నిర్గమించిన కలలు (కవిత)

-సుజాత.పి.వి.ఎల్

నిరీక్షణలో నిర్గమించి..
కలలు మరచి
కలత నిదురలో
కలవరపడుతున్న కనులు 
బలవంతంగా రెప్పలు వాల్చుతున్నాయి..
ముళ్ళతో ముడిపడిన నా జీవితం..
ఖరీదైన కలలు కనే సాహసం చేయగలదా!?
సంతోషాలన్నీ
నీతో పాటే రెక్కలొచ్చిన పక్షుల్లా ఎగిరిపోతే..
పెదవులపై చిరుదరహాస దివిటీని 
వెలిగిచడం ఎలా!?
నా కళ్ళలో కన్నీటి చారికలు 
కనిపించకూడదన్నావు..
నువ్వే కనిపించనంత దూరాన దాగున్నావు..
నీవు లేని భూతలం
నాకు శూన్యాకాశమని మరిచావు..
అందుకే..
నిన్ను చేరలేని దూరాన్ని తుడిచేస్తూ
కళ్ళమాటు దాగిన జ్ఞాపకాల ఆణిముత్యాల తలపులను
ఆఖరిసారిగా తిరగేస్తున్నాయి అరమోడ్పు కనులు..!
 

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.