image_print

నా జీవన యానంలో- (రెండవభాగం)- 7

నా జీవన యానంలో- రెండవభాగం- 7 -కె.వరలక్ష్మి  కొత్త వారింట్లో కొచ్చి ఏడేళ్ళు అయిపొయింది. నేను ఒక్క రోజు కూడా ఆలస్యం చెయ్యకుండా అద్దె కట్టేస్తూ ఉండేదాన్ని. పెరట్లో ఉన్న కొబ్బరి చెట్ల నుంచి పడిన కాయలన్నీ పోగుచేసి ఇల్లు గల వాళ్లకి పంపించేస్తూ ఉండేదాన్ని. ఇంటి విషయంలో నిశ్చింతగా ఉన్నామనుకుంటూండగా ఇల్లు గల వాళ్ల ఆఖరబ్బాయి వెంకన్నబాబుగారొచ్చి వాళ్ల ఆస్తి పంపకాలు అయ్యాయని, ఐదుగురు అన్నదమ్ముల్లో తను చిన్నవాడు కాబట్టి దిగువ ఉన్న ఈ ఇల్లు […]

Continue Reading
Posted On :

నా జీవన యానంలో- (రెండవభాగం)- 6

నా జీవన యానంలో- (రెండవభాగం)- 6 -కె.వరలక్ష్మి  ఇల్లూ స్కూలూ ఒకటే కావడం వల్ల మా పిల్లలు సెలవు రోజొస్తే స్కూలాటే ఆడుకునే వాళ్లు. ఒక్కళ్ళు టీచరు ఇద్దరు విద్యార్థులు. బైట పిల్లలొచ్చిన అదే ఆట. వాళ్లకెప్పుడూ టీచర్ స్థానం ఇచ్చేవాళ్లు కాదు. ఊళ్లో ఒకటో రెండో బట్టల కోట్లు ఉండేవి. రెడీమేడ్ షాపులనేవి లేవు. ఊళ్లోకి మూటల వాళ్ళు తెచ్చిన మంచి రంగులూ, డిజైన్స్ ఉన్న కట్ పీసెస్ కొని పిల్లలకి బట్టలు కుట్టించేదాన్ని. మసీదు […]

Continue Reading
Posted On :

మా కథ -3 గనికార్మికుని భార్య దినచర్య

మా కథ  -ఎన్. వేణుగోపాల్  గనికార్మికుని భార్య దినచర్య నా భర్తకు మొదటి షిఫ్ట్ ఉన్నప్పుడు నాకు ఉదయం నాలుగింటికే తెల్లవారుతుంది. లేచి ఆయనకు ఉపాహారం తయారు చేస్తాను. నేనప్పుడే సత్తనాలు కూడా తయారు చేసుకోవాల్సి ఉంటుంది. సల్లేనా అంటే మాంసం, బంగాళాదుంపలు, మిరియాలపొడి మసాలా కూరిన బూరె. నేను రోజుకు వంద సత్తనాలు తయారు చేసి బజార్లో అమ్ముతాను. నా భర్త సంపాదన మా అవసరాలకు పూర్తిగా సరిపోదు. గనుక వేన్నీళ్ళకు చన్నీళ్ళలాగా నేనూ కొంత […]

Continue Reading
Posted On :

నా జీవన యానంలో- (రెండవభాగం)- 5

నా జీవన యానంలో- (రెండవభాగం)- 5 -కె.వరలక్ష్మి  అది 1977 వ సంవత్సరం, ఆ సంవత్సరం జనవరి చివరి తేదీల్లో మా చిన్న చెల్లికీ , ఫిబ్రవరి మొదటి వారంలో మా పెద్ద తమ్ముడికీ పెళ్లిళ్లు జరిగాయి. ‘నేను ఆడ పిల్లలకి కట్నం ఇవ్వను, మగ పిల్లలకి తీసుకొను’ అన్న మా నాన్నమాట మా చిన్న చెల్లి విషయంలో చెల్లలేదు. 5 వేలు ఇవ్వాల్సి వచ్చింది. ఆ డబ్బుల కోసం, పెళ్లి ఖర్చులకీ అప్పు చేసేరు. నేను […]

Continue Reading
Posted On :

మా కథ -2 గని కార్మికులెట్లా పనిచేస్తారు?

