చూడలేను! (కవిత)

చూడలేను! -డి.నాగజ్యోతిశేఖర్   కరగని దిగులుశిల పగిలిన స్వప్న శిఖరంపై  సాంత్వన తడికై కొట్టుకులాడుతున్నది! మలిగిన ఆశా మిణుగురులు రెక్కల సడి వెతల దిగంతాల అంచుల్లో నిశ్శబ్ధాన్ని ప్రసవిస్తున్నది! కన్నీళ్ల మేఘసంచులు చిల్లులుపడి కంటిఆకాశం దుఃఖ వర్ణం పూసుకుంటున్నది! ఇప్పుడిప్పుడే విచ్చుకున్న అస్తిత్వ రెక్కలకు ఆధారమివ్వని ఈనెల మనస్సులు  వివక్షతను ఈనుతున్నవి! మేధస్సు చంద్రునిపై వెన్నెల సౌధాలు నిర్మిస్తున్నా… ఆంక్షల రాహువులు చీకటి అమవాసలై చుట్టేస్తున్నవి! మాటల్లో ఆకాశంలో సగమైనా…. చూపుల్లో వంకరతనపు   ప్రశ్నాచిహ్నమై స్వేచ్చా హృదయం […]

Continue Reading

అమ్మతనాలు (కవిత)

అమ్మతనాలు -పద్మావతి రాంభక్త ఏ దేశమేగినా ఎడారిలో ఒంటరిగా నిలబడి సతమతమవుతున్నపుడు నువ్వు అక్కడ ఎగరేసిన అమెరికా టికెట్టు నా భుజంపై పిట్టలా వాలింది నేను ఉత్సాహపు ఊయలలో ఊగుతూ తూగుతూ ఊరంతా దండోరా వేసేసాను నీకు నాపై ఉన్న ప్రేమ ఎవరెస్టు శిఖరమంత ఎత్తుగా అగుపించింది నిరంతరం ఎన్నో కలలలో తేలి తూలిపోయాను రోజులు యుగాల రూపమెత్తి కదలక మెదలక కలవరపరుస్తున్నట్టే అనిపించింది కళ్ళు కాలెండర్ కు అతుక్కుని దిగాలుగా వేళ్ళాడుతున్నాయి నిరీక్షణ నిస్సహాయతను తొడుక్కుని […]

Continue Reading
subashini prathipati

ప్రత్తిపాటి నానీలు (కవిత)

ప్రత్తిపాటి నానీలు -సుభాషిణి ప్రత్తిపాటి 1️⃣గాయాలన్నీ…నెత్తురోడవు!!కొన్ని జీవితాలనుఅశ్రువుల్లా..రాల్చేస్తాయి!2️⃣కనులుంది..చూసేందుకే!తెరచిన ప్రతికన్నుమెలకువ కాదే!!3️⃣కరుణ నిండినకళ్ళు కలువలు!వేదనా వేసటతీర్చేది వెన్నెలేగా!4️⃣కనబడని క్రిమిస్వైర విహారం!మారువేషాన తిరిగేయమునిలా!!5️⃣మల్లెఎప్పటికీ ఆదర్శమే!!మండుటెండలోనవ్వుపూలై పూస్తున్నందుకు!!    ***** ప్రత్తిపాటి సుభాషిణి -ప్రత్తిపాటి సుభాషిణి నివాసం బాపట్ల.  గత 20 సంవత్సరాల నుంచి తెలుగు ఉపాధ్యాయినిగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్నారు. కళాశాలనుంచి కవితలు వ్రాస్తున్నా, ఇటీవలనుంచే వివిధ పోటీలలో పాల్గొంటూ  కృష్ణ శాస్త్రి, సినారె, అద్దేపల్లి పురస్కారాలు, టీచర్స్ ఫెడరేషన్ వారి సావిత్రి బాయి పూలే అవార్డులు పొందారు. బడి పిల్లల […]

Continue Reading

యుద్ధం ఒక గుండె కోత-1 (దీర్ఘ కవిత)

