గతస్మృతి

(హిందీ మూలం: శివానీ)

-అక్షర

          మన రాష్ట్ర విభజన వల్ల ఏర్పడిన హిందూ ముస్లిం రైట్స్  చెలరేగాయి. ఆ రైట్స్ వల్ల ఎంతమంది జీవితాలు ఎంతగా తారు మారు అయినాయో మనకి తెలియటానికి సుప్రసిద్ధ హింది రచయిత్రీ ‘శివానీ’ రాసిన కథ ‘లాల్ మహల్’ ఒక నిదర్శనం. ఈ కథాంశమే నన్ను ఈ కథని మన తెలుగు భాషలోకి అనువదించ టానికి ప్రేరేపించింది.

‘గతస్మృతి’

అంతులేని ఆవేదన

          తాహిరా పక్క బర్త్ పై పడుకున్న భర్త వేపు చూసి ఒక నిట్టూర్పు విడిచింది. పక్కకు తిరిగి పడుకుంది. రగ్గు కప్పుకున్నరహమాన్ అలీ ,ఎత్తైన బొజ్జ రైలు కుదుపులకి ,ఉండి-ఉండి కంపిస్తునది. ఇంకా మూడు గంటలు మిగిలాయి. తాహీరా తన నాజూకు చేతికి వజ్రం పొదిగిన రిస్ట్ వాచుని తిట్టుకుంది. ఎంతకీ కాలం గడవటం లేదేమిటని రాత్రంతా ఒక్క క్షణం కోసం అయినా కళ్లుమూతలు పడలేదు.

          ఒక బెర్త్ పై తన భర్త ,దాని క్రింద బెర్త్ పై తాహీరా కూతురు సలమా ఒంటి పై తెలివి లేకుండా పడుకున్నారు. గాబరాగా లేచి కూర్చొంది. అసలు తను భర్త మాట విని ఎందుకు వచ్చింది, ఏదో ఒక వంక పెట్టి తప్పించుకోవాల్సింది. ఏ పుండు ని గడిచిన కాలం విస్మృతి తో కప్పెసిందో ,ఆ పుండుని కత్తి తో కేలికి పోతున్నది. ఫలితం అనుభంచక తప్పదు.

          స్టేషన్ వచ్చేసింది. తాహిరా ముఖం పైకి బుర్ఖా లాక్కున్డి.

          ఖరీదైన సూట్కేసు, కొత్త హోల్డాలు, సరికొత్త ఎయిర్ బాగు,వెండి కూజా దింపించి రహ్మాన్ అలీ ఏదో గాజు బొమ్మ పొరపాటున కింద పడి పొరపాటున పగిలి పోతుందేమో అన్నంత భద్రంగా తాహిరా ని కిందకు దింపాడు. సల్మా ముందే క్రిందకి గెంతి దిగిపోయింది.

          దూరం నుంచి రొప్పుకుంటూ , చేతి లో నల్ల టోపీ పట్టుకుని,ఒక పొట్టి వ్యక్తి వచ్చి, గబుక్కున రహ్మాన్ అలీ ని కౌగలించుకున్నాడు. ఇద్దరి కళ్లనుంచి కన్నీరు ధారా ప్రవాహంగా కారిపోతున్నాయి. “ ఓహో ఇతనే నా ఆ పొట్టి మావ!!” అని మనసులో అనుకుంది తాహీరా. సల్మా ని చూసి వెంటనే  ఎత్తుకుని, ఇస్మత్ లా ఉంది, రహమాన్. అంటూ సల్మా ముఖాన్ని ముద్దులతో నింపేసాడు. “ అదే ముఖాకృతి అదే కను ముక్కు తీరు. ఇస్మత్ లేదు కదా, అల్లాహ్ ఇంకో చిన్న ఇస్మత్ని పంపించేశాడు.

          తాహీరా అలాగే రాతి బొమ్మలా నిలబడి పోయింది. తన గుండెల పై కుంపటి ఎవరు చూడగలరు. అదే స్టేషన్ అదే మర్రి చెట్టు. పదిహేనేళ్ల తరవాత కూడా ,ఆ స్టేషన్ని ఎవరు మార్చలేక  పోయారు.

