
చిత్రలిపి
జీవనయానం !
-మన్నెం శారద
పడుతూనేవున్నాను… అప్పడు నడక రాక..ఇప్పుడు నడవలేక! పడుతూనే వున్నాను … పసివయసులోఎంతదూరం వస్తాడో చందమామ నాతో అని ….పరుగులెత్తి పరుగులెత్తి …బారెడు తోకతోఆకాశమే హద్దుగా రంగులహంగుతోఆటలాడే గాలిపటం కోసం ఆకాశంకేసి చూస్తూ….పడుతూనేవున్నాను …పళ్ళు రాలగొట్టుకుంటూఏ చెట్టునో, పుట్టని ఢీ కొని ! పడుతూనేవున్నాను …నేటికీ నాటికిఅయినవారు గుచ్చిన కంటకాలను తొలగించుకుని కన్నీరు పెడుతూ .. కరడుగట్టిన కఠిన పాషాణ హృదయాల పాచి హృదయాలమీదుగాజారుతూ …పోరుతూ …. పడుతున్నాను పడుతున్నానుపడుతూనే వున్నానుఅయినా నడుస్తూనే వున్నాను ఆనాడు పెద్దల చేయూతతోనేడు పిన్నల భుజాల ఆసరాతో.!..పడిలేచే కెరటమై ప్రాణమున్నంతవరకు సాగించే నడక ఇది ! ****

నా పదహారవ ఏటనుండి కథలు రాస్తున్నాను. నా మొదటి మూడు నవలకి బహుమతులు వచ్చాయి. అనేక కథలు బహుమతులు అందుకున్నాయి. రెండుసార్లు నంది అవార్డ్స్ అందుకున్నాను. తెలుగు యూనివర్సిటీ నుండి ఉత్తమ రచయిత్రి అవార్డు అందుకున్నాను. నంది అవార్డ్స్ కమిటీ లో రెండుసార్లు పనిచేసాను. The week Magazaine నన్ను Lady with golden pen గా ప్రశంసించింది. దాదాపు వెయ్యి కథలు, 45 నవలలు రాసాను. చిత్రకళ నా హాబీ.