యుద్ధం ఒక గుండెకోత-1 (దీర్ఘ కవిత) -శీలా సుభద్రా దేవి బాధ సన్నటి సూదిములుకై రక్తంలో ప్రవేశించింది నరాల్ని కుట్టుకుంటూ రక్తంతోబాటుగా శరీరమంతటా ప్రవహించటం మొదలైంది శరీరంలో ఎక్కడో ఒకచోట ఉండుండి ప్రవాహమార్గంలో సున్నితమైన నరాల గోడల్ని తాకుతూ స్పందనల్ని మీటుతూ చురుకు చురుకు మనిపిస్తూనే ఉంది హాహాకారాల్ని ఆహ్లాదంగా పరిగణించలేంకదా ఆక్రందనల్ని ఆనందంగా ఆస్వాదించలేంకదా చాటున మాటేసి పంజా విసిరినా పంజాదెబ్బ పడేది అమాయకులమీదే గాయం అయ్యేది తల్లి గర్భంపైనే ఆకాశం పిడుగై వర్షించినా పక్షులకు […]

Continue Reading

వాన (కవిత)

వాన -సంధ్యారాణి ఎరబాటి ముసురుపట్టిన వాన కురుస్తుఉంటే గుండెల్లో ఎదో గుబులైతాది గరం గరంగా తిందామంటూ నోరేమో మొరబెడుతాది దోమనర్తకీలు  వీధుల్లో భాగోతాలు మొదలెడతాయి మ్యాన్ హోలులు సొగసరిప్రియురాళ్లలా నవ్వుతూ నోరంతా తెరుస్తాయి గుంతలన్నీ నిండి నిండుచూలాలవుతాయి వీధులన్నీ గోదారిలా వయ్యారాలు పోతాయి.. రోడ్డులన్ని పుటుక్కున తెగిపోతాయి దారులన్నీ కర్ఫ్యూ పెడతాయి.. మురికి కాలువలన్నీ ఒక్కసారే ఉరికి ఉరికి పారుతాయి వీధి చివరి బజ్జీల బండి తీరిక లేకుండా వెలుగుతుంది మూలన ముదురుకున్న ముసలమ్మ  మరికాస్త ముడుచుకుంటుంది […]

Continue Reading

ఉరితాళ్ళే గతాయే (కవిత)

ఉరితాళ్ళే గతాయే -నల్లెల్ల రాజయ్య అహో ! నా పాలక వర్గమా మా కడుపులు నింపే అన్నదాతని అందలమెక్కించి అంగలారుస్తూ చొంగ కారుస్తవ్ ! దేశానికే ఎన్నెముకలు. నా రైతన్నలని అదేపనిగా అంటుంటవ్ ! కని మీ మనసు నిండా అన్నదాతల ఎన్నెముకల్లోని మూలుగను సైతం లేకుండా పీల్చుకతినే నయవంచక ఎవ్వారం నీది. నీ మాటల్లో మర్మముంటది చేతల్లో చెప్పలేనంత సత్తెన నాశన కార్యాలు జరిపిస్తుంటవ్ ! గిట్టుబాటు ధరలివ్వని గిదేం రాజ్యమనీ ఆగ్రహించిన అన్నదాత ఆక్రోషిస్తే […]

Continue Reading
Posted On :

మన’వరాలు’ (కవిత)

మన ‘వరాలు’ -ప్రసేన్ “పెంటకుప్పలో పసికందును వదిలి వెళ్లిన గుర్తు తెలియని వ్యక్తులు” “వైద్యుల నిర్లక్ష్యంతో అప్పుడే పుట్టిన శిశువు మృతి. ఆసుపత్రిని ధ్వంసం చేసిన బంధువులు” వంటి  వార్తలు నాకు నిత్యకృత్యం. అయితే జర్నలిస్టుగా ఈ సందర్భాలలో నేను  గమనించిన  విషయం ఒకటుంది. పెంటకుప్పమీద దొరికిన పసికందు అన్ని సందర్భాలలోనూ ఆడపిల్లే.  ఆసుపత్రుల మీద దాడి జరిగిన ప్రతి సందర్భంలోనూ మరణించింది మగబిడ్డే. ఆడ శిశువు మరణిస్తే సంబంధిత బంధువులు ఏ గొడవా చేయకుండా నిశ్శబ్దంగా […]

Continue Reading
Posted On :
Rajita Kondasani

జవాబు (కవిత)

