అనుసృజన

మీరా పదావళి (తరువాయి గీతాలు)

అనువాదం: ఆర్.శాంతసుందరి

13. కో బిరహినీ కో దుఖ్ జాణే హో
మీరా కే పతి ఆప్ రమైయా
దూజో నహీ కోయీ ఛాణే హో
(ఒక విరహిణి అనుభవించే దుఃఖం ఎవరికి అర్థమౌతుంది?
మీరాపతి ఒక్క ఆ గిరిధరుడే తప్ప ఆమెకి ఇంకే ఆధారమూ లేదు)
రోగీ అంతర్ బైద్ బసత్ హై
బైద్ హీ ఔఖద్ జాణే హో
సబ్ జగ్ కూడో కంటక్ దునియా
దర్ద్ న కోయీ పిఛాణే హో
(రోగి మనసులో ఉండేది ఆ వైద్యుడే
ఆయనకే ఏ ఔషధమివ్వాలో తెలుసు
ఈ లోకం వృథా, ముళ్ళతో నిండిన ప్రపంచమిది
ఇక్కడ ఎదుటివారి బాధని ఎవరూ అర్థం చేసుకోలేరు)
జా ఘట్ బిరహా సోయీ నకీహై
కయీ కోయీ హరిజణ మానయీ హో
బిరహ్ దరద్ ఉరీ అంతర్ మా హీ
హరి బిన్ సబ్ సుఖ్ కాణే హో
( విరహంతో వేగిపోయే శరీరం దుర్బలమైపోతుంది
చాలామంది హరి భక్తులు నమ్మే విషయం అది
విరహవేదన హృదయంలో నుంచి ఎగసిపడుతోంది
హరి లేకుండా ఎన్ని సుఖాలున్నా అన్నీ వ్యర్థమే)
 
హోయ్ ఉదాసీ బన్ బన్ ఫిరూ
రే బిథా తన్ ఛాయీ
దాసీ మీరా లాల్ గిరిధర్
మిల్యా హై సుఖదాయీ
( దిగులుతో అడవులవెంట తిరుగుతున్నాను
వ్యథ నన్ను పూర్తిగా ఆవహించింది
దాసీ మీరాకి ప్రియమైన తన గిరిధరుడు
దొరికితే కాని సుఖమనేది ఉండదు)
 
***
 
14. మాయీ మాయీ ఓ మాయీ మాయీ
కైసే జియూం రీ
హరి బిన్ కైసే కైసే జియూంరీ
(అమ్మా, ఓ అమ్మా
ఎలా బతకను
హరి లేక ఎలా, ఎలా బతికుండేది?)
ఉదక్ దాదుర్ పినావత్ హై
జల్ సే హీ ఉపజాయీ
పల్ ఏక్ జల్ కో మీన్ బిసరే
తరపత్ మర్ జాయీ
(కప్పలు నీరు తాగి బతుకుతాయి
అవి నీటిలోనే జన్మిస్తాయి
కానీ చేపలు ఒక్క క్షణం నీరు లేకపోతే
గిలగిలా కొట్టుకుని చనిపోతాయి)
పియా బిన్ పీలీ భయీ రే
జ్యో కాఠ్ ఘున్ ఖాయీ
ఔషధ్ పూరణ్ సంచరై రే
బాలా బైద్ ఫిరి జాయీ
(నా ప్రియుడు దగ్గర లేకపోవటం వల్ల కలిగిన వేదనతో
చెక్కలకి పట్టిన చీడలా నేను పాలిపోయాను
ఔషధం పూర్తిగా ప్రయోగించినా
ఫలితం లేకపోవటంతో వైద్యులు వెళ్ళిపోతున్నారు)
హోయ్ ఉదాసీ బన్ బన్ ఫిరూ
రే బిథా తన్ ఛాయీ
దాసీ మీరా లాల్ గిరిధర్
మిల్యా హై సుఖదాయీ
( దిగులుతో అడవులవెంట తిరుగుతున్నాను
వ్యథ నన్ను పూర్తిగా ఆవహించింది
దాసీ మీరాకి ప్రియమైన తన గిరిధరుడు
దొరికితే కాని సుఖమనేది ఉండదు) 

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.