A Deep Sigh by Gurraam Jashua 

-Nauduri Murthy

Over the deep serene interior places of diamond-hard fortes

built by the Pride of Telugu, royal warrior Krishnaraya,

inhabit colonies of pregnant bats meditating upside-down!

What a pity! The glorious history looks hazy in the overcast.

Plantations of banana, jasmine patios, private rose gardens

Of Chinnadevi that bathed in crystalline waters… withered.

Fever nut, Datura, and Balsam shrubs shrouded Tungabhadra,

And the poetic graces of Mohanangi have lost their sheen.

In the aftermath of Nagamma’s vile pernicious warfare, the heroics

Of Palanadu had ceased, grass grows on the tiger-streaked throne,

But over the sheets of Naguleru water gold-washed by sunset

The lotus maids still compose the romances of Balachandra’s bravery.

దీర్ఘనిశ్వాసము

తెలుగుం బాసకు వన్నె దెచ్చిన జగద్వీరుండు మా కృష్ణరా

యలు గట్టించిన వజ్రదుర్గముల, శుద్ధాంత ప్రదేశంబులన్ 

దలక్రిందై, తపమాచరించెడిని సంతానార్థలై, గబ్బిగ

బ్బిలపుం గుబ్బెత లక్కటా మొయిలుగప్పెం బూర్వమర్యాదకున్.

పన్నీటన్ దలసూపి కాపుగొను రంభా మల్లికావాటికల్

జిన్నాదేవి గులాబి తోటలు నశించె; న్గచ్చ, లుమ్మెత్తలున్,

గన్నేరుం బొద లావరించినవి రంగత్తుంగభద్రానదిన్,

బన్నుండె న్మనమోహనాంగి కవితాప్రాగల్భ్య సౌరభ్యముల్.

నాయకురాలి మాయకదనంబున మా పలనాటి పౌరుష

శ్రీయడుగంటె, గడ్డిమొలిచెం బులిచారల గద్దెమీద, గెం

జాయ మొగాన గ్రమ్మ జలజప్రమదామణి నాగులేటిపై

వ్రాయుచునున్న దిప్పటికి, బాలుని శౌర్య కథాప్రబంధముల్.

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.