ప్రముఖ రచయిత్రి శీలా సుభద్రాదేవి గారితో నెచ్చెలి ముఖాముఖి

-డా||కె.గీత 

శీలా సుభద్రాదేవి ప్రముఖ కవయిత్రి, కథారచయిత్రి, చిత్రకారిణి. వీరు డిసెంబర్19, 1949లో విజయనగరంలో జన్మించారు. ఎమ్.ఎ.( తెలుగు), ఎమ్.ఎస్సీ(గణితం)బి.ఇడీ చేశారు. 
ఆర్టీసీ ఉన్నత పాఠశాలలో గణిత ఉపాధ్యాయినిగా, ప్రధానోపాధ్యాయినిగా పనిచేసి,  పదవీవిరమణ చేశారు. ప్రముఖ రచయిత, చిత్రకారులు శీలా వీర్రాజు గారి సహచరి. తొలిరచన 1975లో వెలువడింది. స్త్రీవాద కవిత్వోద్యమం ప్రారంభమవటానికి ముందుగానే, 1980ల నాటికే వీరు  పురుషాహంకారాన్ని సవాల్ చేస్తూ కవిత్వం వ్రాసారు. వీరికి  పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుండి ఉత్తమ కవయిత్రి పురస్కారం మొ.న అనేక పురస్కారాలు లభించాయి.

ప్రచురించిన పుస్తకాలు:

కవితా సంపుటాలు:
1.ఆకలినృత్యం( 1980)
2. మోళీ (1984)
3.తెగినపేగు(1992)
4.ఆవిష్కారం(1994)
5.ఒప్పులకుప్ప( 1999)
6.యుధ్ధం ఒక గుండెకోత (2001)
7.ఏకాంతసమూహాలు( 2004)
8. బతుకు బాటలో అస్తిత్వరాగం(2009)
9.నా ఆకాశం నాదే(2016)
10. శీలా సుభద్రాదేవి కవిత్వం(2009)
11 .War,A Heart’ Ravege( 2003) యుద్ధం ఒక గుండెకోత దీర్ఘ కవితకు ఆంగ్లానువాదం
12.Yuddh A Dil ki vyadha (2017) యుద్ధం ఒక గుండెకోత దీర్ఘకవితకు హిందీ అనువాదం.

కథాసంపుటాలు :
1.దేవుడిబండ(1990)
2.రెక్కలచూపు(2008)
3.ఇస్కూలు కథలు(2018) వ్యాస సంపుటి::
4.కథారామంలో పూలతావులు(రచయిత్రుల కథలపై వ్యాసాలు.

ఇతరములు :
1. గీటురాయి పై అక్షర దర్శనం(2017)
( రచయిత్రి రచనలపై సమీక్షావ్యాసాలు)
2.డా.పి.శ్రీదేవి మోనోగ్రాఫ్ (2018)
( కేంద్ర సాహిత్య అకాడమీ ప్రచురణ.)
3. ముద్ర _ వందమంది కవయిత్రుల సంకలనానికి
సహసంపాదకత్వం.(2001)
4. నీడల చెట్టు నవలిక.(2016)

పురస్కారాలు:

1.తెలుగువిశ్వవిద్యాలయం నుండి97 లో సృజనాత్మక సాహిత్యానికి పట్టాభిరామిరెడ్డి ఎండొమెంట్ అవార్డ్
2. శ్రీపొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుండే 99 లో ఉత్తమరచయిత్రి అవార్డ్
3.కడప సాంస్కృతిక సంస్థ నుండి 2011 లోగురజాడ అవార్డ్
4.ఆవంత్స సోమసుందర్ గారి నుండి 2011 లో దీర్ఘకవిత్వానికి రాజహంస కృష్ణశాస్త్రి పురస్కారం.
5.ఉమ్మిడిశెట్టి రాధేయ త్రిదశాబ్ది ప్రతిభా పురస్కారం (2018)
6.కవిత్వానికి అమృతలత అపురూప పురస్కారం (2018)
7.రెక్కలచూపు కవితా సంపుటికి గంగిశెట్టి లక్ష్మీనారాయణ గారి మాతృపురస్కారం (2018)

*****

(ప్రముఖ రచయిత్రి శీలాసుభద్రాదేవి గారితో నెచ్చెలి ప్రత్యేక ముఖాముఖి వీడియోని పైన ఇస్తున్నాం. 
చూసి, మీ అభిప్రాయాలు తప్పక తెలియజెయ్యండి.)

*****

Please follow and like us:

2 thoughts on “ప్రముఖ రచయిత్రి శీలా సుభద్రాదేవి గారితో నెచ్చెలి ముఖాముఖి”

  1. గీతగారూ
    నమస్తే.
    మీరు నెచ్చెలి పత్రిక కోసం చేసిన నాతో ముఖాముఖిని చూసిన శ్రీకాకుళం లో డిప్యూటీ కలెక్టర్ గా పనిచేస్తున్న సాహిత్యాభిరుచి,అభినివేశం గల ఆమె తన భర్త తో ” ఈమె కోటబొమ్మాళి లో 62 లో చదివారు.మీ వయసే ఉన్నట్లుంది.మీకు తెలుసేమో చూడండి”అందట.ఆయన మరో ఫ్రెండ్ తో మాట్లాడి నాఫోన్ నెంబరు కనుక్కుని నాతో మాట్లాడి ఆనాటి విషయాలు చర్చించాడు.సుమారు అరవై ఏళ్ళ నాటి క్లాస్ మేట్ ఫోన్ చేసి అప్పటి స్కూల్ విషయాలు గుర్తు చేయటం ఒక అపురూప అనుభూతిని కలుగజేయటం మీ వలన కలిగింది.మీకూ, నెచ్చెలి కీ ధన్యవాదాలు.

    1. నెచ్చెలి పత్రిక కోసం అడగంగానే ముఖాముఖిని మాకు బహుమతిగా ఇచ్చిన మీకే ధన్యవాదాలు సుభద్ర గారూ. ఈ ఇంటర్వ్యూ వల్ల మీ బాల్య మిత్రుల్ని కలుసుకునే అవకాశం మీకు కలగడం నాకు అత్యంత సంతోషాన్నిస్తూ ఉందండి.

Leave a Reply

Your email address will not be published.