          ‘పదమ్మా’ మావ అన్నాడు.” బయట కారు ఉంది. చిన్న జిల్లాయే.కానీ అల్తాఫ్ పోస్టింగ్ ఇక్కడికే అయింది. మళ్ళీ సారి ఇన్శాల్లాహ్ పెద్ద సిటీ కి వేస్తారు.

          మావయ్య ఒక్కగానొక్క కొడుకు పెళ్ళికి రహ్మాన్ అలీ పాకిస్తాన్ నుంచి వచ్చాడు. అల్తాఫ్ కి పోలీస్ కెప్టన్ గా ఈ ఊరిలోనే పోస్టింగ్ దొరకాలా.

          మనస్సులోనే తాహీరా చాలా విసుక్కుంది.

          ఇంటి కి వెళ్ళేసరికి ముసిలి అమ్మమ్మ సంతోషంతో పిచ్చెత్తి పోయింది. మాటి మాటి కి రహ్మాన్ ని గుండెలకు హత్తు కుని ముద్దుల్తో ముంచ్చెత్తేసింది. ఆ తరువాత సలమా ని చూసి తాహిరా ని పూర్తిగా మర్చిపోయింది. “యా, అల్లాహ్, ఇదేం విడ్డూరం, మళ్లీ ఇస్మత్ ని తిరిగి పంపించేశాడా!!” కోడళ్ళు ఇద్దరు కూడా “ అవును అమ్మిజాన్ సలమా అచ్చు అక్కలా  ఉంది.పాపం కొడలి ముఖం వైపు చూడండి.

          ఇదో ఈ ఆశరఫీ తీసుకో.” అంటూ అమ్మమ్మ బుర్ఖా తోలిగించి ఆశరఫీ తాహీరా చేతికి ఇచ్చి, “ అల్లాహ్!! చంద్ర బింబం లాంటి అందమైన ముఖం, నగమా చూడు, సన్నటి బంగారు దీపం వెలుగుతోంది.”

          తాహీరా సిగ్గు తో ముడుచుకు పోయింది. పదిహేనేళ్లలో మొదటి సారి అత్తవారింటికి వచ్చింది. చాలా కష్టం మీదే వీసా దొరికింది. మూడు రోజులు ఉండి పాకిస్తాన్ వెళ్లిపోవాలి. కానీ ఈ మూడు రోజులు తనకి ఎలా గడుస్తాయి!!!

          “పద కోడలా, పై గది కి వెళ్ళి కాసేపు విశ్రాంతి తీసుకో . నేను టి చేయించి పంపుతా.” అంటూ చిన్న అత్త తాహీరా ని పైకి తీసుకుని వెళ్లింది. రెహ్మాన్ క్రిందనే కూర్చుని వాళ మావ తో కబుర్ల్ల లో  పడ్డాడు. సల్మాని పెత్తల్లి ఒల్లోకి లాక్కున్దీ. మాటి-మాటి కి తన జుట్టు నిమురుతు ,వెక్కిళ్ల మధ్య ‘ నా చిన్నారి ఇస్మాత్. నా తల్లి.’ అంటూ.

          ఏకాంతంలోకి వచ్చి తాహిర బుర్ఖా తీసి పడేసింది.బయట గాలి కోసం కిటికీ తెరిచి చూసి స్టబ్దుగా ఉండి పోయింది. ఎదురుగ్గా అదే పెద్ద ఎర్రటి భవన్తి. వెంటనే కిటికీ మూసి వేసి వచ్చి మంచం పై పడింది. “ యా ఖుదా! ఎందుకు నన్ను ఇలా సతాయిస్తున్నావు? ముఖం కప్పుకుని మెల్లగా రోదించింది. “ఎవరినో ఎందుకు తప్పు పట్టటం?” తనకి మునుపే తెలుసును కదా! హిందుస్తాన్ తాము వెలుతున్న నగరం లో ఒకొక్క రాయి, తన తల పై పర్వతంలా బద్దలయ  పడతాయి అని. తన పెనిమిటికి పాపం ఏం తెలుసు!!

