మానవాళికి కరోనా వైరస్ ఉత్తరం (అనువాద కవిత)

ఆంగ్ల మూలం: వివియన్ ఆర్ రీష్

 తెలుగుసేత: ఎన్.వేణుగోపాల్   

నేలతల్లి నీ చెవిలో గుసగుసలాడింది

నువ్వది ఆలకించలేదు 

నేలతల్లి పెదవి విప్పి నీకు చెప్పింది

నువ్వది వినలేదు

నేలతల్లి అరిచి గగ్గోలు పెట్టింది

నువు చెవిన పెట్టలేదు

అప్పుడు నేను పుట్టాను…

నిన్ను శిక్షించడానికి కాదు

నిన్ను మేల్కొల్పడానికే

నేను పుట్టాను…

సాయానికి రమ్మని నేలతల్లి విలపించింది…

బీభత్సమైన వరదలు. నువు వినలేదు.

మహారణ్య దహనాలు. నువు వినలేదు.

పెను తుపానులు. నువు వినలేదు.

భయం గొలిపే ప్రచండ మారుతాలు. నువు వినలేదు.

కాలుష్యంతో సముద్ర జీవులు కుప్పలుగా చనిపోయినప్పుడూ

ధ్రువ ప్రాంత హిమశిలా పర్వతాలు కరుగుతున్నప్పుడూ

ఎప్పుడూ నువు నేలతల్లి ఆక్రోశం విననే లేదు. 

అవిశ్రాంత యుద్ధాలతో

అపారమైన అత్యాశతో

నేలతల్లికి నువ్వెంత కీడునిస్తున్నావో

ఏ హెచ్చరికనూ నువు వినలేదు

ద్వేషం ఎంతగా పోగు పడ్డా సరే

ప్రతిరోజూ ఎన్ని శవాలు లేచినా సరే 

నీ జీవితం తప్ప నీకు మరొక ధ్యాస లేదు  

నేలతల్లి నీకేం చెప్పాలనుకుంటున్నదో వినడం కన్న

మార్కెట్లో సరికొత్త ఐఫోన్ సంపాదించడమే నీకు ముఖ్యం

కాని ఇప్పుడు నేనొచ్చాను….

ప్రపంచం నడక మధ్యలో ఆగిపోయేలా చేశాను 

చిట్టచివరికి నిన్ను, నిన్నే, వినేలా చేశాను

నువు రక్షణ కవచంలో దాక్కునేలా చేశాను 

భౌతిక వస్తువుల ఆలోచన మానేలా చేశాను

నువ్విప్పుడు సరిగ్గా నేలతల్లి లాగే 

నీ మనుగడ ఎట్లా అని ఆలోచిస్తున్నావు… 

ఎలా ఉంది ఆ ఆలోచన?

నేలతల్లి మీద మంటలు రేగినట్టు

నీకు జ్వర తీవ్రత ఇచ్చాను

నేలతల్లి గాలిలో కాలుష్యం కలిసినట్టు

నీ ఊపిరితిత్తులకు ఇబ్బంది ఇచ్చాను

ప్రతి దినమూ నేలతల్లి చిక్కిశల్యమవుతున్నట్టు 

నిన్ను కొంచెం కొంచెం బలహీనం చేశాను… 

నీ విలాసాలన్నీ తొలగించేశాను

నీ విహారాలూ రద్దు చేశాను

ఈ భూగోళం గురించీ, దాని వేదన గురించీ

మరిచిపోవడానికి నువు చేసిన పనులన్నీ 

రద్దు చేశాను

లోకం ఆగిపోయేలా చేశాను

ఇప్పుడిక….

నీ కార్ఖానాల పొగగొట్టాలు 

కాలుష్యం చిమ్మడం ఆగింది గనుక 

నేలతల్లి గాలి శుభ్రపడింది

వినీలాకాశం కనబడుతున్నది 

విహార నౌకలు వెదజల్లే కాలుష్యం

ఆగింది గనుక 

నదీ జలాలు స్వచ్ఛంగా కనబడుతున్నాయి

జీవితంలో ముఖ్యమైనదేమిటో

ఆలోచించడానికి 

నీకు సమయం దొరికింది

మళ్లీ చెపుతున్నాను

నేనిక్కడికి వచ్చింది

నిన్ను శిక్షించడానికి కాదు

మేల్కొలపడానికి…

ఇదంతా అయిపోయాక

నేను వెళిపోయాక

ఈ క్షణాలను గుర్తు పెట్టుకో…

నేలతల్లి మాటలు విను

నీ మనస్సాక్షిని విను

భూమిని కలుషితం చెయ్యడం మాను

ఒకరితో ఒకరు కలహించడం మానండి

భౌతిక వస్తువుల కోసం వెంపరలాట మాను

పొరుగువారిని ప్రేమించడం మొదలుపెట్టు

భూగోళాన్నీ సకల ప్రాణుల్నీ ప్రేమగా చూడు

ఒకానొక సృష్టికర్తను నమ్ము 

ఎందుకంటే ఈసారి వచ్చానంటే 

మరింత బలంగా వస్తాను…

ఇట్లు

ప్రేమతో

కరోనావైరస్ 

(కవి వివియన్ ఆర్ రీష్ (Vivienne R Reich) ప్రేరణా సాహిత్య రచయిత. ‘రి ఇన్వెన్షన్ మాగజైన్’ అనే వెబ్ మాసపత్రిక సంపాదకురాలు, సర్టిఫైడ్ ప్రొఫెషనల్ లైఫ్ కోచ్)

*****

Coronavirus Letter To Humanity

 by: Vivienne R Reich

The earth whispered but you did not hear.

The earth spoke but you did not listen

The earth screamed but you turned her off.

And so, I was born…

I was not born to punish you …

I was born to awaken you …

The earth cried out for help…

Massive flooding. But you didn’t listen.

Burning fires. But you didn’t listen.

Strong hurricanes. But you didn’t listen.

Terrifying Tornadoes. But you didn’t listen.

You still don’t listen to the earth when.

Ocean animals are dying due to pollutants in the waters.

Glaciers melting at an alarming rate.

Severe drought.

You didn’t listen to how much negativity the earth is receiving.

Non-stop wars.

Non-stop greed.

You just kept going on with your life …

No matter how much hate there was …

No matter how many killings daily …

It was more important to get that latest iPhone than worry about what the earth was trying to tell you …

But now I am here.

And I’ve made the world stop on its tracks.

I’ve made YOU finally listen.

I’ve made you take refuge.

I’ve made you stop thinking about materialistic things …

Now you are like the earth…

You are only worried about YOUR survival.

How does that feel?

I give you fever … as the fires burn on earth.

I give you respiratory issues … has pollution fill the earth air.

I give you weakness as the earth weakens every day.

I took away your comforts …

Your outings.

The things you would use to forget about the planet and its pain.

And I made the world stop…

And now…

China has better air quality … Skies are clear blue because factories are not spewing pollution unto the earth’s air.

The water in Venice is clean and dolphins are being seen.  Because the gondola boats that pollute the water are not being used.

YOU are having to take time to reflect on what is important in your life.

Again, I am not here to punish you … I am here to Awaken you…

When all this is over and I am gone… Please remember these moments …

Listen to the earth.

Listen to your soul.

Stop Polluting the earth.

Stop Fighting among each other.

Stop caring about materialistic things.

And start loving your neighbors.

Start caring about the earth and all its creatures.

Start believing in a Creator.

Because next time I may come back even stronger….

Signed,

Coronavirus

(http://www.theasian.asia/archives/107999)

****

ఫోటో ఆర్ట్: రమేష్ పొతకనూరి

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.