అమ్మను పోల్చకు

– భమిడిపాటి స్వరాజ్య నాగరాజా రావు

అమ్మను పోల్చకు

అమ్మను ప్రకృతితో పోల్చకు.

ప్రకృతికి కోపంవస్తే కన్నెర్ర చేసి ప్రళయాన్ని పంపిస్తుంది.

కానీ,అమ్మకు కోపం వస్తే 

తన కనులను మాత్రమే జలమయం చేసుకుంటుంది.

ఓర్చుకునేదీ తానే,ఓదార్చుకునేదీ తనకు తానే,

ప్రకృతికి ఇవి రెండూ తెలియవు.

అమ్మని దైవంతో పోల్చకు.

దైవం పాలలో వెన్నలాంటిది,

కఠినమైన ప్రయత్నంతో తప్ప కరుణించదు.

అమ్మ వెన్నలో నెయ్యి వంటిది,

ఒక్క పిలుపుకే కరిగి కల్పవృక్షమౌతుంది.

దైవం తామరాకుమీద నీటి బిందువులా 

దేనికీ అంటక ఉంటుంది.

అమ్మ కరుణాసింధువై 

మన కష్టసుఖాలనన్నిటినీ అంటుకునే ఉంటుంది.

అమ్మఅనే పదంకన్నాఉత్తమపదం లేదు,

అమ్మ ఒడికన్నాఉత్తమరధం లేదు,

అమ్మఅనే పిలుపుకన్నాఉత్తమగానం లేదు,

అమ్మఅనే తలపుకన్నాఉత్తమకావ్యం లేదు,

అమ్మకొలుపుకన్నా ఉత్తమసాధనం లేదు,

అమ్మసేవ కన్నా ఉత్తమ త్రోవ లేదు,

అమ్మ శిక్షణ కన్నా ఉత్తమ రక్షణ లేదు.

భమిడిపాటి స్వరాజ్య నాగరాజా రావు.

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.