కుక్క పిల్లల తెలివి

-కందేపి రాణి ప్రసాద్

          ఆ సందు మలుపులో రాళ్ళ కుప్ప పక్కన చెట్లలో ఓ కుక్క నాలుగు పిల్లల్ని పెట్టింది . తల్లికుక్క ఆ చెట్టు పక్కలకే ఎవర్ని రానివ్వటం లేదు . ఆ రోడ్డు వెంట వెళ్లే వాళ్ళను కూడా అరుస్తున్నది . పిల్లలు తెల్లగా జాతి కుక్కల వలె ముద్దుగా ఉన్నాయి . అందులో రెండు ఆడ పిల్లలు రెండు మగపిల్లలు . నెల తిరిగే సరికల్లా మెల్ల మెల్లగా తిరగడం మొదలు పెట్టాయి .

          ఇప్పుడు కొద్దిగా పెరిగాయి . రెండు ఆడ కుక్కపిల్లలు ఇంట్లో అమ్మకు సహాయం చేస్తున్నాయి . పనంతా నేర్చుకుంటున్నాయి . మగ కుక్క పిల్లలు మాత్రం రోడ్డంతా బలాదూర్ తిరుగుతున్నాయి . ఇవి ఓ దారికి రావాలంటే బళ్ళో వేయాల్సిందే అనుకున్నాయి తల్లి తండ్రులు. వెంటనే అక్కడికి దగ్గర్లో ఉన్న బళ్ళో చేర్పించాయి .

          రోజు ఆడ కుక్క పిల్లలు ఇంట్లో పని చేస్తుంటే మగ కుక్క పిల్లలు బడికి వేల్లోస్తూ ఉండేవి. పిల్లల్ని చక్కగా తయారుచేసి బడికి పంపేది తల్లి . మరల ఇంటికి వచ్చేసరికి వళ్ళంతా మురికి చేసుకునేవి. తల్లి కోప్పడి శుభ్రంగా స్నానం చేయించేది బడికి పంపేటప్పుడు ఎన్నో జాగ్రత్తలు చెప్పేది. ఎవరన్నా తినటానికి పెడితే తీసుకోవద్దు అని చెప్పేది . పిల్లలు తలూపే వాళ్ళు కానీ ఎందుకు అని తెలుసుకోలేదు.

          ఒక రోజు కుక్కపిల్లలు రెండూ బుద్ధిగా బడికి వెళుతున్నాయి.ఒక మనిషి వచ్చి ” మే! మీరు చాలా అందంగా ఉన్నారే ! తెల్లగా జాతి కక్కల్లా మెరిసి పోతున్నారే ” అంటూ ఎత్తుకున్నాడు . రెండూ చాలా సంతోషపడ్డాయి . ఆ మనిషి తినటానికి బిస్కెట్లు ఇచ్చాడు . బాగా ముద్దు చేశాడు . అందంగా ఉన్నారని పొగిడేసరికి అన్ని విషయాలు మర్చి పోయాయి . రెండూ కూడా ఆ మనిషి ఇచ్చిన బిస్కెట్లు తినేశాయి . అమ్మ ఎవరేమి ఇచ్చినా తినవద్దన్న విషయం గుర్తుకు రాలేదు ఆ సమయంలో. కొద్ది సేపటికి కళ్ళు తిరుగుతున్నట్లనిపించింది.

          మరల కళ్ళు తెరిచేసరికి ఒక పెద్ద ఇంట్లో ఉన్నారు . అక్కడొక చిన్న బాబు ఆడు కుంటున్నాడు . తమకు బిస్కెట్లు పెట్టిన మనిషి అక్కడెక్కడా కనిపించలేదు . ఆ ఇంటి వాళ్ళు ఈ కుక్క పిల్లలకు పాలు పోశారు. వాళ్ళ మాటల్ని బట్టి ఎవరో తీసుకొచ్చి తమను వీళ్ళకు అమ్మినట్లుగా తెలుస్తోంది .

          ఓరే అన్నయ్య ఆ మనిషి మనల్ని కిడ్నాప్ చేశాడా అడిగింది ఒక కుక్కపిల్ల “అలాగే అనిపిస్తుంది . మనం పొరపాటున బిస్కెట్లు తిని మత్తులో పడిపోయాం . అమ్మ తినోద్దని చెప్పింది కూడా ” అంది మరో కుక్కపిల్ల.