జవాబు -రజిత కొండసాని ఓ ఉషోదయాన ఎందుకో సందేహం వచ్చి భయం భయంగా లోలోపల ముడుచుక్కూర్చున్న గుండెను తట్టి అడిగా! ప్రపంచాన్ని చూసే కన్నుల్లానో ప్రాణ వాయువుల్ని పీల్చే ముక్కులానో సప్త స్వరాల్ని దేహంలోకి ఒంపే చెవిలానో సప్త స్వరాల్ని దేహంలోకి ఒంపే చెవిలానో సిగ్గుతో ఎర్రబారే చెంపలానో సాటి వారి మీద ప్రేమ ప్రకటించే నోరులాగనో దేహం మీద బాహాటంగా కనిపించక ఎముకల గూడు మధ్య ఏ మూలనో చిమ్మ చీకట్లో దాక్కున్నావెందుకని ? నేనీ […]

Continue Reading
Posted On :

ఊటబాయి కన్నీరు (కవిత)

ఊటబాయి కన్నీరు -డా. కొండపల్లి నీహారిణి ఎందుకింత ఏకాంత నిశీధి గమనాలో ఎందుకింత విషాద పవనసమూహాలో ఎక్కడినుండో పొగబండి ఏడుపుకు వేళ్ళాడుతూ ఎందర్నో మోసుకొస్తున్నది. పరాయీకరణను , పరాభవాలను కూరుకొని ఎఱ్ఱటి పట్టాలపై ఇటుగా….. ఆర్తనాదాలతో,ఆధిపత్యాలతో…. కాలం చేసే గాయాల్లో ఋతువుల్ని ప్రాణాల చెంత జేర్చ, అనుమానాలు చెప్పే బాధల గాధల్ని అననుకూల భావాలకూర్చి, కళ్ళసామ్రాజ్య సింహభాగాన సింహాసనమెక్కి , అట్లా…… అవునూ, నీదీ నాదీ ఒక్కచూపుల పొద నీదీ నాదీ ఒక్కమాటల సొద కలలతీరాన కనరాని […]

Continue Reading

ఆమెప్పటికీ…..!? (కవిత)

ఆమెప్పటికీ…..!? -సుధామురళి అకస్మాత్తుగా ఓ రాత్రి భోరున వర్షం కురుస్తుంది నదులన్నీ కళ్ళ కరకట్టల మీద యుద్ధం ప్రకటిస్తాయి మమ్మల్ని ఆపేందుకు మీకేం హక్కు ఉందని ప్రశ్నిస్తూ చెక్కిళ్ళ నిండా సైన్యాలను చారలు చారులుగా నిలబెట్టేస్తాయి ఆ వర్షం ఆమెకు మాత్రమే సొంతం మనసుంది కదా తనకు చిన్నా పెద్దా మాటలతో గాయపరుచుకునేందుకు ఒకటో రెండో గదమాయింపుల గద్దెల్ని ఎక్కేందుకు పొలిమేర దాటని తనను ఊరుకాని ఊరుకు తరిమినా మిన్ను విరగనట్టు విర్రవీగేందుకు ఎన్ని కష్టాల్ని దాపెట్టిందో […]

Continue Reading
Posted On :

వరద (కవిత)

వరద -శ్రీధరరెడ్డి బిల్లా జనసంద్ర నగరం జలసంద్రమయ్యింది. పెట్రోలు కొట్టకుండానే కార్లు కొట్టుకు పోతుంటే , చెరువుల్లో తిరిగే బోట్లు కాలనీల మధ్య తిరుగుతూ ఇంటి సామాను, వంట సామాను  మోస్తున్నాయి! వీధి రోడ్డు మాయమై, భీకర వాగు అయ్యింది. “వీధి మలుపు” వాగుకొక వంక అయ్యింది! దారి చూపిస్తూ పంపించే ట్రాఫిక్ సిగ్నలు , దారి తెల్వకుండా ఎటువైపో తేలిపోతా ఉంది ! కాళ్ళతో  టిక్కుటిక్కున నడిచిన నిన్నటి రోడ్డు మీద కాళ్ళు నేలకు ఆనక, […]

Continue Reading

ప్రకృతి (కవిత)

ప్రకృతి -గిరి ప్రసాద్ చెల మల్లు కృష్ణా నదిలోని నల్లని గులకరాళ్ళ కళ్ళ చిన్నది గోదావరంత పయ్యెద పై నే వాల్చిన తలని నిమిరే నల్లమల కొండ ల్లాంటి చేతివేళ్ళ చెలి సోమశిల లాంటి ముక్కు ఉచ్చ్వాస నిశ్వాసాలకి అదురుతుంటే నా గుండెలపై వెచ్చని రామగుండం స్పర్శ శేషాచలం కొండల కనుబొమ్మల మధ్య గుండ్రని చందవరం స్థూపం లాంటి తిలకంలో నా రూపు శాశ్వతం ఫణిగిరి లాంటి నల్లని వాలుజడ పిల్లలమర్రి ఊడల్లా ఊగుతుంటే మదిలో ఏటూరు […]

