కనక నారాయణీయం -19

పుట్టపర్తి నాగపద్మిని

   పరమ కారుణ్య ఋషుల నివాసమైన

   లోకములనాతడందెడు  గాక!! శాంతి

   రాయలేలిన సీమలో బ్రదుకు వారు

   బెద్దల గుణంబులను గౌరవింత్రు గాత!!

ఇప్పటికైనా సీమవాసులు బెద్దలైనవారిని గౌరవించే గుణాన్ని అలవరచుకునవలెనన్న హితవు యీ అశ్రునివాళి సందేశం కాగా, యీ శతకాన్ని, కొప్పరపు సుబ్బయ్యగారి అభిమానులు, వెంటనే ముద్రించటం కూడా జరిగింది.

   పుట్టపర్తి జీవితంలో కొత్త అధ్యాయానికి నాంది కూడా పడింది.

   పుట్టపర్తి మనసు అశాంతికి లోనయింది. కొప్పరపు సుబ్బయ్య గారు లేని లోటు స్పష్టంగా జీవితంలో కనిపిస్తూ ఉంది. ఉద్యోగ జీవితంలోని ఒత్తిడికి కారణం సుబ్బయ్య గారు

కీర్తిశేషు లవటం. దానిని అలుసుగా తీసుకుని పుట్టపర్తి వారిని వారి ప్రతిభను విమర్శించే అవకాశం చాలామందికి దొరికింది. సున్నిత హృదయులయిన పుట్టపర్తి వారికి పరిణామం చాలా బాధాకరం గా మారింది. బయటి పరిస్థితుల ప్రభావం, వ్యక్తిగత జీవితం లోనూ కనిపించడం మొదలెట్టింది.

      పరిణామాల కి విసుగు చెందిన పుట్టపర్తి ఒకరోజు ప్రొద్దుటూరు అగస్తేశ్వర స్వామి సన్నిధిలో మౌనంగా కూర్చుని తన జీవితాన్ని నెమరు వేసుకుంటున్నారు. 30 ఏళ్ల తన జీవితంలో ఎన్ని అనుభవాలు?? ఎన్ని జ్ఞాపకాలు?? మధుర ఘట్టాలు?? కంచి పరమాచార్య వారి ఆశీస్సులని అందుకున్న నాటి అనుభవం ఇంకా తాజాగానే ఉంది. స్వామి శివా నందుల వారి పరీక్షా సమయం తర్వాత సరస్వతి పుత్రునిగా రిషికేశ్ నుంచి తిరిగి రావటం ఒక అద్భుతమైన అనుభవం. కొప్పరపు సుబ్బయ్య గారి చలవ వల్ల ఉద్యోగ భద్రత చేకూరి ప్రస్తుతం జీవన నౌక ఒడిదుడుకులు లేకుండా పయనిస్తున్న సమయాన సుబ్బయ్య గారి నిష్క్రమణ అశనిపాతం లా అనుభవంలోకి వచ్చింది..

       రాయలనాటి రమణీయ జీవితం మొదలైన వ్యాసములు భారతిలో ప్రచురితమై, తనలోని ఆత్మవిశ్వాసాన్ని మళ్లీ చిగురింప చేశాయి. కానీ విధంగా ఎన్నాళ్ళు?? తన జీవితానికి ఒక భద్రతను చేకూర్చే అవకాశం మరి రాదా?? భక్తుల కొంగు బంగారమై వెలసిన భక్తవశంకరుడయినా తనకొక దారిచూప డా ??’ ఆలోచన రాగానే, పుట్టపర్తి హృదయ ఫలక0 పై ఒక మెరుపు మెరిసింది. మెరుపు లో, గుడి చుట్టూ చేతులు జోడించి, భక్తి భావ తన్మయ హృదయంతో ప్రదక్షణాలు చేస్తున్న కొందరు భక్తులు కనిపించారు. ఒక మండలం పాటు తాను కూడా దీక్షతో స్వామికి ప్రదక్షిణలు చేస్తే?? మనసులో భావన రాగానే, తన సమస్యలన్నీ పటాపంచ యినట్టు హృదయం తేలికయింది. అదేనేమో, భగవంతుని దేశం అంటే !! ఆలోచన రావడమేమిటి?? దానిని అమలు లో పెట్టడం ఏమిటి?? వెంటవెంటనే జరిగిపోయాయి.

      శివాలయంలో ప్రదక్షణలు ప్రారంభమయ్యాయి. ప్రతిరోజు ఆలయం చుట్టూ 108 ప్రదక్షిణలు మండలం పాటు చేయాలని సంకల్పం. ప్రదక్షిణలు లెక్క పెట్టేందుకు ఎవరైనా కావాలి. పెద్ద కుమార్తె కరుణా దేవి కనిపించింది. అమ్మాయిని పనికి నియోగించారు . ఒక డబ్బా లో, 108 చింత పిక్కలు వేసుకుని గుడి వెనకాల ఉన్న చెట్టు కింద కూర్చుంది కరుణా దేవి. పెద్ద గుడి చుట్టూ అయ్య ఒక్కో ప్రదక్షిణ చేస్తూ ఉంటే, ఒక్కొక్క చింతపిక్క, వెంట తెచ్చుకున్న మరొక ఖాళీ డబ్బాలో వేస్తూ ఉండటం ఆమె పని. క్రమం తప్పకుండా జాగ్రత్తగా గమనిస్తూ 108 పిక్కలు పూర్తయ్యే వరకు చూసి, చివరి ప్రదక్షణం ముగిశాక, అయ్యగారికి తెలియజేయాలి. ఇది ఆమె పని.

