మా వైష్ణుదేవి యాత్రా విశేషాలు – 5

-చెంగల్వల కామేశ్వరి

          మనాలీ నుండి సిమ్లా వెళ్లే దారిలో బియాస్ సట్లెజ్ నదులు కలిసే చోట పండెమ్ డామ్ ఉంది. అక్కడే హిందులు సిక్కుల ఐక్యతకు ప్రతీకగా నిర్మితమైన మణికరన్ సాహిబ్ అన్న ప్రదేశం తప్పకుండా చూడాల్సిందే!

          సిక్కులు చెప్పినదాని ప్రకారం, 

          మూడవ ఉదాసి సమయంలో , సిక్కుమతం స్థాపకుడు గురునానక్ 15 ఆసు 1574 బిక్రమి తన శిష్యుడైన భాయ్ మర్దానాతో కలిసి ఈ ప్రదేశానికి వచ్చాడు . మర్దనకు ఆకలిగా అనిపించింది మరియు వారికి ఆహారం లేదు. గురునానక్ లంగర్ (కమ్యూనిటీ కిచెన్) కోసం ఆహారాన్ని సేకరించడానికి మర్దనను పంపారు. రోటీ (రొట్టె) చేయడానికి చాలా మంది ఆటా (పిండి) దానం చేశారు. ఒక సమస్య ఏమిటంటే, ఆహారం వండడానికి అగ్ని లేదు. గురునానక్ మర్దనను ఒక రాయిని ఎత్తమని అడిగాడు మరియు అతను అంగీకరించాడు మరియు వేడి నీటి బుగ్గ కనిపించింది. గురునానక్ నిర్దేశించినట్లుగా, మర్దన చుట్టిన చపాతీలు పెట్టాడు వసంతంలో అతని నిరాశకు చపాతీలు మునిగి పోయాయి. గురునానక్ తన చపాతీలు వెనక్కి తేలితే తన పేరు మీద ఒక చపాతీ దానం చేస్తానని దేవుడిని ప్రార్థించమని చెప్పాడు. అతను ప్రార్థన చేసినప్పుడు, చపాతీలన్నీ సరిగ్గా కాల్చడం ప్రారంభించాయి. దేవుడి పేరుతో ఎవరైనా విరాళాలు ఇస్తే, అతని నీటిలో మునిగిన వస్తువులు తిరిగి తేలుతాయని గురునానక్ అన్నారు.

          మణికరణ్ హిందువుల స్థల పురాణం ప్రకారం, 

          శివుడు మరియు పార్వతి దేవి భూలోకంలో విహరిస్తున్నప్పుడు, పర్వతాలతో చుట్టుముట్ట బడిన మరియు పచ్చగా ఉండే ఈ ప్రదేశానికి వచ్చినప్పుడు అక్కడి అందాలకు ముగ్ధుడై అక్కడ కొంత సమయం గడపాలని నిర్ణయించుకున్నారు. 

          వారు ఇక్కడ ఉన్న సమయంలో, పార్వతీ దేవి తన మణిని (విలువైన రాళ్ళు [5] ) ఒక ప్రవాహ నీటిలో కోల్పోయింది. నష్టానికి కలత చెందిన ఆమె దానిని తిరిగి పొందమని శివను కోరింది. పార్వతికి మణిని కనుగొనమని శివుడు తన పరిచారకుడికి ఆజ్ఞాపించాడు. అయితే, అవి విఫలమైనప్పుడు, అతను చాలా కోపంగా ఉన్నాడు. అతను తన మూడవ కన్ను తెరిచాడు, ఇది విశ్వంలో అవాంతరాలకు దారి తీసిన విపరీతమైన అశుభకరమైన సంఘటన. శివుడిని శాంతింప జేయమని సర్ప దేవుడు శేషనాగ్ ముందు విజ్ఞప్తి చేశారు. శేషనాగ్ బుజ్జగించాడు, తద్వారా వేడినీటి ప్రవాహానికి దారితీసింది. ఆ నీరు మొత్తం ప్రాంతమంతా వ్యాపించి, పార్వతీ దేవిని పోగొట్టుకున్న విలువైన రాళ్లు బయటపడ్డాయి. ఫలితం చూసి పరమ శివుడు, పార్వతి సంతోషించారు.

          ఈ పురాణం నుండి మణికరణ్ అనే పేరు వచ్చింది. నీరు ఇప్పటికీ వేడిగా ఉంటుంది మరియు చాలా పవిత్రమైనదిగా పరిగణించ బడుతుంది. ఈ ప్రదేశానికి తీర్థయాత్ర సంపూర్ణంగా భావించబడుతుంది. ఆ నదిని పార్వతీ నది గా అంటారు. ఈ ప్రదేశాన్ని సందర్శించిన తర్వాత కాశీని సందర్శించాల్సిన అవసరం లేదని కూడా నమ్ముతారు. ఊట నీటికి కూడా నివారణ శక్తులు ఉంటాయని భావిస్తున్నారు. నీరు చాలా వేడిగా ఉంటుంది, అందులో అన్నం వండవచ్చు

          దేవాలయం పరమశివునికి చెందినది కావున ఎంతో పూజ్యమైనది . అయితే, 1905లో వచ్చిన భూకంపం వల్ల ఆలయం కొద్దిగా వంగి ఉంది. కులు లోయలోని దేవతలు ఈ ప్రదేశాన్ని నిర్దేశించిన తేదీలలో క్రమంతప్పకుండా సందర్శిస్తారు అనే నమ్మకం అక్కడి వారికి ఉంది.