Continue Reading

అక్కమహాదేవి (కవిత)

అక్కమహాదేవి -గిరి ప్రసాద్ చెలమల్లు అక్కమ్మా! ఎప్పుడో ఏనాడో నీ నుండి జాలువారిన  వచనం మా సమాజాన్ని సూటిగా, నగ్నంగా ప్రశ్నిస్తున్నట్లగుపిస్తుందమ్మా నీ కాయం నీ ఇష్టం ఎవ్వరికి అర్పిస్తావో ఎవ్వరి దురాక్రమణకి లొంగక అణువణువూ చెన్నకేశవ చెంత దిగంబరమో నీ మనోభీష్టమో స్పర్శయో సాన్నిహిత్యమో తలంచినదే తడవుగా ఎక్కుబెట్టిన విమర్శనావచనం జీర్ణించుకోలేని ఆధిక్యత నీ గుహ ఎన్నో మనోనిగూఢాల వేదిక నీ మేను ప్రవచించిన కేశాల అల్లిక నాడే ఎలుగెత్తిన నీవే మా చలం కన్నా […]

Continue Reading

హథ్రాస్ (కవిత)

హథ్రాస్ -వసీరా సూర్యుడి తేజాన్ని మట్టిబలాన్ని చెమటలోని ప్రేమని తాగి పెరిగిన గోధుమ గింజ రక్త సిక్తమైంది చిన్నారి గోధుమ గింజ రక్తకన్నీరుతో తడిసి నేలలోకి వెళ్లపోయింది. నేల లోపల అణుప్రకంపనలు గంగాతీర మైదానాలు కంపిస్తున్నాయ్ కంకుల్లోని గింజలు నిప్పుల పాలుపోసుకుని గ్రెనేడ్లవుతున్నాయి కంకులు బులెట్లని కాస్తున్నాయి తరతరాలుగా నీదయిన నీ నేల రణరంగమవ్వడానికి సిద్ధమవుతోంది. విస్ఫోటించే నేల లోంచి కొత్త కాళిక ఆవిర్భవిస్తోంది. సత్యానికి నోరిచ్చేందుకు సహస్రబాహువుల్లో కొత్త ఆయుధాలు ధరించి పరపరా సరసరా నాలుకలు […]

Continue Reading
Posted On :

కనుక్కోండి (కవిత)

కనుక్కోండి -దిలీప్.వి ఆకలైతే కాదు నన్ను చంపింది పస్తులుoడి ఆకలితో అలమటించిన దినములెన్నో… పేదరికం కాదు నన్ను వల్లకాటికి చేర్చింది అయితే.. ఇన్నేళ్ల నుండి దానితోనే కదా సావాసం చేస్తున్నది కరోనాకా నేను బలిఅయినది? కాదు కాదు… అసలే కాదు దేనికి నేను బలి అయిందో తెలియదా మీకు? ఇంటికి చేరుతానని ఇంటికి దీపమైతానని నన్ను నడిపించిన ఆశ విగతజీవిగా మారి కన్నవారికి మిగిల్చిన నిరాశ కారకులెవరో కనుక్కోండని ప్రశ్నగా మారి వెళుతున్న… ***** దిలీప్.వినా పేరు […]

Continue Reading
Posted On :

అస్థిమితం….. (కవిత)

అస్థిమితం….. -సుధామురళి ఒకటే రెక్కని ఎన్నిసార్లు ఆడించను చెప్పుఒకటే గుండెని ఎన్నిసార్లు సర్దుకోమని సర్దుబాటు చెయ్యను చెప్పు ఓ నిప్పు కణాన్ని వదలాలనుకుంటాఆ రెప్పల చాటులో నుంచికనుగుడ్డు ఏ మాయలో కూరుకుపోతుందో కానీవేడి ఆవిరి ఎప్పుడో చల్లారిపోయిన కాఫీ కప్పు అవుతుంది….. ఓ అక్షర తూటాని లాగి పెట్టి విడవాలనుకుంటాఆ చేదు తేనెల కలయికల మధ్యలోనుంచినరంలేని అర్ధమందపు నాలుక నాకేం పట్టింది అనుకుంటుందో ఏమోగానీఅసలు అనుకోని పదాలను వల్లెవేస్తుందిఅది నేనేనా అన్నదనే భ్రమను నాకప్పగిస్తూ…. శూన్యం నిండా ఏదో నిండుకుని ఉంటుందివెలితిలేని […]