గుడి ప్రాంగణం అంతా ఒక ప్రదక్షణ చేసేందుకు దాదాపు 5 నిమిషాల సమయం పట్టవచ్చు. అటువంటిది 108 పూర్తి చేయాలంటే, కనీసం నాలుగైదు గంటలు. ప్రదక్షిణలు చేసేవారికి తదేక ధ్యాన చిత్తం కావాలి. లెక్కించే వారికి, కూడా ఓపిక చాలా అవసరం. 10 ఏళ్ల వయసులో, కరుణా దేవికి అప్పగింపబడిన పనిని, చిన్నారి ఆటపాటలు మరచి తండ్రిగారికి పూర్తిగా భయభక్తులతో సహకరించి చేసింది.

దాదాపు పది రోజులు గడిచిపోయాయి. ఉదయం 108 చేసిన తర్వాత పాఠశాలకు వెళ్లి, సాయంత్రం ఇంటికి చేరుకోవడం, రాత్రి పడుకోబోయే ముందు తనకు దారి చూపించ మనీ సదాశివుని వేడుకోవటం చేస్తున్నారు పుట్టపర్తి.

    ఒకరోజు, రాత్రి ఎంతకీ నిద్ర రావటం లేదు!!    మనోనేత్రం ముందు పడమటి దిశన అల్లుకుంటున్న బంగారు కాంతులు. కాంతుల మధ్య అటు ఇటు పరుగులు పెడుతున్న విహంగ బృందాలు. ఆకాశాన  మంచు కొండలవలె   విస్తరించిన మేఘ బృందాల నుంచి అప్పుడప్పుడు, తప్పించుకుని, నేలను తాకుతున్న సూర్య కాంతి కిరణాలు, ఆకాశాన విహరిస్తున్న దేవకన్యల చీర కొంగు లాగా కనిపిస్తున్నాయి. అంతేనా!! సాయం వేళ తమ తమ నెలవుల యిన గూ ళ్లకు   చేరుకుంటున్న పక్షి బృందాల సవ్వడుల లో, ఏదో రహస్య సందేశం తన చెవికి తాకుతోందిప్రదోష వేళ, కైలాసగిరి శిఖరాలపై శివపార్వతుల సంధ్యా నర్తనం వీక్షించేందుకు సన్నద్ధమవుతున్న ప్రకృతి  పరవశతను గొంతెత్తి పాడమని తనను ఏదో శక్తి ఆదేశీస్తున్నట్టుగా తన చెవిలో స్పష్టంగా వినిపిస్తున్నదిఅదుగో!! సంధ్యా భాస్కరుడు ఆదిదంపతుల నాట్య సంబరం భాన్ని పడమటి దేశాలకు తెలిపేందుకు త్వరగా వెళ్తున్నాడు ఏమో, అన్నట్టుగా కడు రమణీయంగా ఉందిపడమటి పటలం!! . కవితా వే శాన్ని కలిగిస్తున్నది . ఇక ఆవేశం పుట్టపర్తిని పడుకో నివ్వ లేదు.

ఏమానందము

భూమీ తలమున

శివతాండవమట !!

శివ లాస్యం బట !!

అలలై, బంగరు

కలలై, పగడపు

బు లు గుల వలె

బ్బులు విరిసిన వి !!

శివతాండవమట !!

శివ లాస్యం బట !!

వచ్చి రో ఏమో !! వి

చ్చ కాంతలు

జల దా0 లై

విలో కిం చుటకు

శివ లాస్యం బట !!

ఏమానందము

భూమీ తలమున!!

      మనోవీధిలో ఏదో కల కలం!! అక్షరాలకు అందీ అందని ఆవేశం!! వర్ణ వర్ణ కాంతులతో వివిధ చిత్రాలను కళ్ల ముందు నిలుపుతున్న వైనం!! చెప్పలేని వేగంతో గిర్రున తిరుగుతున్న భూమ్యాకాశాలు!! చెట్టు పుట్ట, నదులు సముద్రాలు, జీవజాలం అంతా, ఆనంద సముద్రం లో మైమరచి అడుగులు వేస్తున్నట్టు కనిపిస్తున్న దృశ్య పరంపర!! అంతలోనే శరవేగంతో ముందుకు దూసుకెళ్తున్న దృష్టి!! అంతలో కర్ణపేయంగా వీణ, వేణు , మృదంగ, సమ్మేళనం దృష్టిని అటు లాక్కుని వెళ్ళింది. ఎదురుగా సువర్ణ కాంతులు విరజిమ్మే వేదిక!! దానిపై, వాద్య సమ్మేళనానికి అనుగుణంగా అతి రమ్యంగా నృత్యం చేస్తున్న జంట ఎవరు?? కనీ కనపడని వెలుగుల దోబూచులాట లో, కష్టపడి కనుగొన్న రూపాలు ఇంకెవరివి??

