జీవితమే నవీనం

అనుభవాలు -జ్ఞాపకాలు-12

-వెనిగళ్ళ కోమల

డి. ఆంజనేయులు

డి. ఆంజనేయులు ఇన్నయ్యకు చిరకాల మిత్రులు. తెలుగు, ఇంగ్లీషు భాషల మీద మంచి పట్టుగల రచయిత, జర్నలిస్టు, క్రిటిక్, పి.ఐ.బి.లో పనిచేశారు. మద్రాసులో నివాసం. పెద్ద గ్రంథాలయం ఏర్పరచుకున్నారు. 

ఆంజనేయులుగారి ఏకైక పుత్రిక శాంతిశ్రీ చిన్నప్పటి నుండి నవీన, రాజుతో మంచి స్నేహితురాలుగా మెలుగుతూ వచ్చింది. ఇప్పడు పూనా యూనివర్సిటీలో పొలిటికల్ సైన్స్ ప్రొఫెసరు. తెలుగు, తమిళ, మరాఠీ, ఇంగ్లీషు అనర్గళంగా మాట్లాడుతుంది. మంచి వక్త.

శాంతిశ్రీ నిరంజన్ పండిట్ ను వివాహమాడింది. అతను అమెరికాలో ఉద్యోగం చేయటం వలన శాంతిశ్రీ తరచు అమెరికా రావటంతో తనను నవీన యింట్లో కలవగలుగుతున్నాము. వాళ్ళమ్మాయి శృతి దుబాయి (పిలాని)లో బి.టెక్. చదువుతున్నది. బిడ్డ చదువయి పోగానే తనూ రిటైర్ మెంటుకు పెట్టుకుని అమెరికా నిరంజన్ వద్దకు వచ్చే ఏర్పాటు చేస్తున్నది శాంతిశ్రీ. తండ్రి తదుపరి ఆయన లైబ్రరీని యథాతథంగా పూనాకు మార్చి శ్రద్ధ చూపుతున్నది. 

జస్టిస్ ఆమంచర్ల గంగాధర రావు కమలగారికీ, ఇన్నయ్యకూ మంచి మిత్రులు. జడ్జిననే భేషజం లేకుండా వీలున్నప్పుడు ఇంటికి వచ్చి అనేక విషయాలు ముచ్చటించేవారు. ఇన్నయ్యతో క్లబ్ కు వెళ్ళి రిలాక్స్ అయ్యేవారు. ప్రస్తుతం అనారోగ్యరీత్యా ఇంటికే పరిమితమవుతున్నారు.

మల్లాది రామమూర్తి, సుబ్బమ్మ సమాజ సేవకు అంకితమైన దంపతులు. వికాసం పత్రిక నడిపారు. స్త్రీల సమస్యలపట్ల సుబ్బమ్మకు అవగాహన కలిపించి సేవకు ఉపక్రమింపజేశారు. వినముచ్చటగా మాట్లాడేవాడాయన. ఆయన తరువాత గూడా వయసు ఆరోగ్యం సహకరించకపోయినా ఇంకా ఇంకా ఏదో చేయాలని సుబ్బమ్మ ఇప్పటికీ తాపత్రయపడుతున్నది. 

విద్యారంగంలోని ప్రొ. శేషాద్రి అయ్యంగార్, ప్రొ. బి.ఎ.వి.శర్మ – నాగరత్న శర్మ, ప్రొ. విల్ సన్, ప్రొ. ఎన్. యాదగిరి రెడ్డి, ప్రొఫెసర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్  మిత్రులుగా కొనసాగారు.

శ్రీనార్ల, పర్వతనేని కోటేశ్వరరావుగారి గురించి ముందే ప్రస్తావించాను. 

