పాటతో ప్రయాణం-4

– రేణుక అయోల  

 
          ఈ రోజు మనం masoom  సినిమాలోని  “‘తుజేసే నారాజ్ నహి జిందగీ ” అనే పాటతో  ప్రయణి ద్దాం .. 
 
          masoom  1983 లో విడుదల అయ్యింది, దర్శకుడు  శేఖర్ కపూర్ .. ఈ పాట ఎన్ని రియాలాటి షో లలో ఎవరు పాడినా  అందరి కళ్ళు చమరుస్తాయి 
 
ఈ పాట నా భావాలతో  చదివి  వింటారుగా …..

          జీవితం మనతో  ఆడుకునే  ఆటలకి కంగారుపడి భయపడి, కొన్నిసార్లు  పారిపోదాం అనుకుంటాం కానీ, మనచుట్టూ వున్న సమస్యలు  మనల్ని కదలనివ్వవు. నిరుత్సాహం నిరాశ కలుగుతుంది …ఆ హడావిడిలో ఎవరితోనైనా మనసువిప్పి మాట్లాడుదాం అనిపిస్తుంది. మనసులో మాట చెప్పుకోవడం అంత తేలిక కాదు. చెప్పాలంటే నమ్మకం కుదరాలి  పోనీ, ఏమాత్రం ఆలోచించకుండా చెప్పేద్దామని కూడా అనిపిస్తుంది చెప్పేసాక బరువు కొద్దిగా తగ్గినట్టు అనిపించినా ఎక్కడో గాయం రగులుతూనే ఉంటుంది గాయం కొసలు  మనసులోని ఆలోచల్ని మండిస్తూనే ఉంటాయి…
అప్పుడు నాకు ఎప్పుడూ గుర్తుకొచ్చే ఈపాట… మీకు తెలిసిందే..
 
“తుజేసే నరాజ్ నహి  జిందగీ “
  మాసూమ్ సినిమాలోది ఈపాట (1983)
 
  తుజేసే నారాజ్ నహీ జిందగీ
  హైరానుహు హు మై,
  తేరే మాసూమ్ సవాలోనసే పరేషాన్ హు మై.
అనుకుంటూ వింటాను…

నాకు నేను వేసుకునే ప్రశ్నల అమాయకత్వంలోంచి వచ్చే సమాధానం జీవితంలో  కరిగిపోతుంది…
నీమీద నాకు కోపం లేదు అనుకుంటాను
నవ్వుకుందాము అనుకుంటాను
నవ్వు కూడా ఎవరికో  ఇచ్చే అప్పులా ఉంటుంది
అప్పు తీర్చాలి  కాబట్టి
పెదవులు బలవంతంగా నవ్వుతాయి
మళ్ళీ వింటాను ! మళ్ళీ మళ్ళీ వింటాను..
పాటలో ఓరిగి పోయి వింటాను
నన్ను నేను వెతుక్కుంటూ వింటాను…

ఆజ్ అగర్ భర్ అయిహై
బుందే బరస్  జాయేగి
కల్ క్యా పతా ఇన్ కేలియే
అంఖే తరస్ జాయేగి
జానే కబ్ గుంహువా,ఖాహా ఖోయా
ఏక్ ఆసు  చూపాకేరక్కథా..

ఇవాళ కళ్ళలో నిండిన నీటి చుక్కలు రాలుతాయి
రేపు ఎవరికీ  తెలుసు
ఈ రెండు చుక్కల నీటికోసం కళ్ళు ఎంత వేదన పడతాయో..
ఎప్పుడు తప్పిపోయి, ఎక్కడ దాకున్నాయో
ఒక్క కన్నీటి చుక్క దాచుకున్నట్టు అనిపించింది..

          ఈ  పాట  ఎన్ని రియాలాటి షో లలో  ఎవరూ పాడినా అందరి కంట్లో ఒక నీటి చుక్క నిలబడుతుంది. అపుడప్పుడు వెల్లువలా కళ్ళని తడుపుతుంది…
   
          మీరు విన్నారా ఈ పాటని? వినే ఉంటారు కంటిచెమ్మతో ….. 

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.