జ్ఞాపకాల సందడి-17

చిట్కా….

-డి.కామేశ్వరి 

 

చాలామందికి  దంతసమస్య వుంటుందీరోజుల్లో. దంతసమస్యఅనగానే నోరుకంపు , పళ్ళు ఊడిపోవడం అనేవి. ముందునించి  పళ్ళని శుభ్రంగా  వుంచుకోకపోవడం, పళ్ళమధ్య ఆహారపదార్ధాలు ఇరుక్కుని కుళ్ళువాసన ,ఇన్ఫెక్షన్ తో చిగుళ్ళు వాచి బలహీనపడి  దంతాలు రాలడం, పయోరియా వ్యాధికి దారితీస్తుంది. మనిషి నోరువిప్పితే భరించలేని దుర్వాసన.

చిన్నప్పటినించి  ఏది తిన్న నోరుపుక్కిలించి కడుక్కోవడం పిల్లలకి నేర్పాలి. లేవగానేహడావిడిగా  నోట్లో బ్రష్ ఆడించేసి  ఒకసారి నోట్లో కాసిని నీళ్ళుకూడా పోసుకోకుండాఉమ్మేసి, నాలిక  ఎంతమంది పిల్లలు గీసుకుంటారో తెలీదు.  పరిగెట్టి పాలుతాగేసి  బాత్రూంలో దూరి రెండు చెంబులు నీళ్లు పోసేసుకుని(తల్లులు వంటింట్లో హడావిడిలో  ఓ కేకపెట్టడంతప్ప చూసితీరిక టైం వుండవు) అలాగే  టిఫిన్ బ్రెడ్, పరోటాలాటివి నోట్లోకుక్కేసుకుంటూ బస్సుకి పరిగెత్తడం ఇది ఈనాటి పిల్లల అలవాటు. పిల్లలేకాదు, పెద్దలు ఎవరికీ శరీరం పట్ల శ్రద్ధ వహించే టైంలేదు  పరుగుల జీవితంలో.

పళ్ళు అశ్రద్ధ చేసి నోటి వాసన మొదలుపెట్టేవరకు అది వారికీ ,ఇతరులకీ ఎంత ఇబ్బందికలిగించే ఎంబ్రాసింగ్ విషయమో తెలుసుకోవాలి. నోరారా పక్కవాళ్ళతో  మాట్లాడలేని అవస్థ. చాలామంది పెద్దలే భోజనంచేసి చేత్తో  మూతి తుడుచుకోడం తప్ప నోట్లో నీళ్ళుపోసి కడుక్కోరు. అంటే తిన్న ఆహారపు తునకలు నోటినిండావుంటాయి. కొన్నిపళ్ళలో ఇరుక్కుంటాయి,తరువాత    నెమ్మదిగా నోట్లో లాలాజలంతో కొన్ని లోపలికివెళ్ళిన పళ్ళలోఇరుక్కన్నవి మరునాటినించి  కుళ్లడం వల్ల వాసన మొదలవుతుంది.

ఒక డెంటిస్ట్ ఒకసారెప్పుడో ముప్పయి ఏళ్ళక్రితం  చెక్కపొడి తిని పళ్ళు పొడిచి కన్నంపడితే ట్రీట్మెంట్ కి వెడితే  మాటల్లో పళ్ల జాగ్రత్త గురించి చెపుతూ  టూత్ పేస్ట్ లు ఓ పదినిమిషాలు నోరు మంచివాసనకి తప్ప ఏ ప్రయోజనంలేదు. మీ చూపుడువేలు ఒక్కటిచాలు పళ్ళు జాగ్రత్తగా వుంచుకోడానికి . నోట్లో నీళ్లుపోసుకుని  వేలితో. చిగుళ్లమీద  గట్టిగ వత్తుతూ రుద్దండి ,రోజుకి కనీసం  తిన్నప్పుడల్లా, ఉదయం, సాయంత్రం, రాత్రి పడుకునే ముందు పళ్ళురుద్ది , నీళ్లు పుక్కిలించండి. ఉదయం కాస్త టూత్పేస్ట్ మీకు దొరికితే, పిడకల బూడిద గాని, బొగ్గుపొడి లోకాస్త ఉప్పుకలిపి దానితో  చిగుళ్లు, పళ్ళురుద్దితే చాలు. పళ్ళు గట్టిగా ఉండాలంటే చిగుళ్లు గట్టిపడి, రక్తప్రసరణ జరగాలి, అపుడు ఏ సమస్యలు రావు అన్నారు.

ఆరోజునించీ ఈ నేటివరకు అదే పాటిస్తున్నా.  అంతకు ముందు కూడా  ఎప్పుడు నోటివాసన వల్ల ప్రాబ్లెమ్ లేదు కానీ అందుకే ఇప్పట్టికి అన్ని కొరికి తినేటంత గట్టిగానేవున్నాయి, చిన్నప్పుడు పిడకల బూడిదతో పళ్ళుచేత్తో తోముకోడం జామా,మామిడి కాయలు, చెరుకుగడలు అన్ని కొరుక్కు తినేవారం అందువల్ల పళ్ళు గట్టిపడతాయి . ఇప్పటికీ మించిపోలేదు మన పాత అలవాటు చేత్తో నలుమూలల  గట్టిగా రుద్దుతూ  తోముకోండి. బృష్లు అవతలపారేసి అన్నారు.

నిజంగా అది అద్భుతంగా పనిచేస్తుంది , అంతేకాదు వారానికి ఒకటిరెండుసార్లు అరచేతిలో చిటికెడు వంటసోడా వేసి నాలుగు చుక్కల నిమ్మరసం కలిపి చూపుడువేలితో పళ్ల మీద చిగుర్లమీద  రుద్ది కడగండి , పళ్లమీద కట్టిన గార పోతుంది. ఒకనెలలోనే మార్పు చూడండి.

కచ్చికపొడి  దొరికితే వాడిచూస్తే  మీకే తెలుస్తుంది మార్పు. మన పాతపద్ధతులు  ఎంతమంచివో  మళ్లీ  అందరు గ్రహించేరోజులు వస్తాయి. పిల్లలకయినా ఈ అలవాట్లుమప్పండి. 

“పళ్ళకి, వేలొకటి చాలు స్లోగన్ “ అందుకోండి .

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.