పరంపర

-బండి అనూరాధ

మరలిపోయినా
యధాస్థితిలో తిరిగి నిన్ను నిలిపే 
కాలస్ప్రుహ ఏదో వెన్నునంటే ఉంటుందెందుకో.
 
ఆగి చూసుకుంటే-
విడిచివచ్చినవేం పెద్ద బాధించవు.
అంతర్లీనమై కొంత దుఃఖాన్ని నిక్షిప్తం చేస్తాయ్. అంతే.
 
కొంచం సమయం చిక్కి 
వెనుకకి ప్రయాణమై చూసుకోలనుకుంటే
ఒక్క అద్దముంటుంది లోన. అంతే
 
ముందుకుపోయే ఉత్సాహమో చింతనో
ఏదయితేనేం ఒక కొనసాగింపుకి
క్షణాల ముస్తాబుని గురించి
వేడుకయిన గొంతుతో-
ఒక పాటలానో
కన్నీటి చరణమంత రాతతోనో
చెప్పుకుపోతుంటావు. అంతే
 
అపరిపక్వ పగళ్ళలో పగుళ్ళనూ చూసి
పరిపక్వ రాత్రుళ్ళల్లో చీకటినీ చూసాక
వెన్నెలకి చలించలేదని 
అమాసకి పున్నమి ఊసుల్ని కథలుగా గుచ్చాక
 
ఓ నా అసమతుల్య ప్రపంచమా!-
 
జీవనమనోవికాస సాఫల్యతకై
ఏ సమాజంవెంట నేనిపుడు ప్రయాణించాలీ?
ఎక్కడ! మళ్ళీ ఒకసారి ఆగి
నన్ను నేను కొంత చూసుకోవాలీ?.

*****

Please follow and like us:

8 thoughts on “పరంపర (కవిత)”

  1. Akka mee kavitha chala bagundi. Meeru telugu padhalu vade vidhanam chala nachindi. Mee deggara nunchi ilage inka manchi manchi sahithyam vastunandukuntunna❤️❤️❤️

  2. ఎక్కడ మరలా నన్ను నేను చూచుకోవాలీ..?
    అభివ్యక్తి బాగుంది.
    చక్కటిచిక్కటి రాత
    విభిన్న శైలి

Leave a Reply

Your email address will not be published.