్ – ఇటలీ) ట్రావెలాగ్ భాగం-6 -డా||కె.గీత ఇటీవల మేం చేసిన ఐరోపా యాత్రని గురించి నా ట్రావెలాగ్ సిరీస్ “యాత్రాగీతం” లో భాగంగా ఫేస్ బుక్ సిరీస్ గా రాస్తున్నాను. చదవాలనుకున్న మిత్రులు నేరుగా నా వాల్ మీద చదవొచ్చు. చదివి మీ అభిప్రాయం పెట్టడం మర్చిపోకండి.* *** లగేజీ ప్యాకింగు: ప్రయాణపు తేదీకి ముందు నాలుగైదు రోజుల పాటు లగేజీ ప్యాకింగుతో సరిపోయింది.  మా ముగ్గురికీ ఒక్కొక్కళ్ళకి […]

Continue Reading
Posted On :
Kandepi Rani Prasad

పిల్ల తాబేళ్ళ కోరిక

పిల్ల తాబేళ్ళ కోరిక -కందేపి రాణి ప్రసాద్ సముద్రంలో ఉండే తాబేళ్ళు ఒడ్డుకు వస్తూ ఉంటాయి. ఒడ్డున ఉన్న ఇసుకలో తిరుగుతూ ఉంటాయి. అలాగే ఇసుకలో తమ గుడ్లను పెట్టి వెళతాయి. గుడ్లు పగిలి పిల్లలైన తరువాత పిల్ల తాబేళ్ళు మరల సముద్రంలోకి వెళ్ళిపోతాయి. తాబేళ్ళు ఇసుక లోపలకు తవ్వి గుడ్లను పెట్టటం వలన కొన్ని పిల్లలు ఇసుకలో నుంచి బయటకు రాలేక చనిపోతుంటాయి. మరి కొన్ని మెల్లగా నడుస్తూ మనుష్యుల కాళ్ళ కింద పడి చనిపోతుంటాయి. […]

Continue Reading

పౌరాణిక గాథలు -32 – హంసడిభకులు (ఉపాయం కథ)

పౌరాణిక గాథలు -33 -భమిడిపాటి బాలాత్రిపుర సు౦దరి హంసడిభకులు (ఉపాయం కథ) సాళ్ళ్వదేశపు రాజు బ్రహ్మదత్తుడికి ఇద్దరు కొడుకులు౦డేవారు. ఒకడి పేరు “హ౦సుడు” , మరొకడి పేరు “ డిభకుడు” . వాళ్ళిద్దరు అన్నదమ్ములే కాదు, మ౦చి స్నేహితులు కూడ! హ౦సుడు, డిభకుడు ప్రాణస్నేహితులైతే వీళ్ళిద్దరికీ కలిసి ఇ౦కో స్నేహితుడు కూడా ఉ౦డేవాడు . అతడి పేరు “జరాస౦ధుడు”. ఒకసారి వీళ్ళు ముగ్గురు కలిసి మధురానగరానికి రాజైన శ్రీకృష్ణుడి మీద యుద్ధానికి వెళ్ళారు. సాక్షాత్తు శ్రీమహా విష్ణువైన […]

Continue Reading

రాగసౌరభాలు- 18 (శ్రీ రాగం)

https://youtu.be/b-pks4g6-Qc?si=1EN5OQo26b88gds2https://youtu.be/dDTyA-UN3r0?si=5UE3YfxNQ6lEgcuLhttps://youtu.be/hjXEbLewfQw?si=xCh-Fbr0oVb9No7e రాగసౌరభాలు-18 (శ్రీ రాగం) -వాణి నల్లాన్ చక్రవర్తి             ప్రియమైన హితులకు, స్నేహితులకు శుభాకాంక్షలు. శ్రీ కృష్ణ జయంతి, వినాయక చతుర్థి వంటి పండుగలు ఘనంగా జరుపుకున్నాము కదా! ఈ పవిత్రమైన మాసంలో శ్రీకరమైన, శుభప్రదమైన శ్రీరాగం విశేషాలు తెలుసుకుందాము. శ్రీ అంటే లక్ష్మీదేవి కదా! ఒకే ఒక తెలుగు అక్షరం కలిగిన ఏకైక రాగం శ్రీరాగం. అంతేకాక ఘనరాగ పంచగుచ్చములోని ఆఖరి రాగము.        […]

Continue Reading