Continue Reading
Posted On :

ఇక్కడ- అక్కడ (కవిత)

ఇక్కడ- అక్కడ  -కుందుర్తి కవిత పెళ్ళైన కొన్నాళ్ళకే  పుట్టింటి మీద బెంగొచ్చి వచ్చా ఇక్కడ…. చిన్ననాటి స్నేహితురాళ్ళంతా కలిసి చాన్నాళ్ళయిందని వచ్చి చుట్టూ చేరారు … రుసరుసలాడుతూ, తమలోతాము గుసగుసలు చెప్పుకుంటున్నారు ఏదో నిర్ధారణకి వచ్చినట్టుగా నాతో యుద్ధానికి సిద్ధమవుతున్నట్టు గా నా ఆత్మగౌరవం నన్ను నిలదీసింది నీకసలు ఆత్మసాక్షి అంటూ ఉందా అని చిన్నప్పటినుండీ వేలు వదలకుండా  నీతోనే నడిచిన నీ చిరకాల స్నేహితురాలిని ఈరోజు ఎవరెవరి కోసమో వదిలెళ్ళిపోతావా అని ఎవరో కాదు నా వాళ్ళే అని సంకోచంగానే నాకు నేను సర్ది చెప్పుకున్నాను కనీసం అప్పుడప్పుడైనా పలకరించవేమని చిందులు తొక్కుతూ  చటుక్కున చక్కా పోయిందది , నామీద కాసింతైనా  మర్యాద లేకుండా !!  అచ్చం అక్కడి గర్వం లాగే !! నా ఆత్మ విశ్వాసం నన్నూ నీతో తీసుకుపొమ్మంది నీకక్కడ సరిపడినంత చోటు ఉండకపోవచ్చు అంటే… ఈ ఇంటికంటే ఆ ఇల్లు పెద్దదికదా అని ప్రశ్నించింది అవునో కాదో నాకే తెలీనట్టు తలూపాను దాని అమాయకత్వానికి నాలో నేనే నవ్వుకున్నాను ఇరుకు ఇంట్లో కాదు,  మనుషుల మనసుల్లో అని  నోటిదాకా వచ్చినా, చచ్చినా వద్దనుకొని దాని నోరే, సులువు కదాని నొక్కేసాను విశ్వాసం లేని చూపులు విసురుతూ  విరవిరా వదిలి వెళ్ళిపోయింది !!  అచ్చం అక్కడి స్వార్ధం లాగే!! వెనుకనుంచి భుజంమీద తట్టి నన్ను మర్చిపోయావా, అనింది నా ఆత్మాభిమానం నాకోసం కాసింతైనా పోరాడాలనిపించలేదా  […]

Continue Reading
Posted On :

వరద (కవిత)

వరద -శ్రీధరరెడ్డి బిల్లా జనసంద్ర నగరం జలసంద్రమయ్యింది. పెట్రోలు కొట్టకుండానే కార్లు కొట్టుకు పోతుంటే , చెరువుల్లో తిరిగే బోట్లు కాలనీల మధ్య తిరుగుతూ ఇంటి సామాను, వంట సామాను  మోస్తున్నాయి! వీధి రోడ్డు మాయమై, భీకర వాగు అయ్యింది. “వీధి మలుపు” వాగుకొక వంక అయ్యింది! దారి చూపిస్తూ పంపించే ట్రాఫిక్ సిగ్నలు , దారి తెల్వకుండా ఎటువైపో తేలిపోతా ఉంది !   కాళ్ళతో  టిక్కుటిక్కున నడిచిన నిన్నటి రోడ్డు మీద కాళ్ళు నేలకు […]

Continue Reading

మార్పు (కవిత)

