ఆపత్కాల ప్రకంపనల రికార్డే  “అవలోకనం”

-నాంపల్లి సుజాత

కనీ వినీ ఎరుగని ఓ చిన్న వైరస్
యావత్ ప్రపంచాన్నీ గడగడ లాడిస్తోంది..కరోనా వైరస్
కోవిడ్-19 చైనా లోని ఊహాన్ లో పుట్టి
ఇతరప్రాంతాలకు సంక్రమిస్తున్నదనీ…లేదా
బయోవార్ లో భాగంగా శత్రుదేశాలు పన్నిన కపట అస్త్రమో..మరి ప్రయోగాల పేరిట వికటించిన తప్పిదమో..పర్యావరణ సమతుల్యత లోపించిన కారణమో..ఏదియేమైనా విశ్వవ్యాప్తంగా విధ్వంసాన్ని నెలకొల్పుతోంది..కనబడని ఓ భయంకర యుద్ధం కళ్ళముందు జరుగుతూనే ఉంది..

కనబడని శత్రువు యే దిక్కునుంచి దాడి చేస్తాడో..ఎంత ముప్పు తలపెడుతాడో..
గతంలో జరిగిన చారిత్రక యుద్దాలకన్నా
పెనురెట్లు భీకరమైన ఈ మహమ్మారి కనబడని కరోనా సర్వవ్యాప్తమై సకలజనులనూ కంఠనీరు పెట్టిస్తోంది..
కోట్లమందిని పొట్టనపెట్టుకున్న ఈ వైరస్ కి విరుగుడు వాక్సీన్ కనిపెడుతూనే ఉన్నారు
ఇంకా అందుబాటులోకి రాలేదు
కాబట్టి..ఈ వైరస్ లింకుని తెంచి ఇతర ప్రాంతాలకు సంక్రమించకుండా..ప్రపంచమంతా స్వచ్చందంగా ఎవరికి వారు తాళాలు బిగించున్నారు..మార్చ్ 22 నుండి మన దగ్గర..కూడా ఓ నాలుగు నెలలూ సర్వం బంద్..రోడ్లు,బళ్లు,బార్లు గుళ్ళు క్లబ్బులు,పార్కులు సినిమాలు..అన్నీ లోక్డౌన్ కోరల్లోనే..ఒక్కరోజో..రెండురోజులో కాదు..వరుసగా..కొన్ని నెలలు..అందరం గ్రహనిర్బంధం..
         ఈ నేపథ్యం లో రోజు కూలీ చేసుకునే
పేదవారు పనులు లేక..ఎర్రటెండలో..వేలమైళ్ళ సొంతూర్లకు.
కాలినడకనే వెళ్లడం కంఠతడిపెట్టించిన
హృదయ విదారక దృశ్యాలు..
               మానవజీవితలు ఎక్కడికక్కడ స్థంభించిపోయాయి..సరిగ్గా ఈ సమయంలోనే నిరాశానిస్పృహలతో కాలం వెళ్లదీస్తున్న మనం హృదయకవాటాలు తెరుచుకొని మానవీయపరిమళాన్ని పంచిపెట్టడం కూడా జరిగింది.
         నిస్తేజంగా ఉన్న సమాజాన్ని ఉత్తేజితుల్ని చేసేందుకు  రచయిత్రులుగా..కవులుగా ఎమ్ చేశారో
వారిదినచర్యలోని ఘటనలను తెలియజేసేదే..ఈ కరోనా డైరీ..
         ఈ వినూత్నమైన కరోనా దినచర్య సంకలన ప్రచురణకు  జ్వలితగారు పూనుకోవడం ముదావహం..
ఎవరో వస్తారని ఏదో చేస్తారని చూడకుండా
మహిళా రచయిత్రులను మేలుకొలిపి పిలుపునిచ్చి సహకారపద్దతిలో..ఈ డైరీని చక్కటి చారిత్రక సాక్షంగా వెలువరించారు..

