A Sigh From the Heart of a Poet

-English Translation: Nauduri Murthy

-Telugu Original: “Kavi Mitrudi madi Urupu” by Srinivas Vasudev

I have a song in my veins,

Still

Looking for a singer.

I have a lyre, devoid of strings,

Searching for a musician.

Have a story of melancholy

Yet to find a listener

I’m choking with a deluge of words

Struggling to become poetry!

My world is full of hope

Nevertheless,

Plethora of doubts flow in and out….

I’m still to find an address

That can promise me of veracity.

Have a heart, full of emptiness

Waiting to be filled in with compassion

All the shards of Time

Arranged for a tale of past

Yet to knead them into a story of sublime

I have letters and words as my confrères

Yet to culminate into words of consolation

Words of consolation….

కవిమిత్రుడి మది ఊరుపు…

నా నరాల్లో సంగీతం ఉరకలెత్తుతోంది

అయినా, సరియైన స్వరం అందడం లేదు.

నా దగ్గర తీగతెగిన వీణియ ఉంది

దాన్ని సరిచేసి శృతిచేయగల వైణికుడు కనిపించడంలేదు.

విషాదభరితమైన గాథ ఉంది చెప్పడానికి

కాని చెవిఒగ్గివినే శ్రోతే కరువైపోయాడు.

పదాల ప్రవాహంతో గొంతు ఉక్కిరిబిక్కిరి అవుతోంది

రసావిష్కారమై పొరలే తీరు మాత్రం కనిపించడం లేదు.

నా విశ్వాసాల ప్రపంచం దిగంతాలకి  వ్యాపించి ఉంది

అయినా అప్పుడప్పుడు సందేహాలు తలెత్తుతూనే ఉన్నాయి

నా దగ్గర ఎన్నో చిరునామాలున్నా

సత్యాన్ని ఆవిష్కరించగల గడప కనిపించడం లేదు.

నా మనసంతా శూన్యం ఆవరించి ఉంది

దాన్ని అనుకంపతో నింపడానికి అనువుగా.

కాలశకలాలని ఏర్చికూర్చాను, గతచరిత్రని కథనం చేద్దామని,

ఎంతప్రయత్నించినా అవి ఉదాత్తమైన చరిత్రగా మలచబడటం లేదు.

నా చుట్టూ వర్ణమాలవంటి సుందర స్నేహ వదనాలున్నాయి

కానీ  ఏదీ ఓదార్చగల పదంగానీ,  

సాంత్వననివ్వగల మాటగానీ పలకడం లేదింకా…

పలకడం లేదింకా…

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.