          అమాయకుడైన రహమాన్ అలీ కల్ల లో  తాహిర పట్ల ప్రేమ తాహీరాన్ని పెంపుడు లేడి లా కాళ్లు కట్టి పడేసింది. హిందుస్తాన్ రాష్ట్ర విభజన జరిగినప్పుడు తాహిరా పదహారేళ కన్నే పడుచు, సుధా. సుధా తన మావయ్య తో, మావయ్య కూతురి పెళ్ళికి ముల్తాన్ వచ్చింది. అప్పుడే పెద్ద ఎత్తున దంగాలు మొదలు. ముస్లిం గూండాలు కుక్కల్లా మీదపడి తనని చీల్చేలా ఉన్నారు. అప్పుడే రహ్మాన్ అలీ వచ్చి దేవ దుతుడిలా “వాళు నిన్ను వదలరు. హిందువులు వాళ ఆడవారిని వదిలారా” అంటూ అప్పుడు సన్నగా ఉన్న రహ్మాన్ అలీ తనని మేఘములా  కప్పివేశాడు.

          సుధా బతికి పోయిన్ది కానీ తాహీరా గా మారింది. రహ్మాన్ పడచు భార్యని ఇలాగే చంపి వేశారు. తాను మాత్రం  ఎలాగో ప్రాణాల్తో,గాయ పడిన మనస్సుతో బయట పడ్డాడు. సుధా చాలా ఆలోచించింది. సుధా ఏమాత్రం నిస్పృహగా కనిపించినా రహ్మాన్ తను కావాల్సింది ఎంత కష్ట పడి ఆయినా తెచ్చి పెట్టేవాడు. సుధా నవ్వితే రహ్మాన్ కి వీనల విందు.

          ఏడాది తిరిగీ కూతురు పుట్టెసరికి వారి మధ్య మిగిలిన ఉన్న కొద్దిపాటి అసంతృప్తి కూడా మైనంలా కరిగి పోయింది.

          తన అదృష్టం ఎలా మెరిసింది అంటే ఒకప్పుడు కరాచీ లో చిన్న కిరాణా కొట్టు, ఆ ప్రదేశంలోనే అత్యంత పెద్ద డిపార్టమెంటల్ స్టోర్ గా మారి, దాని యజమాని అయిపోయాడు రహమాన్ అలీ. పదేసి  సుందరాంగులు, ఎంగ్లోయిండియన్ వనితలు అతని కను సైగ కి బానిసలు. అమెరికన్ నైలాన్, డేకరాన్ వస్త్రాలు అమ్ముతున్నారు. సన్నంగా ఉండే రహ్మాన్ ఐశ్వర్యం రాంగానే గాలి నింపిన బలూన్లా తయార్ అయ్యాడు. ఠీవి తో మెడ ఎప్పుడు పైకే ఉండేది. అతని స్వరంలో  కూడా అమెరికన్ యాస చోటు చేసుకుంది. కానీ చేతికి ఖరీదైన ఉంగరాలు ,వంటికి అమూల్యమైన ఆభరణాలు ధరించిన తాహీరా కి ఇప్పుడు కూడా ఖరీదైన మంచం పక్క పై పడుకున్నా నిద్ర రాక బాధ పడుతూ ఉంటుంది. మార్చ్ నెల లో శీతాకాలం నుంచి విడి పడుతున్న సన్నటి వేడి నిండిన మధ్యాహ్నాలు, నీటి నుంచి తీసి బయట పడేసిన చాపల్ల కలవర పడుతున్నది. మస్తీ నిండిన ఆ హోలీ ఇంకా తన పాకిస్తాన్ జీవితంలోకి రాదు కదా!! లేత గులాబీ రంగులో అతి మృదువైన తన దుపట్టా తనకి బాగా ఙాపకం . అమ్మఆ దు పట్టా పై చం  కి పని చేసింది. చేతిలో లావు పుస్తకం పట్టుకుని తన భర్త ఏదో చదువు కొంటున్నాడు. ఉంగరాలు తిరిగిన జుట్టు అతని తెల్లటి నుదుటి పై పడుతున్నది, చేతిలో సగం వెలుగుతున్న సిగరెట్టు అతని చేతి లోనే ఆరి పోయి ఉంది. గులాబీ దుపట్టా పై మెరుస్తున్న చెంకి చూడంగానే అతను తల ఇంకా దించేసుకున్నాడు. అందమైన అల్లరి నవ-వధువు ని చూసి బెరుకుగా ఉండి పోయాడు పాపం. వెనక నుంచి వచ్చి సుధా అతని రెండు చెక్కిళ్ళ పై అబీర్ రంగు పులిమేసి, ఏమీ ఎరగనట్టు వంట- ఇంటి లోకి దూరి అత్త తో కలిసి కజ్జికాయలు చేయ టానికి ఉపక్రమించింది. అక్కడ నుండే అత్త కళ్ళు కప్పి నాలిక బయట పెట్టి వెక్కిరించింది. తాను ముల్తాన్ వెల్టానికి తయారవంగానే , అతను ఎంతలా చెప్పాడు ‘సుధా ముల్తాన్ వెళ్లొద్దు’ అని. కానీ తనకు ఏం తెలుసు దురదృష్టం కూడా తనని వెన్నాడుతూ వస్తోందని. స్టేషన్ కి వచ్చాడు అతను. ఇదే స్టేషన్ ఇదే మర్రి చెట్టు. మావయ్య తో పాటు దుపట్టాతో ఒళ్ళు ముఖం అంతా దాచుకుని ఉంది. ట్రైను బైల్దేరుతుంటే ఎలాగో చున్నీ కొంచెం ఎత్తి ఆఖరి సారి అతన్ని చూసింది. అదే అమృత మయమైన అతని ఆఖరి చూపు.