         దీంట్లో అక్షరయాన్,కథయిత్రులు,
లేఖిని,నరసం,రాజ్యపథం,దబరకం, ప్రరవే, తెలంగాణ జాగృతి,రుంజ,
కవయియిత్రులవేదిక,తెలంగాణ మహిళాసాహిత్య వేదిక మొదలగు గ్రూపులకు చెందిన126 మంది  రచయిత్రులు వెలువరించినదే.. ఈ “అవలోకనం
     మార్చ్ 22 నుండి ఆగస్టు 30 వరకు జరిగిన ఘటనలను కొత్తనుంచి పాత తరం రచయిత్రులవరకు వారు చూసింది చేసింది,రాసింది చదివింది,నేర్పింది నేర్చుకుందీ,బాధాలూ గాధల సమాహారమే..ఈ అవలోకనం..దీంట్లో ఎక్కువమంది..అధ్యాపకులూ, ఉపాధ్యాయులూ,డాక్టర్లు,లాయర్లు.గృహిణులు.వివిధ వృత్తులకు సంబందించినవారు వున్నారు.
    ఈ డైరీలో ఎవరి అనుభవాలు వారివే అయినా అందరి గుండె తడీ వలసకార్మికులూ,పారిశుధ్యసేవకులూ..డాక్టర్లూ,సిస్టర్లూ..పోలీసుల వెతల గూర్చే అన్నది నిర్వివాదాంశం..
దాదాపుగా అందరు రచయిత్రులూ వారివారి కలాలకు పదును పెట్టి కరోనా విలయ తాండవంలో స్టయిర్యాన్నీ, ధైర్యాన్నీ చేయూతనిచ్చి ఆదుకున్నవారే..
   అనిశెట్టి రజిత గారు వలస కార్మికుల పిల్లలని కిటికీ నుండి పలకరిస్తూ వారికి కావలసినవి ఇస్తూ సహాయపడాలని ఆరాటపడ్డారు..
ఐనంపూడి శ్రీలక్ష్మిగారు “ఏమైందిప్పుడు క్షణాలు మాత్రమే కల్లోలితం కరోనా క్యా కరిగే” అంటూ స్థైర్యం తో ప్రశ్నించి  ముఖ్యమంత్రి ప్రశంసించే స్ధాయి.. కరోనాకి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేద్దామా అంటూ మేలుకొలిపే కవిత్వం రాశారు..గడ్డం వనజగారు వారి పాఠశాలలో సాహితీ కార్యశాలపెట్టి నూతన కవయిత్రులకు ఆటవెలది,కంద పద్యాలను నేర్పించారు..
   ఫణిమాధవి కన్నోజు గారు ఇంట్లో అన్నం వండే ప్రతీసారీ ఓ దోసిలిబియ్యం తీసి పక్కనపెట్టి అవసరం లో ఉన్నవారికి పంచారట..కరోనవిన్నర్ కాట్రగడ్డభారతిగారు వారి అనుభవం లోంచి సమాజానికి..కొన్ని సూచనలు చేశారు.
ఘాళి లలిత ప్రవల్లిక గారు పోస్ట్ డిజైన్ వీడియోలు నేర్చుకొని దాహితీ జూమ్ సమావేశం లో వినియోగించారు..
    జ్వలితగారు మిద్దెతోట పెంపకమే కాదు
చేతివృత్తుల కథలకోసం, వీడియో కథలు చదివించే కార్యక్రమం, ఈ కరోనా డైరీ రూపొందించడం లో నిమగ్నమయ్యారు..
డా.అమృతలతగారు అమృతాఫ్రెండ్స్ గ్రూప్ ఏర్పాటు చేసి వారివారి అభిరుచులకు తగినట్లుగా పాటలూ,ఆటలూ, మెమరీ పోటీ నిర్వహించారు..
డా.గీతా గారు పెద్దలకు ఎమోషనల్ సపోర్ట్,పిల్లలకి సరదా కార్యక్రమాలు అమెరికాలో ఉంటూనే విశ్వవిద్యాలయాల సెమినార్లు,సాహితీసామావేశాల్లో వక్తగా,అతిథిగా ఉత్తేజితుల్ని చేశారు..
డా.పోలసాయి జ్యోతిగారు పాఠశాల,కళాశాల విద్యార్థులకు వాఁట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసి కావలసిన సమాచారాన్ని అందించారు..
వాణీదేవులపల్లిగారు వలస కూలీలకు నిత్యావసరాలను పంపిణీ చేశారు..
డా.వినోదిని గారు ‘సంతకం’ పేరుతో కవిత్వ పరామర్శ ఫేస్బుక్ లైవ్ వీక్లీ వీడియో లు
రూపకల్పన చేశారు..
నస్రీన్ ఖాన్ వలస కూలీల నడక కు  ఒడ్డున కొట్టుకున్న చేపపిల్లలా చలించి కవితలు రాసి కదిలించారు..
   కొండపల్లి నీహారిణిగారు తెలంగాణ ఆకాడమీవారి తెలంగాణాస్త్రీల సాహిత్యం పై పరిశోధన పై కసరత్తు..
తిరునగరి దేవకీదేవిగారు ముదిగంటి సుజాతారెడ్డి 50 కథలనీ చదివి 40 పేజీల వ్యాసం వ్రాశారు.
       డా.మమతారఘువీర్ గారు వారి తరుణీ సంస్థకు 20 సం. ఉత్సవం లో భాగంగా వారు చేసిన కార్యక్రమాలను పుస్తకరూపంలోకి తేవడమే గాక భరోసా సెంటర్లని ఏర్పాటు చేశారు.
డా.త్రివేణి గారు పి.హెచ్.డి చేసే పరిశోధక విద్యార్థులకు మార్గానిర్దేశక బాధ్యతలు చేపట్టారు.
డా.సూర్యధనంజయ్ గారు ఓయూ తెలుగు శాఖ HRDC వారి పునశ్చరణ తరగతులకు అధ్యక్షత వహించి,గిరిజన సాహిత్యంపై సేవలు..
నాంపల్లి సుజాతగారు ఉన్నపళంగా వచ్చిన కరోనా సెలవుల్లో వారి విద్యార్థులను పరీక్షలకు సమాయాత్త పరిచేందుకు వాట్సాప్ గ్రూప్ ఏర్పాటుచేసి అన్నివిధాల సంసిద్ధపరిచారు.ఎన్నో కవితల్ని రాసి కరోనాని ఎదుర్కొనే ధైర్యాన్ని నింపారు..
        సలీమాగారు మహిళలమీద పెరిగిన హింసపై కథనాలు రాసి మానవి లో ప్రచురితం చేశారు,జూపాక సుభద్ర గారు తీవ్రమైన అనారోగ్యం తో దుఃఖపడుతూనే
సాహిత్యపఠనం ద్వారా సాంత్వన తెచ్చుకున్నారు.
డా.నర్మదా రెడ్డిగారు యుద్ధం లో చనిపోయిన కల్నల్ సంతోష్ బాబు జ్ఞాపకార్ధం వారిఫోటోతో పుస్తకాలు అచ్చువేయించి పేదపిల్లలకి పంచారు
         ఉరిమల్ల సునంద గారు ఉపాధ్యానిగా వర్కషీట్స్ తయారీ,శిక్షణ ఇచ్చేకార్యక్రమాల్లో
పాల్గొన్నారు.డా.ప్రతిమారాజ్ గారు కరోనా నోడల్ అధికారిగా నిజామాబాద్ జనరల్ ఆసుపత్రిలో కరోనా సోకినప్పటికీ మొక్కవోని ధైర్యంతో సేవలందించారు..
నెల్లుట్ల రమాదేవిగారు వారి బాంక్ సేవల్లో
నిమగ్నమవుతూనే..ఇక్కడ రాయలేని చదువురాని వారికోసం వారి డైరీ సేకరించి
వారి గొప్ప మనసుని చాటుకున్నారు
జి. శాంతారెడ్డిగారు పృచ్ఛకురాలిగా పాల్గొంటూ అష్టావధానాలు చేయించారు

