లేఖమాల- హరిహరప్రియకు డాక్టర్ సంజీవదేవ్!

-సుశీల నాగరాజ

 
హరిహరప్రియగారు!!!!
         
          ఎందరో మహానుభావులు అందరికీ వందనములు!!!!!!
          మీ పుస్తకం “” లేఖమాల—హరిహరప్రియకు డాక్టర్ సంజీవదేవ్ పుస్తకం అందుకోగానే ఒక్కసారి నా గుండెలకు హత్తుకున్నాను!,
 
          మనకు ఇష్టమైనది ఒక్క సారిగా మన చేతికి చిక్కితే తింటే ఐపోతుందని దాచుకుంటామే.. అలాగే పుస్తకం చూస్తూ. పేజీలు తిరగవేస్తూ రెండు మూడు రోజులు గడిపాను. తరువాత మెల్లగా చదవడానికి ప్రారంభించాను!!!!
     
          సత్యం శివం సుందరం!!! 
 
          హరిహరప్రియగారు! మొదట నన్ను ఆకట్టుకున్నారు! విశ్వవిద్యాలయాలలో పొందే డిగ్రీలకూ జ్ఞానానికి ఎలాంటి పొందూలేదు! హరిహరప్రియగారు చదివించిరి గురువులు! చదివితి ముఖ్యశాస్త్రంబులు! చదువులలోని మర్మమెల్ల చదివితిని!!!
 
          ఒక్కొ క్కరికి ఒక్కక్క పిచ్చి! అందులోని ఆనందం చిదానందం! నాకు నవ్వంటే పిచ్చి! ప్రేమంటే పిచ్చి! అలా హరిహరప్రియగారికి  ఉత్తరం అంటే పిచ్చి. బ్రహ్మాండమైన పిచ్చి! 
   
          ఆ పిచ్చి లేక ఇష్టం, వారిని ఆకాశమంత ఎత్తుకు తీసుకుపోయింది! ఎంత మందికి లభిస్తుంది ఈ సుకృతం!!! ఒక్కసారి చూస్తే చాలు, వారి మాట ఒక్కసారి వింటే చాలు అనుకునే మహాన్ వ్యక్తులతో వీరికున్న అవినాభావ సంబంధం!! హరిహరప్రియగారికి ఆ వ్యక్తుల పై ఉన్న పిపాశ!! ఈ పదం సరిపోతుందని అనుకుంటాను! మహాన్ వ్యక్తులందరితోనూ వీరికి అవినాభావ సంబంధం! వీరు సతతంగా వారందరితోను బంధాన్ని ఏర్పరుచుకున్నారు! ఎలాంటి పరిస్థితులలోను తన తృష్ణను వదల లేదు. అన్నింటిని భరించి, సహించి తను ఏర్పరుచుకున్న రహదారి లోనే నడిచారు!! సతతంగా వారు ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపారు! ఆ మహాన్ వ్యక్తులను మనం ఇంత దగ్గరగా చూసేందుకు చదివేందుకు సాధ్యమైంది! ఇందుకు హరిహరప్రియగారికి చేతులు జోడించి నమస్కరిస్తున్నాను!!
 
          డాక్టర్. సంజీవదేవ్ గారి గురించి ఆర్.వి.ఎస్.సుందరంగారి నుంచి విన్నాను. వారు రాసిన ఉత్తరం చూశాను. ముత్యాల్లా ఉన్న అక్షరాలు చూసి మురిసిపోయాను! అప్పటి నుంచి వారు నా మనసులో ముద్ర వేశారు! వారి గురించి చదవాలి, వారి పెయింటింగ్స్ చూడాలి. ఇలా ఏవేవో ఆశలు! సంసారం, పిల్లలు, ఉద్యోగం వీటిలో పడి ఆశ మనసు అట్టడుక్కు వెళ్ళింది! 
 
          FB కారణంగా వాడ్రేవు చిన వీరభద్రుడుల వారు హరిహరప్రియగారు డా.సంజీవదేవ్ లేఖమాల పుస్తకం గురించి రాసినది చదివాను. అడుగున దాగిన ఆశ మళ్ళీ చిగురించింది! పుస్తకం నా చేతికి వచ్చింది!!!!. 
 
          హరిహరప్రియగారు Self Made Man!!!!
డాక్టర్. సంజీవదేవ్ గారి ఉత్తరాల వలన హరిహరప్రియగారి మరియు డాక్టరు. సంజీవదేవ్ గారి నడుమనున్న అవినాభావ సంబంధం, వారి ఉన్నతమైన వ్యక్తి త్వం, తెలిసింది!, మే 1973 ప్రారంభమైన ఈ లేఖలు ఫిబ్రవరి 1989 వరకు అంటే 16 సంవత్సరాలు అవిరామంగా జరిగాయి! ఈ ఉత్తరాలు చాలా సరళంగా, ఆత్మీయంగా, ఎలాంటి ఆడంబరాలు లేకుండా, ముక్తంగా, వారి కష్టసుఖాలు, సంతోష దుంఖాలు, ఆరోగ్య అనారోగ్యాలు, లాభనష్టాలు, జీవిత సత్యాలు, వారి పుస్తకాలు, అనువాదాలు, సన్మానాలు, వారు చేసిన ప్రసంగాలు, వారి ప్రయాణాలు, ఇంకా ఇలా ఎన్నో విషయాల గురించి మనసు విప్పి రాశారు. ఇది హరిహరప్రియగారి పై వారికున్న ఆత్మీయత, అభిమానం తెలుస్తాయి! వారి ఉన్నత వ్యక్తిత్వం, దేనికీ జంకక ముందుకు సాగే నిబ్బరం తెలుస్తుంది!
 