          అక్కడి ఉష్ణగుండాలు చూస్తే ఆశ్చర్యానందాలు కలిగాయి.

          ఇప్పటికీ అక్కడ తాడు కట్టిన చిన్న బియ్యపు మూటలు అమ్ముతారు భక్తులు ఆ వేడినీటిలో వాటిని వేసి తయారయిన అన్నాన్ని శివునికి నివేదించి కాస్త ప్రసాదంగా స్వీకరిస్తారు.

          అక్కడే పైన   ఒక వైపు గురుద్వారా ఉంది. అక్కడ నిత్యాన్నదానం జరుగుతుంది. వేడి ఛాయ్ కూడా  ఎంత కావాలంటే అంత ఇస్తారు మేమంతా టీ త్రాగాము.

          అంతకు ముందే దారిలో  జ్ఞానానందస్వామి  నిర్మించిన తపోవనం ఆయన కట్టించిన చాముండా దేవి దర్శనం కూడా చేసుకున్నాము.

          చక్కని ప్రకృతి అందాల మధ్య పెద్ద హనుమాన్  విగ్రహం  చాలా బాగుంది.

          దూరం ఎక్కువ ఉండటం వలన  నైట్ డిన్నర్ కూడా దారిలో తినేసాము. ఆ రోజు రాత్రి ప్రయాణం తప్పలేదు మాకు. సిమ్లా చేరుకున్నాము ఘాట్ రోడ్స్ లో ఇరుకయిన  ఆ రోడ్స్ ని చూస్తే భయమనిపించింది. కాని మా డ్రైవర్స్  ఏ చెడ్డ అలవాటు లేని మంచి నైపుణ్యం ఉన్నవారు. చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేసేవారు. మొత్తం ప్రయాణం రెమడు వెహికిల్స్ ముందు వెనుకలుగా కలిసి ప్రయాణించటం లంచ్ కి కాని మరెందుకు ఆగాలన్నా ఫోన్ లు చేసి మాట్లాడుకోని అందరూ ఆగటం కలిసి  భోజనాలు చేయటం ఆ పది రోజులు మా అందరికీ తీయని అనుభూతి ని ఇచ్చింది. 

          హొటల్స్ రూమ్స్ లో నిద్రిస్తున్నప్పుడు తప్ప మిగతా సమయమంతా కలిసి తిరగడం తినడం అదంతా ఇప్పుడు తల్చుకుంటే  చాలా హేపీగా ఉంటుంది.

          మర్నాడు ఉదయం పదిన్నరకు తయారయి  సిమ్లా లో ఉన్మ వైస్రాయ్ మ్యూజియంకి వెళ్లాము.

          అక్కడ నియమిత సమయాల లోనే బ్యాచ్ లుగా పంపిస్తారు.

          అక్కడ కొండల అంచున  ఉన్న గార్డెన్ చాలా రంగురంగుల పూలతో రమణీయంగా ఉంది. 

          అదంతా తిరుగాడి మ్యూజియం చూసి వచ్చాము. తర్వాత  మాల్ రోడ్ అని మరింత ఎత్తు గా ఉన్న కొండ పైకి లిఫ్ట్ తో కూడా వెళ్లొచ్చు అన్నారు. మమ్మల్ని పార్కింగ్ లో వదిలితే అందరం లిఫ్ట్ కి పది రూపాయలు ఇచ్చి వెళ్లాము.

          అక్కడ లంచ్ చేసుకుని కాసేపు షాపింగ్ కి తిరిగాము. ఆ తర్వాత మరల క్రిందకి లిఫ్ట్ లో దిగి జాకూ టెంపుల్  కి వెళ్లాము అక్కడ ఎత్తయిన కొండ శిఖరం మీద  నెలకొని ఉన్న సీతారాముల మందిరం నూట అరవై అడుగుల ఎత్తు లో ఉన్న ఆంజనేయస్వామి విగ్రహం ప్రధాన ఆకర్షణ .

          గుడి దాకా వెళ్లినా నూట ఏభై మెట్లు ఉన్నాయి. మేము తిరిగిన ఆలయాలన్నీ కొండ కొమ్మున ఉన్నవే అన్నీ వందలాది మెట్లు ఉన్నవే! 

          ఎంత కష్టం గా ఉన్నా అందరం అన్ని చోట్ల  అలాగే ఎక్కాము. అక్కడ కోతులు చాలా ఎక్కువ. దర్శనం అయ్యాక రాత్రికి హొటల్ కి వచ్చేసాము. 

          మిగతా విశేషాలు రేపు చెప్తాను.

*****

  (సశేషం)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.