గజల్

-జ్యోతిర్మయి మళ్ళ

మౌనానికి మాటలనూ నేర్పిద్దాం కాస్త మనం
చీకటికీ చిరుకాంతిని అరువిద్దాం కాస్త మనం

కోకిలమ్మ పూలకొమ్మ కవులకెపుడు నేస్తాలు
కాకి కథను కూడ రాసి చూపిద్దాం కాస్త మనం

కులమతాలు పరపతులూ విభజించే జాడ్యాలు
నినదించే స్నేహగీతి వినిపిద్దాం కాస్త మనం

లోపలొకటి పైకొకటీ కాపట్యం మనకెందుకు
ముసుగులేని ముఖంతోటి కనిపిద్దాం కాస్త మనం

మేడలలో ప్రగతి జ్యోతి పూరిగుడిసె గతి చీకటి
మనుషులంత ఒకటికాద? యోచిద్దాం కాస్త మనం

***** 

Please follow and like us:
error

Leave a Reply

Your email address will not be published.