నైరూప్యం లేదా అధివాస్తవికత 

-డా. శ్రీనాథ్ వాడపల్లి

రోజూ

రాత్రి మొదలవ్వగానే

ఒక విచిత్రమైన కల.  ముక్కూ మొహం తెలీని ఓ కొమ్మ పూల చెట్టు కింద ప్రేమని తుంచుకొంటూ నాకూ కొన్ని మొగ్గలు రహస్యంగా  అయితే ఆమె ప్రేమిస్తున్నట్టు అర్ధం చేసుకున్నట్టు  –  కనిపించదు. అలా అని – ఏమీ తెలీదని కాదు. పునరుజ్జీవన కాలం వర్జిన్ కళ్ళకు నా మూసిన కళ్ళలో బొట్టు రహస్యం తెలుసు.  నలుపాతెలుపాచామన ఛాయా ?పేరు కూడా తెలీదు.  ఉంటే అది నాకు నచ్చిన పేరే ఉంటుందని నా నమ్మకం.  గుమ్మం ముందు మట్టిగోలెం లోచిట్టి పువ్వు  పేరైనా అంబరంలో మినుకు తారకైనానీలి సముద్రంలో బిందువైనా  కావొచ్చు ఏదైనా నాకు నచ్చేదే.  అరచేతి చందమామతో గారాబంగా చేతులు చాపుతానుబంగారం అంటూ.  హఠాత్తుగా ఓ కీచు గబ్బిలం గోడకు కొట్టుకొన్న శబ్దం నన్ను నిద్రలేపుతుంది.

*****

Leave a Reply

Your email address will not be published.