          సుధా చనిపోయింది తాహీరా బతికి ఉంది. తను మళ్ళీ వణుకుతున్న చేతుల్తో కిటికీ తెరిచింది. అదే ఎర్ర రంగు భవన్తి, పెద్ద వకీల్ -సుధా మావగారిది. భవనం టేర్రెస్సు పైకి ప్రాకిన సన్నజాజి లతలు. మూడో గది ఎక్కడైతే తన మధురమైన రాత్రులు గడిచాయో. ఇప్పుడు ఏం చేస్తున్నారో. మళ్ళీ పెళ్లి చేసుకుని ఉంటాడా !! ఏమో పిల్లల్తో ఆడుకుంటు న్నారేమో. కన్నీరు కారుతోంది. ఒక తెలియని మొహం లోనుంచి బయట పడటానికి ప్రయత్నిస్తోంది.

          తాహీరా ఎక్కడ ఉన్నావు? అంటూ రహమాన్ అలీ స్వరం వినిపించింది. ఉన్న పళంగా లేచి గాబరాగా కళ్ళు తుడుచుకుని తమ హోల్డాల్ విప్పటం మొదలు పెట్టింది. రహ్మాన్ తన చెమ్మగిల్లిన కళ్లు చూసి మోకాళ్ల పై కూర్చుండి పోయాడు. ఏమైంది బీబీ? తల నొప్పిగా ఉందా? కాసేపు అలా పడుకో.ఎన్ని సార్లు చెప్పాను ఇంత పని చెయ్యొద్దని. నా మాట వింటేనా!!. నువు లే పైన కూర్చో నేను బెడ్డింగు తెరుస్తాను. అంటూ ముఖ్మల్ పరుపు పై ఒక సిల్కు దుప్పటి పరిచి తాహీరాని పడుకోపెట్టి శర్బత్ తీసుకు రావటానికి వెళ్లిపోయాడు. సల్మా వచ్చి తల నొక్కటం మొదలు పెట్టింది. పెద్ద అమ్మీ వచ్చి దిష్టి తగిలిందేమో అని మండుతున్న అగ్గి పై ఉప్పు మిరపకాయలు వేసింది, నజమా. నిమ్మకాయ నాకించి చూడండి అంటూ రకరకాల సలహాలు ఇచ్చి ఒకొక్కరు వచ్చి వెళిపోయారు.