మార్పు -సంధ్యారాణి ఎరబాటి నీలి నీలి నింగికి…నేనెపుడూప్రేమదాసీనే…ఆకులతో నిండిన…పచ్చదనానికినేను ఎపుడూ ఆరాధకురాలినేఎగిరే అలల కడలి అంటేఎంతో ప్రాణంరహస్యం నింపుకున్న అడవన్నాఅంతులేని అభిమానం నింగి అందాన్ని చూడాలంటే…..చిన్న డాబా రూపు మార్చుకుంది…..అందనంత ఎత్తుకుఎదిగి పోయిందికొబ్బరాకుల గలగలలుకొంటె చంద్రుడిసరాగాలు మరుగున పడ్డాయిచెట్ల జాడలు…..నీలి నీడల్లామారిచోటు తెలియనితీరాలకు వెళ్లిపోయాయి…. గ్రీష్మపు సాయంత్రాలు…కూడారూక్షత్వపు ఆహ్లాదపులయ్యాయి ఋతువులు మారిపోయాయి వర్షం ఎపుడో స్నిగ్ధత్వం  మరచింది పచ్చదనం…ఖచ్చితంగా…..చిన్నబుచ్చుకుంది..ఈ మహానగరంలో  పేక మేడల్లాంటి ఈ  కట్టడాలపునాదుల్లో.. హరితం  మౌనంగాసమాధి అయింది…. పక్షిలా ఎగిరే నా భావాలన్నీ…. విశాలగగనం లో విహరించక ఎన్నాళ్ళయిందో అగ్గిపెట్టేల్లా కట్టిన కాంక్రీట్  అడవిలోఆకాశం కనిపించడం లేదు నాకు పక్షుల […]

Continue Reading

నీవు లేని రోజు (కవిత)

నీవు లేని రోజు -చందలూరి నారాయణరావు ఓ  ప్రియతమా! నీవు ప్రక్కన లేని ఒక్క రోజు ఒక పూవు అడిగింది నా అవసరం యిప్పుడెందుకని? ఓ పాట నిలదీసింది నా హాయి అవసరమేమని? ఓ రాత్రి ఆశర్యపడింది ఈనాటి కలను ఏమిచేస్తావని? ఒక రోజు నీవు దూరమైతే ఇన్ని ప్రశ్నలా? ఇన్ని అనుమానాలా? ఇంత అవమానమా? ఇక తట్టుకోలేను తల్లడిల్లుతున్నా ఎప్పుడూ భరింపలేను ఎడబాటును క్షమించు కరుణించి రక్షించు క్షమించి నీ ఒడిని వీడితే లోకం ఇంత […]

Continue Reading

ఆమె (కవిత)

ఆమె -సాహితి అతడి ధైర్యం నిజం. ఎంత ఎండకైనా మాడిపోడు. మసిలి మసిలి సహనంగా ఆవిరౌతాడు. ప్రేమతో మేఘమై పుట్టి మళ్ళీ కురుస్తాడు పగలు రేయి కుండపోతగా. పచ్చిక ఒడిలో మంచు బిందువులో ఒదిగిచూస్తాడు మొగ్గల బుగ్గ చాటున తొంగిచూస్తాడు. అతని నిజం ధైర్యం. ఆమె కురుల పరుపు కోరి కునుకు తీస్తాడు. ఆమె కనుల చాటుగా దూరి కలను దోస్తాడు. ఆమె కలల కౌగిట చేరి కలుసుకుంటాడు. అతడి నిజం ధైర్యం ఆమే. ***** ఆర్ట్: […]

Continue Reading
Posted On :

అష్టభుజి (కవిత)

అష్టభుజి -సుభాషిణి ప్రత్తిపాటి చించేసిందినా రాతల్ని కాదు..వేవేల నా భావాల్ని…ఎన్నో అంటని రెప్పల కాగడాలతో..నన్ను,నేనురగిలించుకుని…నిలుపుకున్న అస్తిత్వపు జాడల్ని!!వేకువకి మొలిచేవైతే…నా చేతులు తెగిపడేవే…ఇరు సంధ్యల మధ్య కడుపు నింపే…వంటలకవి అవసరం కనుకపాపం మిగిలాయవి…నాతో!!కాగితపు గీతలకు గిరి గీయగలవు కానీ…మరిగే మది తలపులనెలా….ఆపగలవు???ఎగిరే ఊహాల రెక్కలనెలాకట్టగలవు??అరచేతితో..అర్కుని ఆపగలవా…???జ్వలించే కవనోదయానికైఏదో ఓ ఉదయంనేను అష్టభుజిగా..అవతరిస్తాను.అక్షర సేవకై సరికొత్త అవతారికవ్రాసుకుంటా నా నవ జీవితానికి!! ***** ప్రత్తిపాటి సుభాషిణి -ప్రత్తిపాటి సుభాషిణి నివాసం బాపట్ల.  గత 20 సంవత్సరాల నుంచి తెలుగు ఉపాధ్యాయినిగా జిల్లా పరిషత్ ఉన్నత […]

