ముసలివాడు-సీతాకోక చిలుక(కవిత)

ముసలి వాడు-సీతాకోక చిలుక(కవిత)              – పాలపర్తి ఇంద్రాణి ముసలి వాడొకడు వణుకుతున్న చేతులతో  గాజు జాడీ పైన రంగురంగు పూలు చిత్రించినాడు.  పుట్ట తేనె తీసుకుని అక్కడక్కడ చిలకరించినాడు.   రంగు పూల గాజు జాడీని తన తోటలోన ఉంచినాడు. సీతాకోక చిలకలకై వేచి చూస్తూ నిలచినాడు.   ముసిలివాడు ఒకప్పుడు సీతాకోకల వేటగాడు.  కానీ ఇప్పుడు సత్తువ ఉడిగి అలసినాడు.  పరుగెత్తలేక ఆగినాడు.    తనంత తానుగా సీతాకోక చిలుక వచ్చి వాలేలా  ఉచ్చులల్లి పెట్టడం ఆరంభించి ఆరితేరినాడు.  […]

Continue Reading

గీత శ్రావణం, సంగీతం (కవితలు)

గీత శ్రావణం, సంగీతం (కవితలు) -నాగరాజు రామస్వామి   గీత శ్రావణం   ఉదయాకాశం తడి తడిగా నన్ను పెనవేసుకున్నప్పుడల్లా రాత్రంతా నానిన అక్షరం నాలో మొలకెత్తి గొంతెత్తుతుంటుంది. చీకటి దైన్యానికి ద్రవించిన సూర్యుడు తడి పదాలై బొట్లు బొట్లుగా రాలుతుంటాడు నా చిరు చీకటి చూరు లోంచి. శ్రావణం అంటే ఎంత ఇష్టమో నాకు! ముసురు ముసుగుల వెనుక సప్త వర్ణాలను పాడుకుంటూ వేకువ! ఏడు రాగాలను విచ్చుకుంటూ ఇంద్రచాపం! చీకటి బతుకులలో కిరణమై నదించాలని తొందరిస్తున్న తొలిపొద్దు […]

Continue Reading

   ఆప్షన్(కవిత)

ఆప్షన్   –శిలాలోలిత మనం వింటున్న దేమిటి? మనం చూస్తున్న దేమిటి? మనుషులెందుకింత క్రూరంగా వుంటున్నారు? అసలు మనుషులెందుకు తాగుతున్నారు? తాగనిదే వూరుకోమన్న  రాజ్యం కోసమా? శ్రమను మర్చిపోతున్నానని ఒకరు బాధని మర్చిపోవడానికని ఇంకొకరు ఫ్యాషన్ కోసమని  ఒకరు కిక్ కోసమని ఇంకొకరు ఒళ్ళు బలిసి ఒకరు వెరైటీ బతుకు కోసం ఇంకొకరు అమ్మ,అమ్మమ్మ, పసిపాప నిద్దరోతున్నారట వాడి ఆప్షన్స్ లో పాప నెన్నుకున్నాడు ఏమిటి? ఏమిటి? ఏమిటిది? ఒళ్ళంతా గొంగళిపురుగులు చుట్టుకున్నట్లుంది వేలవేల పురుషాంగాలు నిగడదన్ని వున్నాయి […]

Continue Reading
Posted On :

 నాన్నని పోగొట్టుకుని ! (కవిత) 

    నాన్నని పోగొట్టుకుని !     – రేణుక అయోల     1 .  అస్తికలు బూడిద ఒడిలోకి తీసుకున్న గోదావరి –       ప్రవాహంలో నాన్న జీవితం –       పాదాలని కడుగుతూన్న గోదావరి       అలలకి నా దుఃఖం వో చినుకు      నది మెట్ల మీదనుంచి అడుగులు  వెన క్కివేయడం      ఒక దీర్ఘ జ్జాపకాన్ని మోయడం పల్చటి చలిలో      అగ్నిని  బొడ్డుకి చుట్టుకున్నట్టుగా ఉంది      నిన్నటి వరకు నీది  నాది ఒక పేగు బంధం      ఇప్పుడది ఎముకలు […]

Continue Reading
Posted On :

కాళీ పదములు       

కాళీ పదములు                                 -పాలపర్తి ఇంద్రాణి 1. ధూళి ధూసరితమైన  భూమి పైన్నుంచి లేచి హంసలా మబ్బులలో  ఎగురుతున్నాను సాటి రాయంచల  హొయలు చూచి  మైమరచానో మోహించానో ఆ వేల అడుగుల  ఎత్తునుంచి జారి పడబోయాను  అమ్మా,అమ్మా, అమ్మా,అమ్మా! అద్భుతమాశ్చర్యమానందం!  మూడు హస్తాలు  నిలువరించాయి నన్ను నువ్వు పంపిన పరమ గురువులు ముగ్గురు పక్షి పాదాల వారు కాంతి కమండలాల వారు గాలి బిరడాల వారు […]

Continue Reading