“నెచ్చెలి”మాట 

నిజంగా సంబరాల వేళేనా?

-డా|| కె.గీత 

హమ్మయ్య-
ఓట్లపం(దం)డగ
పూర్తయింది!

అదేవిటండీ
పండగ
దండగెలా
అవుతుందీ ….

అదేలెండి
ఓట్లు దండుకోవడం
పూర్తయింది!
లెక్కా
పూర్తయింది!

గెలుపోటముల
బేరీజుల్లో
సంబరాలు-
ఉత్సవాలు-
మొదలాయెను!

మరి
నియంతృత్వాలు-
మతతంత్రాలు-
రూపుమాయునా?
మారురూపెత్తునా?

అసలు
నిజంగా
సంబరాల వేళేనా?

ప్రమాణ స్వీకారోత్సవాల
పర్యంతం
నిలిచే ప్రమాణాలెన్నో
ప్రజాధనపు స్వీకారాలెన్నో

మరి
పం(దం)డగ
మామూలు ఖర్చా?!

అంతకంతా
వెనక్కి రాబట్టుకోవద్దూ!

రాజధానులు-
రహదారులు-
ఆనకట్టలు –
గనులు-
పరిశ్రమలు –
……..
……..

దోపిడీల
లిస్టులో
పథకాలకు
పథకాలు!

(అ)సంక్షేమం
అ(న)భివృద్ధి
బాటలో

ఎట్నుంచి
ఎవరు
గెలిచినా
ఎవరు
ఓడినా

(అ)సామాన్య
జనానీకానికేగా
తిప్పలు
మొదలు

ఎక్కడైనా
హమ్మయ్య
అనుకోవడానికుందా?

అసలు
ఇది
సంబరాల వేళేనా?

సంబరమంటూ
జరుపుకునేదంతా నిజమేనా?

****

నెచ్చెలి పాఠకులందరికీ సదవకాశం: 

          ప్రతినెలా నెచ్చెలి  పత్రికలో వచ్చే   రచనలు / “నెచ్చెలి” యూట్యూబ్ ఛానెల్లో వచ్చిన ఆర్టికల్స్ వేటిపైనైనా వచ్చిన కామెంట్ల నించి ప్రతి నెలా ఒక ఉత్తమ విశ్లేషణాత్మక కామెంటుని ఎంపిక చేసి  ప్రకటిస్తాం. పాత రచనల మీద కూడా కామెంట్లు చెయ్యవచ్చు. 

          మరింకెందుకు  ఆలస్యం? రచనల్ని చదివి వివరంగా కామెంట్లు పెట్టడం ప్రారంభించండి.  

          వినూత్నం, వైవిధ్యం ప్రధాన నిలయాలైన  “నెచ్చెలి” వస్తున్న వివిధ వినూత్న రచనల్ని తప్పక చూసి, చదివి ఆనందిస్తారు కదూ!

*****

మే, 2024 లో ఎంపికైన ఉత్తమ కామెంటు రాసిన వారు: హరి వెంకట రమణ
ఉత్తమ కామెంటు అందుకున్న పోస్టు: మా ఊరు చూడాలని ఉందా!

ఇరువురికీ అభినందనలు!

****

Please follow and like us:

2 thoughts on “సంపాదకీయం-జూన్, 2024”

  1. లేఖాస్త్రం’ శీర్షికన నా రచనలు (ఐదు కధలు) ప్రచురణకి స్వీకరించినందుకు,
    ‘నెచ్చెలి’ సాహిత్య పత్రిక సంపాదకీయం ..కె. గీత గారికి మిక్కిలి ధన్యవాదాలు. 🌹 సమయం తీసుకుని చదివినందుకు పాఠకులకి నమస్సులు.
    కోసూరి ఉమాభారతి

  2. Geeta madam, June sanchika lo ప్రముఖ రచయిత్రి యద్దనపూడి సులోచారాణి గారి పై పద్మశ్రీ గారు రాసిన లేఖ చదివాక అనిలించింది” అటువంటి రచయిత్రుల పేరు పొందిన రచనలు. మరోసారి పాఠకులకు ధారావాహిక గా అందించే అవకాశం ఉండా? ఈనాటి యువతరానికి జీవనతరణగాలు, సెక్రటరీ వంటి అమూల్యమైన రచనలు చదివి ఆనందించే అవకాశం దొరుకుతుంది కదా అని నా అభిప్రాయం.

Leave a Reply

Your email address will not be published.