మరొకరుండరు

-చందలూరి నారాయణరావు

నీకై పుట్టిన పదాలు
నోరు విప్పి
నీ పెదాల వాకిట
ఓ మాటను జంట చేయమని పడికాపులు కాస్తుంటే….

కళ్ళ ముందే
అర్థాలు గెంటివేయబడి
కన్న కలే
మనసును చిదుముతుంటే..

ఊపిరనుకున్న
ఆ ఒక్కరు
ఊరకుండిపోతే ?

ఒకరికి చెప్పితే
మరొకరు తీర్చిది కాదు
ఆ బాధ.

ఒకరు కాదంటే
మరొకరి ఇచ్చేది కాదు
ఆ ప్రేమ

****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.