       ఇలా గృహిణులు..కూడా ఇళ్లల్లో ఉన్న అందరి ఆరోగ్యాలకు..కషాయాలు..వండి వార్చటాలు..ఇంటి పరిశుభ్రత..లెక్కకు మిక్కిలి..పనుల్లో మునిగిపోయారు..ఈ ఆపత్కాల సమయంలో మానవీయతను చాటిన ఘటనల సమాచారాన్ని
పొందుపరిచిన ఈ కరోనా డైరీ సావిత్రీబాయి ముఖచిత్రం తో అందంగా రూపొందించబడింది..
       డా.అమృతలతగారి ఆత్మీయపలుకులు,డా.తిరునగరి దేవకీదేవి గారి ఆప్తవాక్యం..పాఠకులను..ముందుమాటగాచేయిపట్టి తీసుకెళ్లేట్లుగా ఉన్నాయి..
  మహిళలను రెండవశ్రేణి పౌరులుగా చూస్తున్న ఈ రోజుల్లో దేనికీ తక్కువ కారని నిరూపించిన సంపాదకురాలు జ్వలితగారికి
అభినందనలు.మహిళా రచయిత్రులందరినీ
ఒక తాటిమీదికి తెచ్చిన మహత్తర యజ్ఞమిది..ఎంతో పట్టుదలా అంకితభావమూ ఉంటేతప్ప సాధ్యపడని
మహత్తర..ఉద్యమం ఇది..ముందు ముందు
ఇలాంటివెన్నో..ఇంకా ఇంకా చేకూర్చాలని  మనసారా కోరుకుంటూ..

 
*****
Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.