Continue Reading

నిశిరాతిరి (కవిత)

నిశిరాతిరి – డా. కొండపల్లి నీహారిణి ఎక్కడినుండి రాలిందో ఓ చిమ్మచీకటి కుప్ప. ఎందుకు మౌనంవహించిందో మనసు కుండలో చేరి. ఒలకని మేధోమథనం ఒడవని బతుకుసమరం ఈ నిశిరాతిరి ఏ గుసగుసలుచేస్తున్నది? ఆకలి మంటలవికావు, అన్నపు రాసుల లేమివీకావు, ఒళ్ళు చిల్లుపడ్డ దాఖలాలూలేవు. మృత్యువు ధారాపాతనడకతో వీధుల్ని శవాలుగా ముంచెత్తుతూ ఈ నిశిరాతిరి ఏ గుసగుసలుచేస్తున్నది? సందులు గొందులు మూగవడినవి పనిముట్ల సందోహాలు మూలబడినవి చిక్కాలతో మూతులుముక్కులు ఆలింగనాలు లేని దూరాలవలెనేనన్న ఆనవాళ్ళ చిట్టాలిప్పలేకపోతున్నదంటూ… ఈ నిశిరాతిరి […]

Continue Reading

బాపట్ల నానీలు (కవిత)

బాపట్ల నానీలు – డా.సి.భవానీదేవి నీవాళ్ళు దూరమయ్యారా ? చింతించకు .. మేలు చేసుంటావు అందుకే ! అమ్మ.. నాన్న.. వెళ్లిపోయారు మట్టి మరోరూపందాల్చినా గుర్తించలేం  కదా.. శతాధిక నాటకాల పేటి కొర్రపాటి …. నాటక రచనలో ఘనాపాఠి ! సాహితీ రుద్రమ కప్పిన తొలిశాలువా నాకది బాధ్యతా పులకరింత ! బతుకంతా  నడకైనా కాళ్ళనెప్పుల్లేవు ఆరిపాదాలకు మా ఊరిమట్టి ! కిలో బియ్యం లీటర్ కిరోసిన్ కోసం రోజంతా క్యూలో … తుఫాన్ కు అంతా […]

Continue Reading
Posted On :

నవవాక్యం (కవిత)

నవవాక్యం -గిరి ప్రసాద్ చెల మల్లు అక్కడో పరువుతండ్లాడుతుంది గోబ్యాక్ నినాదాల వెనుక మర్మం జగద్విదితం  కులం గొంతుఆఖరిచూపునిచిదిమేసింది బిడ్డ భర్త హత్యలోప్రేమపర్వం తెరలుతెరలుగా సమాజగోడలపై చిత్రించబడుతుంది  మానసికస్థైర్యానివ్వలేని కులంమనిషిని చంపినా చేవ తగ్గకరంకెలేస్తుంది  గొడ్డలి వేటులో ప్రాణం గిలగిలలాడుతుంటేహర్షాతిరేకాలతోవీధుల్లో పైశాచిక కులోన్మాదం  పరిణతి ఇరవైల్లోనేజవాబులకు రంగుల పులిమే పాత్రికీచకత్వం  ప్రేమ భాష్యం  మారుతుందోమార్చబడుతుందో పరువు పదంలో కొంగ్రొత్తగా చెక్కబడుతున్న శిల్పంప్రేమ సహచర్యాన్ని ఓర్వలేని కులంతెగనరికి ప్రేమంటుంటేశిలపై ఉలి మొరాయిస్తూసమ్మెటకే ఎదురుతిరిగి వెలివాడల్లో ప్రేమకోసం పరుగులెత్తుతుంటే అడుగుల్లో నవవాక్యం కనబడుతుంది ***** గిరి ప్రసాద్ చెలమల్లుపుట్టింది సూర్యాపేట. పెరిగింది నాగార్జున సాగర్. నాన్న గారి నుండి వామపక్ష భావజాలం పొందాను. విద్యార్థి […]