మా కథ (దొమితిలా చుంగారా) -అనువాదం: ఎన్. వేణుగోపాల్  గని కార్మికులెట్లా పనిచేస్తారు? గనుల్లో రెండు రకాలైన పని ఉంటుంది. ఒకటేమో సాంకేతికులు చేసేది, మరొకటి గని – పనివాళ్ళు చేసేది. గని పని ఎప్పుడూ ఆగదు, పగలూ రాత్రీ నడుస్తూనే ఉంటుంది. గని పని వాళ్ళకు మూడు షిప్టులుంటాయి. షిఫ్ట్ కొందరికి నెలకోసారి, కొందరికి రెండు వారాలకోసారి, మరికొందరికి వారానికోసారి మారుతుంది. నా భర్తకు షిఫ్ట్ ప్రతి వారమూ మారుతుంది. గని లోతులకు దిగడానికి, పైకి […]

Continue Reading
Posted On :

మా కథ -1 గని కార్మికుల నివాసం

మా కథ  -ఎన్. వేణుగోపాల్  గని కార్మికుల నివాసం సైగ్లో-20 ఒక గని శిబిరం. అక్కడున్న ఇళ్లన్నీ కంపెనీవే, చాలామంది గని పనివాళ్లు పొరుగున ఉన్న లలాగువాలోను, దగ్గర్లోని ఇతర కంపెనీయేతర గ్రామాల్లోనూ కూడా నివసిస్తారు. ఈ శిబిరంలోని ఇళ్లన్నీ ఏ ప్రకారం చూసినా అద్దెవే కాని పనిచేసినంతకాలం కార్మికులకుంటారు. కంపెనీ మాకు వెంటనే ఇళ్లివ్వదు, ఇక్కడ ఇళ్ల కొరత బాగా ఉంది. ఐదేళ్లు, పదేళ్లు కూడా ఇల్లు దొరకకుండా పనిచేసిన గని పనివాళ్లెంతో మంది ఉన్నారు. […]

Continue Reading
Posted On :

నా జీవన యానంలో- (రెండవభాగం)- 4

నా జీవన యానంలో- (రెండవభాగం)- 4 -కె.వరలక్ష్మి  M.A. తెలుగులో స్పెషలైజేషన్ కి చేమకూర వేంకటకవిని ఎంచుకున్నాను. ఎందుకంటే ఆయన వ్రాసినవి రెండు కావ్యాలే అందుబాటులో ఉన్నాయి కాబట్టి. 1.విజయ విలాసము, 2. సారంగధర చరిత్రము. చదువుకోవడానికి పెద్దగా కష్టపడక్కర్లేదు అనుకున్నాను. ఇప్పట్లాగా నెట్ లోనో , పుస్తకాల షాపుల్లోనో విరివిగా బుక్స్ దొరికే కాలం కాదు. నాకేమో మోహన్ కూడా పి.జి. చేసి హెడ్ మాస్టరో, లెక్చరరో అయితే బావుండునని ఉండేది. బుక్స్ కొనేస్తే తనే […]

Continue Reading
Posted On :

మా కథ (దొమితిలా చుంగారా) దొమితిలా మాట

మా కథ  దొమితిలా మాట -ఎన్. వేణుగోపాల్  ఇప్పుడు నేను చెప్పేదేదో నా సొంత గొడవగా ఎప్పుడూ ఎవరూ వ్యాఖ్యానించొద్దని నా కోరిక. నా జీవితమంతా జనానిది. నాకేమేం జరిగాయో నా దేశంలో వందలాది మందికవే జరిగాయి. నేను స్పష్టంగా చెప్పదలచుకున్నది ఈ సంగతే. ప్రజల కోసం నేను చేసిందానికన్నా చాలా ఎక్కువ చేసిన వాళ్లున్నారని నాకు తెలుసు. ఐతే వాళ్లలో కొందరు చనిపోయారు, మరికొందరి సంగతి బయటికి తెలిసే అవకాశం లేకుండానే పోయింది. అందుకే నేనిక్కడ […]

Continue Reading
Posted On :

నా జీవన యానంలో- (రెండవభాగం)- 3

నా జీవన యానంలో- (రెండవభాగం)- 3 -కె.వరలక్ష్మి  ఊళ్లో లయన్స్ క్లబ్ ప్రారంభించిన కొత్తరోజులు. వాళ్ల కమ్యూనిటీ హాలు మేమున్న ఇంటికి దగ్గర్లోనే ఉండేది. వాళ్ల పిల్లలకి ఫీజ్ కట్టడానికొచ్చిన లయన్ మెంబరొకాయన “మాస్టారూ మీరూ లయన్స్ క్లబ్ లో చేరచ్చు కదా” అని అడిగేడు. నేనా విషయం మోహన్ తో చెప్పి ‘చేరదామా’ అని అడిగేను . “శాంత, రుక్కుల పెళ్లిళ్లకి చేసిన అప్పులు నా నెత్తిమీదున్నాయి. నువ్విప్పుడిలాంటి సేవా కార్యక్రమాలు పెట్టకు” అన్నాడు. లయన్స్ […]