          అమ్మ చెప్పింది గుర్తు పెట్టుకోక పోవడం వల్లే ఈ సమస్య వచ్చింది ” అన్నది మొదటి కుక్కపిల్ల ‘ ‘ ఇంట్లో అమ్మ మన కోసం వెతుక్కుంటూ ఉంటుంది . మనల్ని తెచ్చి ఎంత సేపయిందో ‘ అన్నది రెండో కుక్కపిల్ల భయపడుతూ’. అవునూ ! మనల్ని ఎందుకు తెచ్చారసలు ? అనుమానంగా అడిగింది . ‘ఆ దొంగ మనిషి మనల్ని అమ్మాడు అన్నారుగా ఇందాక వాళ్ళు మాట్లాడుకుంటూ’ గుర్తు చేసుకుంటూ అన్నది రెండో కుక్కపిల్ల .

          మొదటి కుక్కపిల్ల ఆలోచిస్తూ మనం అందంగా ఉన్నామన్నాడు కదా ! అందుకే వీళ్ళు కొనుక్కుని ఉంటారు. అమ్మ చెప్పింది కదా ! మనుష్యులు కుక్క పిల్లల్ని పెంచు కుంటారనీ , గొలుసుతో కట్టి వేస్తారని ! అన్నది. అమ్మో మనల్ని గొలుసులతో కట్టేస్తారా ! మనం ఎక్కడికీ వెళ్ళలేమా ! ఏడుపు గొంతుతో అన్నది రెండో కుక్కపిల్ల.

          ఊరుకో , ఏడవకు ! అపాయం వచ్చినపుడు ఏదైనా ఉపాయం ఆలోచించాలే అని అమ్మ కథలు చెప్పింది కదా ! ఏదైనా ఉపాయం ఆలోచించు! అంటూ బాగా తెలివిగా ఆలోచించాననుకుంటూ గొప్పగా అన్నది .”

          అవును నిజామే కానీ వీల్లింకా మనల్ని కట్టేయ లేదు కాబట్టి పారిపోదామా ‘ అడిగింది కుక్కపిల్ల ఆతృతగా.

          ” వాళ్ళు మనల్ని పట్టుకునే లోపు పారిపోవాలి కదా ! సమయం కోసం వేచి చూద్దాం. మనం చిన్నవాళ్ళం కాబట్టి స్పీడుగా పరిగేత్తలెం కాబట్టి కొద్దిగా ఆలోచిద్దాం” అన్నది మొదటి కుక్కపిల్ల .

          అంతలో ఆ ఇంటావిడ వచ్చి ఏమండీ ఈ కుక్క పిల్లలకు టీకాలు ఇప్పించారా. బాబు ఆడుకుంటాండని తీసుకున్నాం కదా ! పొరపాటున కరిచాయనుకొండి. మనకు అనవసరమైన ప్రాబ్లెమ్ ” అంటూ వాళ్ళాయన్ని అడిగింది.

          ఏమో వాడెవడో కూడా నాకు తెలియదు . మార్కెట్లో కనబడి ఈ కుక్కపిల్లల్ని చూపించి కోనమని వెంటబడ్డాడు . మన బాబు ముచ్చట పడతాడని కొన్నాను అన్నాడా ఇంటాయన. వాళ్ళింకా ఏదో మాట్లాడుకుంటున్నారు .

          ఈ మాటలు విన్న కుక్క పిల్లలు ఆలోచనలో పడ్డాయి . ఒక ఉపాయం తట్టింది . ఒక దాని కొకటి చెప్పుకున్నాయి . అంతే రెండూ కలిసి ఆ చిన్న పిల్లాడిని గట్టిగా కొరికాయి . పిల్లాడు పెద్దగా ఏడ్చాడు . ఆ ఇంటి వాళ్ళు గాభరాగా పిల్లవాడి చూట్టూ చేరారు.
ఇదే అదననుకొని కుక్కపిల్లలు రెండూ పారిపోయాయి .

          గేటు తీసుకుని రోడ్డు మీదకు వచ్చాయి . అప్పటికే అమ్మ నాన్న తమను వెతుక్కుంటూ తిరుగుతున్నారు . అమ్మానాన్నల్ని చూడగానే కొండంత ధైర్యంవచ్చింది. అందరూ కలిసి ఇంటి బాట పట్టారు . తమ పిల్లలు ఎంత తెలివిగా ఆలోచించాయో అని తల్లి దండ్రులు సంతోషపడ్డారు .

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.