పాటతో ప్రయాణం-5

– రేణుక అయోల  

 

         జగ్జీత్ సింగ్ మరో గజల్ మీ ముందు వుంచుతున్నాను, గజల్ ని ప్రేమించే వాళ్ళు
ఈ గజల్ ని చాలా ఇష్టపడతారు. ఈ గజల్ ప్రేమ గీత (1982) అనే సినిమాలో వచ్చింది. దీనికి సంగీత దర్శకత్వం వహిస్తూ జాగ్జీత్ సింగ్ పాడారు ( Hoton Se Chhulo Tum ( Prem Geet – 1982 ) ఇది ప్రేమ గీతంలా చాలా ఆదరణ పొందింది కానీ నేను విన్న ప్రతిసారీ ప్రేమించే మనిషి తన ప్రేమకి తాను ఇస్తున్న గౌరవం అభిమానం చేయూత ఈ గజల్లో వినిపిస్తుంది ..

         మనిషికి మనసుకి ఇచ్చే ఆత్మవిశ్వాసం అనుబంధం కనిపిస్తుంది అప్పుడే
అక్షరాలూ కవితగా మారుతాయి , కవిత పాట అవుతుంది , పాట మనసుకి హాయిని , ఓదార్పుని తోడుని ఇస్తుంది ఆ పాట పెదవుల మీద ఊయలలూగితే అది అమర గీతమే అవుతుంది.. మరి నాతో పాటు మీరూ వింటూ హాయిగా పాడుకుంటారని అనుకుంటూ ఈ సినీ గజల్ ని నా భావాలతో మీ ముందు వుంచుతున్నాను

Honthon Se Chulo Tum
Meraa Git Amar Kar Do
Ban Jaao Mit Mere
Meri Prit Amar Kar Do
Na Umar Ki Simaa Ho
Na Janam Kaa Ho Bandhan
Jab Pyaar Kare Koi
To Dekhe Keval Man

నా పాటని నీ పెదవుల మీదకి రానివ్వు
అది అమర గీతం అవుతుంది
నా జీవితంలోకి ప్రేమికురాలిగా వచ్చి చూడు
నా ప్రేమ అమర మవుతుంది

వయసుకి సరిహద్దులు లేవు
జన్మలకి బంధనాలు లేవు

ఎవరు ప్రేమించినా మనసుని చూడాల్సిందే
కోత్త పధ్ధతి నువ్వే మొదలుపెట్టి దానిని చిరస్థాయిగా చెయ్యి

ఆకాశమంత శూన్యం వుంది నా ఒంటరి మనసులో
కాలి మువ్వల సవ్వడిలా నా జీవితంలోకి ప్రవేశించు
నా సంగీతానికి నీ ఊపిరినిచ్చి గానాన్ని అమరం చెయ్యి

ఈ ప్రపంచం నా నుంచి నా ఇష్టలన్ని తీసేసుకుంది
అందరూ గెలుస్తూనే వున్నారు నేనే ప్రతీసారి ఓడిపోతున్నాను
నీ హృదయం ముందు నువ్వు ఓడిపోయి నా గెలుపుని అమరం చెయ్యి ……

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.