          అన్ని  విధాలుగా గారాలు చేసి, పక్కన పడుకున్న రహ్మాన్ గురకలు పెట్టటం మొదలు పెట్టాడు. తాహీరా అతి మెల్లగా కిటికీ దగ్గరకు వెళ్ళి నిల బడింది. చాన్నాళ్నుంచి దాహంతో వేచి ఉన్న వ్యక్తికి చల్ల నీరు చెరువు దొరికినట్ట్లు ,ఎంత నీరు తాగినా తన దప్పిక తీరటం లేదు. మూడో అంతస్తులో దీపం వెలుగుతోంది. ఆ ఇంటిలో రాత్రి భోజనాలు ఆలస్యంగా ముగుస్తాయి. భోజనం తరువాత పాలు తాగే అలవాటు కూడా ఉంది అతడికి. ఇన్ని ఎళ్ళు గడిచి పోయినా అతని అలవాట్లు కంఠస్థం తనకి. సుధా, సుధా ఎక్కడున్నావు నువ్వు? తన హృదయం తననే  ధిక్కరించింది.ఎందుకు ఆత్మ హత్య చేసుకోలేక పోయావు? ఏ కూపంలోకి అయినా  దూకి చావలేక పోయానా? నీవు నీ మతం మార్చుకున్నావు కానీ పాత సంస్కారాలు ఉండిపోయినాయి. ప్రేమ ప్రవాహము దారి మార్చేశావు కానీ సంకేళ్లని వదలించులేక పోయావు. హిందువుల ప్రతి   పండగా హృదయాన్ని చీల్చి వెళ్ళిపోతున్నాయి. ఏ ఈద్ పండగ తనలో ఆనందాన్ని ఎందుకు నింపదు? ఈ రోజు నీ ఎదురుగా నీ  అత్తవారిల్లు ఉన్నది. వెళ్లు వేళ్లి వాళ్ళ కాళ్ళ పై పడి నీ  పాపాల్ని కడిగేసుకో.  తాహీరా నోట్లో చున్ని కుక్కుకుని తన్నుకు వస్తున్న దుఃఖాన్ని ఆపుకుంది.         

          రహమాన్ మరో పక్కకి తిరిగి పడుకున్నాడు. మంచం చప్పుడు అయ్యింది. నెమ్మదిగా వచ్చి తాహీరా పక్క పై వాలి పోయింది. తెల్లవారంగానే షహనాయి  వాదన తో కళ్ళు తెరిచింది తాహీరా.

          రకరకాల రంగులతో చమ్కీలతో మెరుస్తున్నా చున్నీలు, మెహెన్దీ సువాసన పెళ్లి ఇంటి గాలిలో కలిసి పోయింది. ఖాకీ బట్టలు వేసుకున్న బేండు వాళ్ళు కూడా తయారుగా ఉన్నారు. పెళ్ళివారితో ఇంట్లోని ఆడవారు కూడా వెళుతున్నారు. ఒక బస్సు కి సిల్కు పర్దా వేసి ఉంది. సుర్మాదిద్దుకున్నపెద్ద పెద్ద  కళ్ల తో మత్తును చిందిస్తూ,ఒకరి పై  ఒకరు పడుతూ అమ్మాయిలు బస్సు ఎక్కుతున్నారు. పెద్ద వారు తమ పాన్ డబ్బా సర్దుకుంటూ, తీరిగ్గా కూర్చొన్నారు. తాహీరా కూడా నల్ల బుర్ఖా వేసుకుని అన్యమనస్కంగా వెళ్తోంది. ఇటువంటి ఒక సాయంకాలమే తను కూడా

          పెళ్లి కూతురై ఈ ఊరుకి వచ్చింది. బస్సులో ఒక మూలకి నక్కి కూర్చొంది. ఆ బుర్ఖా తన ముఖమే కాదు మొత్తం తన జీవితాన్నే కారు మబ్బులా కప్పెసింది.

