కాసింత ఉపశమనం (కవిత)

-గవిడి శ్రీనివాస్

అలసిన దేహంతో

మేలుకుని ఉన్న రాత్రి

తెల్లారే  రెప్పలు  వాల్చి

నవ్వులు  పూసిన  తోటలో

ఉపశమనం పొందుతుంది .

మబ్బులు ఊగుతూ

చెట్లు వేలాడుతూ

పూవులు ముద్దాడుతుంటాయి .

కొన్ని క్షణాలు

ప్రాణాలు అలా లేచి

పరిమళం లోకి  జారుకుంటాయి .

గాలి రువ్విన బతుకుల్లో

చీకటి దీపాలు వొణుకుతుంటాయి .

ఏదీ అర్ధం కాదు

బతుకు రెక్కల మీద

భ్రమణాలు జరుగుతుంటాయి .

నేటి దృశ్యం

రేపటి ఓ జ్ఞాపకం అవుతుంది .

వర్తమానాన్ని మోస్తూ

కాసిన్ని సంతోషాల్ని ఆస్వాదిస్తూ

విసిగిన  క్షణాలు

కాసింత ఉపశమనం పొందుతాయి .

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.