          ఎన్ని వైవిధ్యాలున్నా మానవుల మధ్య మైత్రిధార ప్రవహిస్తోంది!!!సమ‌ర్థతగలవారు వివాహం చేసుకునీ సుఖించగలరు‌, చేసుకోకుండాను సుఖించగలరు అని చెప్తారు.
 
          మనిషి ఎల్లప్పుడూ రచించలేడు, చిత్రించలేడు‌, ఎల్లప్పుడూ మనిషిగా వుంటూ, కొన్ని సమయాలలో మాత్రం స్రష్టగా మారుతుంటాడు. ముందు మనిషిగా వుండి కాని కళాకారుడు కాజాలడు!!!!! ఎంత సత్యం!!
 
          శ్రీ విశ్వనాథ గారు పరిపక్వం చెంది మరణించారు! వారి రచనల ద్వారా అమర జీవులు! పాఠకుల మనస్సుల్లో నిరంతరం జీవించివుంటారు!!
 
          జీవితం హ్రస్వం రచన ధీర్ఘం! అంటారు! ఇది జీవిత సత్యం!! జీవితం అంటే అనుకూలాల ప్రతికూలాల వెలుగు నీడలు!! ఆర్థిక బాధలకు మించిన బాధ మ‌రొక్కటి లేదేమో అంటారు. వారు చాలా ఆర్థిక సమస్యలను అనుభవించారు!!! మానవుడు విశ్వనాధుడు! విశ్వం తనకులోబడి ఉండాలికానీ! విశ్వానికి తాను లోబడి వుండనవసరం లేదు! పరిస్ధితులనే దాసులుగా చేసుకోవటంలోనే మానవుని మానవత అంటారు!!విశాలమైన దృక్పథం, నిస్వార్ధ సేవ ఆయన ఆదర్శాలు!! జీవితం లో “నటన”అనేది లేకుండా యదార్థంగా బ్రతకటం వారి జీవిత ఆదర్శం!!!బ్రతికివున్న నాలుగు రోజులు నిజాయితీగా బ్రతకాలి!!! మనసులో ఆనందంలేనపుడు పల్లె అయినా పట్టణమైన శ్మశాన వాటికలు అంటారు!!
     
          పరిసర ప్రభావాల మీద ఆధారపడి వుండే ఆనందం! పరిసరాలనే ఆనందం మయంగా చేసే ఆనందం!! ధనికులను బీదలను సమానంగా పీడిస్తున్న సమస్య ఆర్థిక సమస్య అంటారు! బాధ లేకపోతే  జీవితం బండబారిబోతుంది!!!దృశ్య కళలకంటే శ్రవ్యకళలు గాఢ తన్మయత్వం కలిగిస్తాయి! 
 
          ఫ్రెండ్స్ ను సంపాదించటం సులభం కానీ ఫండ్స్ సంపాదించటం కష్టం అంటారు వారి పుస్తకాల ప్రచురణ సమయంలో!!!
   
          మానవతా సంస్కృతికి మించిన మానవ సంస్కృతి ఏది!!?? సేవాధర్మానికి మించిన సద్ధర్మం మరేముంటుంది!?? మాస్తి మరణవార్త విన్నపుడు “”ఎంత మహనీయులైన మృత్యుద్వారం గుండా పయనించక తప్పదు!!!
   
          నార్ల గారి గురించి రాస్తూ వారిలో కవితా శక్తి కన్నా మేధాశక్తి ఎక్కువ పదునైంది అంటారు!!! నార్లవారు తన గొప్పతనాన్ని గుర్తిస్తూనే ఇతరుల గొప్పతనాన్ని గుర్తించటం లో ఆనందానుభూతిని చెందే వ్యక్తి!!!!
     
          రచన అనేది మానవ సంబంధమైంది! మేధ ద్వారా ఆలోంచించటం, హృదయం ద్వారా అనుభూతి చెందటం!. రెండూ మెదడులోనివే!!! ఉత్తరాలు మనసానందాన్నీ  ఉత్తరాల చివర వేసిన ప్రకృతి దృశ్యాలు నయనానందాన్ని కలిగించాయి!!
 
          హరిహరప్రియగారి దగ్గర 3 లక్షలకు పైన పుస్తకాలు ఉన్నాయి! వారి ఇంటిపేరు ” పుస్తకమనే”.
   
          ఆయన వద్ద ఉన్న పుస్తకాలు, మహాన్ వ్యక్తులతో జరిపిన ఉత్తరాలు ఏ నిధికి సమానం! ఈ నిధి వెనుక ఆయన సంతోషాలు, కష్టాలు, కన్నీళ్లు, ఎన్ని నిగూఢంగా దాగి వున్నాయో వారికే ఎరుక!
   
          ఎందరో మహానుభావులు అందరికీ వందనములు!!!! 
 
హరిహరప్రియగారి పుస్తకం  ” లేఖమాల- హరిహరప్రియకు- డాక్టర్. సంజీవదేవ్’ కోసం సంప్రదించవలసిన వివరాలు
హరిహరప్రియ,
“పుస్తకమనే”
#702, బి.సి.సి.హెచ్.ఎస్.లే ఔట్,
వాజరహళ్ళి, తలఘట్టపుర, 
బెంగళూరు-570109.
Mobile no.+91 9242221506.
*****
Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.