అనుసృజన

మీనాకుమారి హిందీ కవిత-3

అనువాదం: ఆర్.శాంతసుందరి

అలనాటి మేటి హిందీ నటి మీనా కుమారి అసలు పేరు మాహ్ జబీన్. ఆమె కవయిత్రి అన్న విషయం మీకు తెలుసా? ఆమె మరణించాక గుల్జార్ ఆమె కవితలని సీడీగా రికార్డు చేశారు, మీనా కుమారి తన కవితలను స్వయంగా చదివి రికార్డ్ చేసిన వీడియోలు కొన్ని దొరికాయి. మూల (హిందీ) కవితలను తెలుగులో రాసాను, పాడుకోవడానికి వీలుగా ఉంటుంది. తెలుగు అనువాదం ఆమె కవితల్లోని భావాన్ని అర్థం చేసుకోవడానికి పనికొస్తుంది.
 

3.

చాంద్ తనహా హై ఆసమాన్ తనహా
దిల్ మిలా హై కహా( కహా( తనహా
 
చంద్రుడు ఒంటరే ఆకాశమూ ఒంటరే
ఎక్కడైనా మనసులు కలిసినా నా మనసు మాత్రం ఒంటరే!
 
బుఝ్ గయీ ఆస్ ఛుప్ గయా తారా
థర్ థరాతా రహా ధుఆ( తనహా
 
ఆశ నిరాశే అయ్యింది నక్షత్రం కనుమరుగయింది
పొగ మాత్రం ఒంటరిగా కంపిస్తూ ఉండి పోయింది !
 
జిందగీ క్యా ఇసీకో కహతే హై(
జిస్మ్ తనహా హై ఔర్ జాన్ తనహా
 
దీన్నేనా జీవితమంటారు?
శరీరం ఒంటరే ఆత్మా ఒంటరే !
 
హమ్ సఫర్ కోయీ గర్ మిలే భీ కహీ(
దోనో చలతే రహే తనహా తనహా
 
జీవితంలో సహయాత్రీకుడు ఎవరైనా దొరికినా
ఇద్దరం ఎవరికి వాళ్ళం నడిచాం ఒంటరిగానే!
 
జలతీ బుఝతీ సీ రోశనీ కే పరే
సిమటా సిమటా సా ఎక్ మకాన్ తనహా
 
మినుకు మినుకు మంటున్న వెల్తురు కావల
ఒదిగిపోయున్నట్టున్న ఒక ఇల్లు ఒంటరిగా!
 
రాహ్ దేఖా కరేగా సదియోం తక్
ఛోడ్ జాయేంగే యే జహాన్ తనహా
 
ఎదురుచూస్తూనే ఉంటుంది కొన్ని శతాబ్దాల వరకు
ఈ లోకాన్ని నేను విడిచి వెళ్ళిపోతాను ఒంటరిగానే!

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.