Continue Reading
Posted On :

నా జీవన యానంలో- (రెండవభాగం)- 2

నా జీవన యానంలో- (రెండవభాగం)- 2 -కె.వరలక్ష్మి  మా మామగారికి అనకాపల్లి దగ్గర అడ్డు రోడ్డు కొరుప్రోలు ట్రాన్స్ ఫర్ అయ్యిందట. అక్కడి నుంచే మా అత్త గారొక సారి, మామగారొకసారి వచ్చి వెళ్లే వారు.  ఆ సంవత్సరం సెలవుల్లో మేం పిల్లల్ని తీసుకుని కొరుప్రోలు వెళ్లేం. రెండు గదుల డిపార్టుమెంట్ క్వార్టర్స్. పెద్ద కాంపౌండు లోపల చెట్లు , ఆఫీసు. పక్కనే రోడ్డు కవతల సంత. పెద్ద సైజు టేబులంతేసి పై డిప్పలున్న తాబేళ్లని నేనక్కడే […]

Continue Reading
Posted On :

మా కథ (దొమితిలా చుంగారా) ఉపోద్ఘాతం

అనువాదకులు ఎన్.వేణుగోపాల్ ముందుమాట (2003)  ఇరవై అయిదేళ్ల తర్వాత బొలీవియా -ఎన్.వేణుగోపాల్   ఈ పుస్తకం ఇంగ్లీషు మూలం 1978లో, 25 సంవత్సరాల కింద వెలువడింది. అంటే ఈ పుస్తకం 25 ఏళ్ల వెనుకటి బొలీవియా గురించి వివరిస్తుంది. ఈ 25 ఏళ్లలో బొలీవియాలో చాలా మార్పులు జరిగాయి. బొలీవియా ప్రజల జీవన స్థితిగతులు ఇంకా దిగజారిపోయాయి. ఇటీవల బొలీవియా రెండు సంఘటనల నేపథ్యంలో వార్తల్లోకెక్కింది. ఇటీవలనే దేశాధ్యక్షుడు గోన్జాలో సాంకెజ్ దేశం వదిలి పారిపోయాడు. ప్రపంచ బ్యాంకు, […]

Continue Reading
Posted On :

మా కథ – ఇరవై ఏళ్ల తర్వాత

(వచ్చేనెల నుండి “మాకథ” (దొమితిలా చుంగారా ఆత్మకథ)  ధారావాహిక ప్రారంభం. ఈసందర్భంగా అనువాదకులు ఎన్. వేణుగోపాల్ ఆంధ్రజ్యోతి (జనవరి 19, 2004) లో రాసిన ముందు మాట మీకోసం ప్రత్యేకంగా ఇక్కడ ఇస్తున్నాం. నెచ్చెలిలో పున: ప్రచురణకు అంగీకరించిన వేణుగోపాల్ గారికి ధన్యవాదాలు-) ఇరవై ఏళ్ల తర్వాత… –   ఎన్. వేణుగోపాల్ నేను అనువాదం చేసిన పూర్తిస్థాయి మొదటి పుస్తకం మా కథే, అందువల్ల ఆ పుస్తకంతో నా అనుబంధం హృదయానికి చాలా దగ్గరిది. ఒక […]

Continue Reading
Posted On :

నా జీవన యానంలో- (రెండవభాగం)- 1

నా జీవన యానంలో- (రెండవభాగం)- 1 -కె.వరలక్ష్మి  అప్పటికి నాకు ఇరవై ఐదవ సంవత్సరం నడుస్తోంది. స్కూల్ ఫైనల్ (11 వ తరగతి ) తో నా చదువాగిపోయి పదేళ్లైపోయింది. స్కూల్ ఫైనల్లో నాకొచ్చిన మార్కుల వల్ల హిందీలో ప్రాధమిక, మాధ్యమిక చదవకుండానే డైరెక్టుగా రాష్ట్ర భాషకు అటెండై పాసయ్యాను . అప్పటికి హిందీ అక్కయ్యగారు ట్యూషన్స్ మానేసారని గుర్తు . నేను సొంతంగానే చదువుకునే దాన్ని . రాజమండ్రిలో పుష్కరాల రేవు పక్కనున్న రాణీ మహల్లో […]

Continue Reading
Posted On :