ఎన్ని దుఃఖాలు ఇంకా ముసురుతున్నా

-గవిడి శ్రీనివాస్

కాలం కనుబొమల మీద 
అలల్లా  పరిచయాలు కదులుతుంటాయి .

కొన్ని లెక్కలు సరిపడి ముడిపడతాయి
కొన్ని నిజాలు జారిపడి వేరుపడతాయి

కృత్రిమ పరిమళాల మధ్య
బంధాలు నలిగిపోతున్నాయి .

కొన్ని ఆర్థిక తూకాల్లో
తేలియాడుతుంటాయి .

ప్రతి చిరునవ్వు వెనుక
ఒక వినియోగపు ప్రణాళిక
పరచుకుంటుంది .

అంతా పరాయీకరణ లో
విలవిలలాడుతున్నాం .

ఒంటరి పోరాటం లో
అవాంతరాల మధ్య
శక్తి గా వెలగటం
కార్య దీక్షకు సాక్ష్యం పలుకుతుంది .

సంతోషం పూయిస్తూ
ప్రయత్నాలు  నడిపిస్తూ
ముందుకు ఉరకటమే ఆదర్శం.

ఎన్ని దుఃఖాలు ఇంకా ముసురుతున్న
కాగే లక్ష్యం మీద
వేగే అడుగుల పరుగులు తీస్తుంటాయి
కలలు   పూసేవరకూ…!

*****

Please follow and like us:

2 thoughts on “ఎన్ని దుఃఖాలు ఇంకా ముసురుతున్నా (కవిత)”

  1. చాలా బాగుంది కవిత…
    కలలు పూసేవరకు
    అడుగుల పరుగులు సాగాలి…
    ఎన్ని దుఖాలు ముసురుతున్నా…..

  2. కృత్రిమ పరిమళాలమధ్య నలుగుతున్న బంధాలు …ఎంత కవితాత్మకంగా ఉందో మీ కవిత. ఆత్మను తడిమే అక్షరాలు మీవనిపించింది. వస్తువులతో ,యంత్రాలతో మెలగుతూ ప్రేమాప్యాయతలకు దూరం కావడం, ప్రతి బంధాన్ని ఆర్థికంతో ముడిపెట్టడం, స్వార్థం తో విడివడే స్నేహాలు, కఠోర శ్రమతో లక్ష్యం వైపు నడిచే అడుగులు…వాఁహ్ మీ కవిత👏👏👏🙏🙏🙏

Leave a Reply

Your email address will not be published.