గౌతు లచ్చన్న, భవనం వెంకట్రామ్, చనుమోలు వెంకటరావు, పాలడుగు వెంకట రావు – సుశీల దగ్గరవారయ్యారు. వెనిగళ్ళ వెంకటరత్నం, సి.భాస్కరరావు – రమణ బాగా సన్నిహితులు. డి. శేషగిరిరావు, కోనేరు జనార్ధనరావు, అరిగెపూడి దిలీప్. ఆషా, గుళ్ళపల్లి జయరాం – జయప్రద, గుత్తికొండ శివనాగేశ్వరరావు, జయ, సి. నరసింహారావు, జ్యోతి, తుమ్మల గోపాలరావు – లలిత, మంచు మోహన్ బాబు కుటుంబం, కె.బి.కె. సత్యనారాయణ కుటుంబం, అశ్వనీకుమార్ – జయంతి కుటుంబ మిత్రులుగా నిలిచారు. తాళ్ళూరి నాగేశ్వరరావు కథా రచయిత – అప్పు చేస్తేనే ఎదగగలం అని ఇన్నయ్యతో అంటుంటే అప్పంటే నాకు గిట్టదు అనేవాడు ఇన్నయ్య.

జ్ఞానం నాయుడు కమలగారికి, ఇన్నయ్యకు బాగా దగ్గర స్నేహితురాలు, చక్కని రూపం, మాటకారితనం, సమర్ధత ఆమె ప్రత్యేకతలు.

రాడికల్ హ్యూమనిస్టులు, సెక్యులరిస్టులు, రేషనలిస్టులూ ఇన్నయ్య ఏర్పరచిన సభలు, సమావేశాల వలన పరిచయమైనవారు. 

రావిపూడి వెంకటాద్రి, సి. రాజారెడ్డి, పోలు సత్యనారాయణ, జస్టిస్ వి.యం. తార్కుండే,  ప్రొ.ఎ.బి.షా, వి.బి.కార్నిక్, మణిబెన్ కారా, డా. ఇందుమతి పరేఖ్, గౌరీమాలిక్ బజాజ్, రాణె, ఎం. బసవపున్నారావు, అంచా బాబారావు, సి.ఎల్.యన్. గాంధీ, రాధాగాంధీ, సిద్ధార్ధ్ బక్ష్ – డా. విజయా బక్ష్, గుమ్మా వీరన్న, చంద్రశేఖరరావు మొదలైనవారు.

అందరూ వారి వీలును బట్టి మా యింటికి వచ్చిన వారే. వారి అభిరుచుల్ని బట్టి సంభాషణ సాగేది. సత్కాలక్షేపం అయ్యేది. అందరి స్నేహమాధుర్యాన్ని చవిచూశాము.

కొద్ది కాలమే పరిచయమైనా మా మీద చెరగని ముద్ర వేశారు వీరమాచినేని సరోజిని.

వకుళకాజ అవర్ ప్లేస్ రెస్టారెంట్ భాగుస్వామి. అక్కడ తినటానికి వెళ్ళినప్పుడు పరిచయమైనది. రాకపోకలతో నాకు పెద్దబిడ్డగా దగ్గరయింది. స్నేహకాలం పరిమితమైనా అవ్యాజ ప్రేమనందించింది. 

డా. సుభాష్, డా. అరుణ మా ఆరోగ్యాలు కాపాడటమే గాక, మంచి స్నేహితులుగా మమ్మల్ని ఆదరించుతున్నారు.

గ్లోబల్ హాస్పిటల్ డా. రవీంద్రనాథ్ – ఆదిలక్ష్మి కొద్దికాలం మా పొరుగున ఉండి ఎంతో ఆప్యాయతను పంచారు. డా. టి.వి.కృష్ణారావు, డా.కె.కృష్ణయ్య, స్నేహమయ్యారు, వైద్యం అందించారు. 

రత్నకిషోర్, అన్నపూర్ణ, నిమ్మగడ్డ ఉష, సుబ్బారావు మరచిపోదామన్నా వీలుకాని గొప్ప స్నేహభావాన్ని అందించారు. దుక్కిపాటి రత్నకిషోర్ ని ఈ పని మీవల్ల కావాలి అని అడిగిన వెంటనే స్పందిస్తారు సాయంపడతారు.  అట్లూరి తారాదత్తు స్నేహాన్ని పెంచిన ఆత్మీయురాలు. 

*****

(ఇంకా ఉంది)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.