          అరె, ఏవరైనా వకీల్ సాబ్ ఇంటికి  ఆహ్వానం పంపించారా లేదా? అడిగింది పెద్ద అమ్మి. తాహీరా మనసు పై మరో గాయం. “ఇచ్చాను అమ్మీ! వారికి వంట్లో సరిగ్గా లేదు. అందుకని రాలేదు.” అన్నారు మామూజాన్. ‘ చాలా మంచి మనిషి,’ అంటూ పెద్ద అమ్మి పాన్ నోట్లో పెట్టుకుంది. మళ్ళీ అందుకుంది ఆవిడ. “ నగరంలోకల్లా పెద్ద పేరున్న వకీల అతడు, కానీ పిల్లా-పీచు ఎవరు లేని మోడు బారిపోయిన జీవితం. భార్య దంగాల్లో చనిపోయిందని విన్నాను. మళ్ళీ పెళ్ళి చేసుకోలేదు పాపం.”

          తాము వెళ్ళిన పెళ్లి చాలా ఘనంగా జరిగింది. సాయంత్రం సినిమా ప్రోగ్రాము వేసారు. కొత్త దంపతులుతో పాటు పెద్ద అమ్మీ అమ్మాయిలు,ఆఖర్కు ఇంట్లో పని చేసే పడుచులు కూడా తయారై వెళ్లారు. కానీ తాహీరా ఉండి పోయింది. తల నొప్పిగా ఉంది. అర్థం లేని ఆ ప్రేమ గీతాలు వినే ఓపిక తనకి లేదు. అలా చీకటి లో పడి ఉండాలని ఉన్నది తనకి. తన ప్రియ మైన హిందుస్టాన్ లో ఆఖరి సాయం.

          అందరూ వెళ్ళిపోయాక పెద్ద లైటు వెలిగించుకుని పొడువాటి అద్దం ముందు నిలబడింది. గడిచిన కాలం కూడా తన అందాన్ని మాపలేక పోయింది. అవే పెద్ద కళ్ళు, గోధుమ రంగు అందమైన దేహం. ఎవరనగలరు తానొక పడుచు పిల్ల తల్లి అని. తన యవ్వనం ఎక్కడా  గడుస్తున్న కాలం ముందు ఓడిపోలేదు. రేపు తెల్లవారు జామున నాలుగు గంటలకి తను వెళ్ళి పోతుంది. ఏ దేముడు తన కోసం సర్వము త్యజించి బైరాగిలా ఉండిపోయాడో ,ఒక్కసారి అతడి దర్శనం తనకి ప్రాప్తం ఉందా? అల్లరి పిల్ల కళ్లలా తాహీరా కళ్ళు మిలమిలా మెరిచాయి. వెంటనే బుర్ఖా కప్పుకుని బయటకు వచ్చింది.

          కాళ్ళకి  ఎక్కడ లేని చలనం వచ్చింది. కానీ ఆ ఎర్రటి  భవన్తి దగ్గరకు రాంగానే ఒళ్ళు స్వేద బిందువులతో తడిసి పోయింది. ఇంటి వెనక మెట్లు తనకి గుర్తు. సరిగ్గా అతని గది కిటికీ ముందే ఆ మెట్లు పూర్తవుతాయి. ఒకొక్క మెట్టు కాళ్ళు బరువు ఎక్కుతుంటే, గుండె దడదడ లాడుతుంటే తాహీరా కాదు ,పదహారేళ్ళ పూర్వం అల్లరి కన్నెలా, కొత్త పెళ్లికూతురు, సుధ. అత్త కళ్ళు కప్పి తన భర్త చెక్కిళ్ల పై అబీరు రంగు పులమటానికి వెళ్తున్నది. ఆ అమూల్య మైన కలయక ముందు రహ్మాన్ అస్తిత్వం మటుమాసి పోయింది. ఆఖరి మెట్టు వచ్చింది. ఊపిరి బిగపెట్టి కళ్ళు మూసుకుని ప్రార్థించింది-“హే బిల్వెశ్వరా! నిపాదాలపై వజ్రం పొదిగిన ఉంగరం పెడతా ,ఒక్కసారి అతడి ముఖం నాకు చూపించు, కానీ నన్ను అతడు చూడకూడదు.”