Continue Reading

తొలకరిజల్లుతో చెరువు (కవిత)

 తొలకరిజల్లుతో చెరువు -సుగుణ మద్దిరెడ్డి పాడి పశువులకు గడ్డి మేత లందించు పచ్చని పచ్చిక బీళ్లు!  చెరువులో చెట్ల మధ్యన ఆడిన  దాగుడు మూతలజోరు! పేడ ముద్దలు ఏరి సేకరించిన పిడకలకుప్పలెన్నో! ఎంత గిల్లినా తరగని పొనగంటాకు దిబ్బ లెన్నో!  చెరువునిండాక నీటి కోళ్ల  తల మునకలు రెక్కలు ఇదిలించే నీటి తుంపరలు నీటి పాముల  సొగసైన ఈతలు! చెరువుగట్టు అడుగున ఎండ్రకాయ బొక్కలుజూసి వాటిలో పుల్లలతో కలబెట్టి అవి బొక్కనుంచి బయటకొస్తే ఆనంద డోలికలూగినవేళ! ఆవులు, […]

Continue Reading

అన్నిటా సగం (కవిత)

 అన్నిటా సగం -చెరువు శివరామకృష్ణ శాస్త్రి నీవో సగం, నేనో సగం ఆకాశంలో, అవనిలో అన్నిటా మనం చెరి సగమంటూ తాయిలాల మాటలతో అనాదిగా మీరంటున్న సగానికే కాదు అసలు మా అస్తిత్వానికే సవాలుగా మిగిలిపోయాము అబలలమై! నిన్ను అన్నగా, నాన్నగా, తాతగా, మామయ్యగా, బావగా తలచి చెల్లినై, కూతురినై, మనుమరాలిగా, కోడలిగా, ముద్దుల మరదలిగా బహురూపాలుగా విస్తరించి ప్రేమను, కరుణను పంచగల మహోత్తుంగ జలపాతాన్ని నేను! సంపాదనలో నీ కన్నా మెరుగ్గా ఆర్జిస్తూ నీతో బాటు […]

Continue Reading

స్వప్న వీధిలో… (కవిత)

స్వప్న వీధిలో… -డి.నాగజ్యోతిశేఖర్ రోజూ రెప్పలతలుపులు మూయగానే … నిద్రచీకటిలో గుప్పున వెలుగుతుందో నక్షత్రమండలం! కలతకృష్ణబిలాల్ని కలల లతల్లో చుట్టేసి… దిగులు దిగుడుబావిని దిండుకింద పూడ్చేసి ఒళ్లు విరుచుకుంటుందో వర్ణప్రపంచం! ఊహాల్ని శ్వాసల్లో నింపి… ఊసుల్ని పూలలోయల్లో  ఒంపి… మనస్సు మూట విప్పుతుందో వినువీధి! ఆ వీధి మధ్యలో పచ్చటి చెట్టయి నవ్వుతుంటుంది నా మస్తిష్కం.! ఆ సందు చివర కురులారాబోసుకుంటుంది నా నవ్వుల వెన్నెల కెరటం! నడి వీధిలో నవ్వేెంటనే ఆధిపత్యపు స్వరాలు లేవు! ఆకాశపు అంచుల్లో నువ్వేెంటనే అమావాస్యపు […]

Continue Reading

మెరుస్తోన్న కలలు (కవితలు)

మెరుస్తోన్న కలలు – శాంతి కృష్ణ రేయంతా తెరలు తెరలుగా  కమ్మిన కలలు కను రెప్పలపై హిందోళం పాడుతున్నాయి…. నీ రాకను ఆస్వాదించిన గాలి  తన మేనికి ఎన్ని గంధాలు అలదుకుందో…. మగతలోనూ ఆ పరిమళం నన్ను మధురంగా తాకిన భావన… ఓయ్ వింటున్నావా…. ఒక్కో చినుకు సంపెంగలపై  జారుతున్న ఆ చప్పుడును…. ఇప్పుడు నా కలలకు నేపధ్య సంగీతమవే… వర్షం ఇష్టమని చెప్పిన సాక్ష్యంలా నీతో పాటు ఇలా ప్రతిరేయి పలుకరించే చిరుజల్లుకి… ఋతువులతో పని […]

Continue Reading
Posted On :