     తన ముక్కంటి వెలుగు లతో సర్వ సృష్టిని ఉద్దీపింప చేస్తూ, స్థితిగతులను సక్రమ రీతిని ల్లసితం చేస్తూ, అవసర సమయాల్లో బంధాలకు అతీతంగా లయింపజేస్తూకైలా శిఖరాల పై ధ్యానమగ్నుడై కొలువైన ఆదిదేవుడు ఆయన!!

అంతలోనే సప్త సాగర సముద్భవ మైన సప్తస్వర సంగీత తరంగాలు నెమ్మది నెమ్మదిగా విస్తరిస్తున్నాయి. తరంగాల నుంచి వెలువడుతోంది ఒక అద్భుత మృదంగ నాదం. నాదానికి తోడై అందమైన గజ్జియలను సొగసుల ఆవిష్కరించిందిఅందమైన నురగల వరుస!! రాను రాను మృదంగ నాదానికి శంఖ ధ్వని తోడు కా గా హిమగిరి లన్నీ నాద మాధుర్యానికి పరవశించి పోతున్నాయి. ఆదిశంకరుని కాలి అందెలు లయాత్మకంగా కదులుతున్నాయి. నాట్య ఉత్సాహంధ్యాన సమాధిని అధిగమించింది. భవుడు ఆడుతున్నాడు. ముద్రలు పడుతున్నాడు. భంగిమలు మారుస్తున్నాడు. కన్నులలో నవరస విన్యాసాలను ఆవిష్కరిస్తున్నాడు. . కనుబొమ్మల కదలికలలో కోటి కోటి భావాలను పలికిస్తున్నాడు. ఒక్క క్షణం య్యారం !! మరు నిమిషంగాంభీర్యం!! ఘడియ ఘడియ కుకనులు తి ప్పుకో లేనంత వైవిధ్యం!! అక్కడున్న దేవతా బృందాల మనసు లలోసంభ్రమం!!!  అందరికన్నా ఎక్కువగా ఆనందపు అంచులు వరకు ఆస్వాదించిన వాడుఇంకెవరు?? సతీ సమేతంగా వీక్షిస్తున్న నారాయణుడే!!!

         నాట్య విద్య విశారదుడయిన నటరాజ స్వామి తన విద్యనంతా ఈనాడు ప్రదర్శిస్తున్నా డా!! అన్నంత విభ్రాంతి !! నాట్య వేశంతో ఊగి పోతున్న భువనేశ్వర స్వామి, ఒకసారి తన అర్ధాంగి భవాని కళ్ళతో కళ్ళు కలిపాడు. కలయిక లో కమ్మని ప్రేరణ !! ఈశ్వరి అందంగా కనులు చిట్లించింది. తల వంచి, పతిదేవుని అంతరంగాన్ని అవధరించు నట్టుగా అంగీ కృతి తెలిపింది. ప్రక్కనున్న తన చెలికత్తె విజయ ను హెచ్చరించింది. విజయ హర్షాతిరేకంతో జాత లాస్య ఆరంభాన్ని ప్రకటించింది. భ్రామరీ సున్నితంగా కాలు కదిలించింది. ఆడినది గిరి కన్నె!! పాడినది గిరి కన్నె!! భూచారీ, ఖచారీ నాట్యముల విన్నా ణాలను అతి విలాసంగా ఆవిష్కరించింది పాటలావతి !!

      పరిసరాలను మరచి పరమేశ్వరుడు ఈశానీ విన్యాసాలను వీక్షి స్తున్నాడు . పరమేశ్వరుని పరవశ తను క్రీగంట గమనించిన శివ ప్రియ, భవుని హృదయ తలాన పద లా క్ష చిత్రించి తన ఆధిక్యాన్ని నిరూపించుకో గానే, అక్కడ ఆదిదంపతుల నాట్య ప్రతిభను ఆస్వాదిస్తున్న గీర్వాణ బృందాల హర్షధ్వానాలు మిన్నుముట్టాయి. శివ శక్తులకు మంగళం పాడాయి. ‘ దేవాదిదేవా!! నిర్వాణ రూ పా !! గౌరీ పతే !! నిత్య సౌభాగ్యము మీకు!!’ అంటూ!!

      భావోద్వేగం అంతా అప్పటికప్పుడు అక్షరరూపం దాల్చిందిపుట్టపర్తి లేఖిని ద్వారాశివతాండవం అన్న గేయ కావ్యం రూపంలో!! కావ్య ఆవిష్కరణకు వేదికగా నిలిచిందిప్రొద్దుటూరులోని అగస్తేశ్వర ఆలయం

(సశేషం)

****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.