          ఎన్నేళ్ళ తరువాత భక్తురాలు, వేడుకుంటోంది, మనస్ఫూర్తిగా తలుచుకుని తనని ప్రార్థిస్తోంది, ఎందుకు వినడు. చెమ్మగిల్లిన కళ్ల తో తన దేముడ్ని చూసు కుంది. అదే గంభీర మైన ముఖం,అదే మల్మల్ కుర్తా-పైజామా,టేబుల్ మీద,దురదృష్టవంతురాలైన సుధా ఫోటో.

          ఆ రోజుల్లో తన అన్న తీసిన ఫోటోఅది.  

          “మనసంతా అతన్ని నింపుకో, తనవి తీరా అతన్ని చూసుకుని పారిపో.” స్వయంగా ఆ శివుడే తన చెవిలో చెప్పినట్టు అనిపించింది.

          సుధా అంతర్ధానమై తనలోని తాహీరా మేలుకుంది. సినిమానుంచి తిరిగి వచ్చే వేళ అయిన్ది ఆఖరిసారి అతన్ని కళ్ళారా చూసుకుని,చూపులుతోనే అతని చరణ స్పర్శ చేసి వెనుతిరిగింది.

          బిల్వేశ్వరుడి గుడి వైపు పరుగు పెట్టింది. గుడి గడప పై తల ఆనించి మొక్కుకుంది, దుపట్టా రెండు చేతులతో పట్టుకుని వెడుకుంది,’ మహాదేవా!అతన్ని సుఖంగా సంతోషంగా ఉంచు, తండ్రి’ అని చేతికి ఉన్న వజ్రం పొదిగిన ఉంగరం దేముడి ముందు ఉంచి పరుగులు పెడుతూ ఇంటి చేరింది.

          రహమాన్ అలీ వస్తూనే పాలిపోయి ఉన్న తాహీరా ముఖం చూసి అడిగాడు-‘జ్వరం లేదుకదా? అరె ఉంగరం ఏమైంది? ఆ ఉంగరం ఈ ఏడాదే రహమాన్ తమ పెళ్లి రోజు కానుక గా ఇచ్చాడు.

          “ఏమో ఎక్కడ పడిపోయిందో” అలసి పోయిన స్వరంతో అంది  తాహీరా. రహమాన్ వంగి తాహీరా చల్ల పడిపోయిన చేతిని అందుకుని “ పోనీలే ని చేయి ఎప్పుడు ఇలాగే అందంగా నాజూగ్గా ఉండాలి. ఈసారి టెహరాన్ నుంచి ఇంకో పెద్ద వజ్రం తెప్పిస్తాను.

          తాహీరా కిటికీ లో నుంచి చీకటి లో కలసి పోతున్న ఆ ఎర్రని  భవన్తి వైపు చూసింది. దాని మూడో గదిలో దీపం ఆరి పోయింది. తాహిరా ఒక నిట్టూర్పు విడిచి కిటికీ మూసేసింది. ఆ భవన్తి ని చీకటి కప్పెసింది.

****

Please follow and like us:

2 thoughts on “గతస్మృతి (హిందీ మూలం: శివానీ)”

  1. Thank you అనురాధ గారు.కథని చక్కగా పర్యవేక్షించి మి అభిప్రాయము తెలిపినందుకు ధన్యవాదాలు.

  2. సున్నితమైన కథ. అనువాదం విషయంలో మరింత జాగ్రత్త వహించి ఉండవలసింది.అక్షర దోషాలు కూడా సరిచూసుకోవలసి ఉంది. రచయిత్రి పుట్టింది, పెరిగింది ఆంధ్రేతర రాష్ట్రం కావటం ఒక కారణమై ఉంటుంది. అయినా ఆమె మాతృభాషలో కథలు రాయాలన్న సంకల్పంతో తెలుగు నేర్చుకుని కథలు రాయటమన్నది అభినందనీయం. మరిన్ని మంచి కథలను ఆమె అనువాదంలో చూద్దాం.

Leave a Reply

Your email address will not be published.