అస్థిమితం…..

-సుధామురళి

ఒకటే రెక్కని ఎన్నిసార్లు ఆడించను చెప్పుఒకటే గుండెని ఎన్నిసార్లు సర్దుకోమని సర్దుబాటు చెయ్యను చెప్పు ఓ నిప్పు కణాన్ని వదలాలనుకుంటాఆ రెప్పల చాటులో నుంచికనుగుడ్డు ఏ మాయలో కూరుకుపోతుందో కానీవేడి ఆవిరి ఎప్పుడో చల్లారిపోయిన కాఫీ కప్పు అవుతుంది….. ఓ అక్షర తూటాని లాగి పెట్టి విడవాలనుకుంటాఆ చేదు తేనెల కలయికల మధ్యలోనుంచినరంలేని అర్ధమందపు నాలుక నాకేం పట్టింది అనుకుంటుందో ఏమోగానీఅసలు అనుకోని పదాలను వల్లెవేస్తుందిఅది నేనేనా అన్నదనే భ్రమను నాకప్పగిస్తూ…. శూన్యం నిండా ఏదో నిండుకుని ఉంటుందివెలితిలేని ఖాళీ తనాన్ని ఎంతో బాగా అనుభవంలోకి తెస్తుంది రాత్రి మొత్తం ఎక్కడికో తప్పిపోతుందినిశి ఎప్పుడూ నీతోనే ఉంటే ఇక నీకా బెంగేముంది చుక్కలూ సూర్యుడూ ఎప్పటి నుంచో నేస్తాలుతెలుసుకోవడంలో పొరపడ్డది నువ్వే రాళ్ళూ నీళ్ళూ తోడూ నీడలుతేడాలు చూపించిఒకవైపుకే దూకింది నీ మనసే ఈగోలూ స్నేహాలూఒకే బండి చక్రాలునడతలో తేడా ఉందనిఇరుసును తిట్టుకున్నది నీ తెలియని తనమే…..

*****

One thought on “అస్థిమితం….. (కవిత)”

  1. కంగ్రాట్స్ డియర్ ???
    చుక్కలు సూర్యుడు ఎప్పటినుంచో నేస్తాలు నువ్వే తెలుసుకోవడంలో పొరపాటు పడ్డావు చాలా నచ్చింది కవిత??

Leave a Reply

Your email address will not be published.