అనుసృజన

మీరా పదావళి (తరువాయి గీతాలు)

అనువాదం: ఆర్.శాంతసుందరి

 

15. ఓ రమైయా బిన్ నీంద్ న ఆవే
బిరహా సతావే ప్రేమ్ కీ ఆగ్ జలావే
(అయ్యో , నా ప్రియుడు ఎడబాటుతో
నాకు కంటిమీద కునుకే రాదే
విరహతాపం వేధిస్తోందే
ప్రేమ జ్వాల దహించివేస్తోందే !)

బిన్ పియా జ్యోత్ మందిర్ అంధియారో
దీపక్ దాయ న ఆవే
పియా బిన్ మేరీ సేజ్ అనూనీ
జాగత్ రైన్ బిహావే పియా కబ్ ఆవే
( ప్రియుడి లేని మందిరం అంధకారంలో మునిగిపోయింది
దీపం తెచ్చిపెట్టేవారెవరూ లేరే
ప్రియుడు లేక నా పడక కూడా చిన్నబోతుంది
రాత్రంతా జాగారం చేస్తూనే గడుస్తుంది
నా ప్రియుడు ఎప్పుడొస్తాడో!)

దాదుర్ మోర్ పపీహా బోలై
కోయల్ సబద్ సుణావై
ఘుమట్ ఘటా ఉలర్ హుయీ ఆయీ
దామిన్ దమక్ డరావై
నైన్ ఝర్ లావై
(కప్పలూ నెమళ్ళూ చాతక పక్షులూ అరుస్తున్నాయి
కోయిలలు కుహూ కుహూమని కూస్తున్నాయి
వర్షాకాల మేఘాలు కమ్ముకొస్తున్నాయి
మెరుపులు మెరిసి భయపెడుతున్నాయి
నా కళ్ళలో కన్నీటి ధారలు కురిపిస్తున్నాయి)

కో హై సఖీ మోరీ సహేలీ సజనీ
పియా కో ఆన్ మిలావై
మీరా కే ప్రభు కబరే మిలోగే
మనమోహన్ మోహీ భావై
కబ్ బతలావై
(నా సఖులూ,నేస్తాలూ,నెచ్చెలులూ, ఎవరైనా
నా ప్రియుణ్ణి నావద్దకు తీసుకురాలేరా?
ప్రభూ నీ మీరానెప్పుడు కలుస్తావయ్యా?
మనోహరా మోహనా నా ప్రాణమా
ఎప్పుడు కబురంపుతావు?)

***

16.ఏరీ మై తో ప్రేమ్ దీవానీ మేరా దరద్ న జానే కోయ్
( నేను ప్రేమలో పిచ్చిదాన్నయానర్రా, నా బాధ ఎవరికీ అర్థం కాదు!)

జో మై ఐసా జానతీ ప్రీత్ కియే దుఖ్ హోయ్
నగర్ ఢింఢోరా పీటతీ కి ప్రీత్ న కరియో కోయ్
( ప్రేమించటం వల్ల ఇంత దుఃఖం అనుభవించవలసివస్తుందని తెలిస్తే
ఎవరూ ప్రేమించకండర్రా అని ఊరంతా చాటి చెప్పి ఉండేదాన్ని)

సూలీ ఊపర్ సేజ్ హమారీ సోవణ్ కిస్ విధ్ హోయ్
గగన్ మండల్ పర్ సేజ్ పియా కీ కిస్ విధ్ మిలణా హోయ్
( నా పడక ముళ్ళమీద, మరి నిద్ర ఎలా పడుతుంది?
నా ప్రియుడు శయనించేది ఆకాశంలో అతన్ని కలవటం ఎలా సాధ్యం?)

ఘాయల్ కీ గతి ఘాయల్ జాణై జో కోయీ ఘాయల్ హోయ్
జౌహరి కీ గతి జౌహరి జాణై దూజా న జాణై కోయ్
(గాయపడినవారి స్థితి గాయపడిన మనిషికే అర్థమౌతుంది
రత్నాల వ్యాపారికి మాత్రమే వాటి విలువ తెలుస్తుంది,ఇంకెవరికీ తెలీదు)

దరద్ కీ మారీ బన్ బన్ డోలూం బైద్ న మిలియా కోయ్
మీరా కే ప్రభు పీర్ మిటే జబ్ బైద్ సాంవలియా హోయ్
( బాధతో అడవులవెంట తిరుగుతున్నా నాకు వైద్యుడెవరూ కనిపించలేదు
మీరా ప్రభు ఆ ప్రియుడే వైద్యం చేస్తే తప్ప నా బాధ ఉపశమించదు)

 

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.