ప్రముఖ రచయిత్రి పి.సత్యవతి గారితో నెచ్చెలి ముఖాముఖి

-డా||కె.గీత 

పి.సత్యవతి 1940 జూలైలో గుంటూరు జిల్లా, కొలకలూరులో జన్మించారు. ఆంధ్ర విశ్వకళాపరిషత్ లో ఆంగ్ల సాహిత్యంలో పట్టభద్రులయ్యారు. విజయవాడ ఎస్.ఎ.ఎస్.కళాశాలలో ఆంగ్ల అధ్యాపకురాలుగా పనిచేసి పదవీ విరమణ చేశారు. కథాప్రక్రియలో ఎంతో కృషి చేశారు. స్త్రీ జీవితాన్ని విభిన్న కోణాల్లో స్పృశించడం ద్వారా పాఠకులకు, ఆలోచనాపరులకు కొత్తకొత్త ఆలోచనలు ఆవిష్కరింపజేసేలా యదార్థ గాథలు, వ్యదార్థ దృశ్యాలను అక్షరీకరించడం సత్యవతిగారికే చెల్లింది.

1995లో “ఇల్లలకగానే…“, 1998లో “సత్యవతి కథలు“, 2003లో “మంత్రనగరి, “మెలకువ” కథా సంపుటాలు, వ్యాస సంకలనం “రాగం భూపాలం” వెలువరించారు. 2016 లో విశాలాంధ్ర పబ్లిషర్స్ 40 కథలతో వీరి కథా సంకలనం ప్రచురించింది.

కథల జాబితా:

ఆదివారం కోసం
ఎర్రంచు సిల్కుచీర
చిరుగాలి
పగిలిన గాజుకప్పు
ఇంటిదీపం
తొణికిన స్వప్నం
నిధి చాలా సుఖమా?
సరిగంచు పరికిణీ
మనలో మాట
పద్మవ్యూహం
కింకర్తవ్యం
భూపాలరాగం
దొంగ
మర్రినీడ
నిజాయితీ
సుడిగాలి
గ్లాసుపగిలింది
మాఘసూర్యకాంతి
పునాది
జబ్బు
ఓ రాజ్యంకథ
సెభాష్…
డాటర్స్ ఆఫ్ ఇండియా
టు హిమ్ విత్ లవ్
సరళరేఖ
డామిట్
మరో మామూలు కథ
రత్నపాప
కన్నతల్లీ-నిన్నుకడుపులో దాచుకోనా…
ఆకాశంబున నుండి
తాయిలం
గోవు
ఇల్లలకగానే
ఇందిర
ముసుగు
చీమ
భద్రత
గణితం
నూనె గానుగ
దేవుడు
గాంధారి రాగం
అరుణ సంధ్య
వెంకటేశ్వర్లు వెళ్ళిపోయాడు
పెళ్లిప్రయాణం
బదిలీ
పహరా
గోధూళివేళ
తిమింగల స్వర్గం
శుక్రవారం
ఎచటికి పోతావు రాత్రి
నటనలు చాలునువే
మంత్రనగరి
భక్తి-రక్తి
ఒక వసుంధర
ఆజాదీ
భాగం
ఆత్మలు వాలిన చెట్టు
ఒక రాణీ ఒక రాజా
నేనొస్తున్నాను
నాలుగు దృశ్యాలు
నాన్న
మూడేళ్ల ముచ్చట
పిల్లాడొస్తాడా
పేరులేనిపీల్ల
దమయంతి కూతురు
ఇట్లు మీ ‌స్వర్ణ
శ్రీరామా ఎంక్లేవ్
సమీకరణాలు
అమ్మవడి
నవలలు
పడుచుదనం రైలుబండి
గొడుగు
ఆ తప్పు నీది కాదు
పురస్కారాలు
1997: చాసో స్ఫూర్తి పురస్కారం
1997: కొండేపూడి శ్రీనివాసరావు పురస్కారం
2002: రంగవల్లి జీవిత సాఫల్య పురస్కారం
2002: తెలుగు యునివర్సిటీ ఉత్తమ కతాపురస్కారం
2008: యగళ్ల ఫౌండేషన్ అవార్డు
2012: సుశీలా నారాయణ రెడ్డి పురస్కారం
2012: మల్లెమాల సాహిత్య పురస్కారం
2012: గురజాడ పురస్కారం ( సంస్కృతి సంస్థ గుంటూరు)
2014: డా. బోయి భీమన్న ఉత్తమ రచయిత్రి పురస్కారం 
2014: పెద్దిభొట్ల సుబ్బరామయ్య పురస్కారం
2015: మాలతిచందూర్ పురస్కారం
2016: తురగా జానకీరాణి పురస్కారం
2017: తానా పురస్కారం
2017లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చే కళారత్న పురస్కారం
2019లో కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద పురస్కారం 

*****

(ప్రముఖ రచయిత్రి పి.సత్యవతి గారితో నెచ్చెలి ప్రత్యేక ముఖాముఖి వీడియోని పైన ఇస్తున్నాం. 
చూసి, మీ అభిప్రాయాలు తప్పక తెలియజెయ్యండి.)

 

 

*****

Please follow and like us:

One thought on “ప్రముఖ రచయిత్రి పి.సత్యవతి గారితో నెచ్చెలి ముఖాముఖి”

  1. చాలా బావుందండి ఇంటర్వ్యూ. సత్యవతి గారి మాటలు ఎంతో శ్రధ్ధగా ఆలకింపచేసాయి. రచయిత్రి గురించి చాలా ఆసక్తికరమైన విషయాలు తెలిసాయి. బాల్యం నాటి సంగతులు భలే వున్నాయి. లైబ్రరీ కెళ్ళడం అప్పట్లో ఎంత గొప్ప మంచి అలవాటో!
    సత్యవతి గారి అమ్మ గారు కూడా మంచి చదువరి కావడం ఒక పెద్ద ప్లస్ పాయింట్.
    అభినందనలు మీ ఇరువురికీ.. ___/\___

Leave a Reply

Your email address will not be published.