ఏనుగు నిర్ణయం

-కందేపి రాణి ప్రసాద్

అదొక దేవాలయం ఆ దేవాలయం ఎప్పుడూ భక్తుల రాకపోకలతో కిటకిటలాడు తూ ఉంటుంది. ఆలయం ముందు పూలు, పళ్ళు, కొబ్బరి కాయలు అమ్మే వాళ్ళు తమ బండ్లను పెట్టుకొని వ్యాపారం చేస్తుంటారు. అడుక్కునే బిచ్చగాల్లంత ఆలయ ప్రధాన ద్వారానికి రెండు వైపులా కూర్చొని యాచిస్తుంటారు. అలాగే గుడి ముందు ఒక పక్కగా ఉన్న మంటపం దగ్గర ఒక ఏనుగు చిన్న గొలుసుతో కట్టి వేయబడి ఉంటుంది. దానికి పక్కగా ఒక మావటివాడు ఉంటాడు. ఆలయంలో దేవుడిని దర్శించుకున్న తర్వాత భక్తులు ఏనుగు వద్దకు వస్తారు. గరిక కట్టలు, అరటి పండ్లు, చెరుకు ముక్కలు తీసుకొచ్చి ఏనుగుకిస్తారు. అవన్నీ మావటివాడు తీసుకొని “అమ్మా! డబ్బులు ఇవ్వండి. ఏనుగు తొండంతో ఆశీర్వాదం ఇస్తుంది”. అని చెప్తాడు. భక్తులు రూపాయి తిసి చేతిలో పట్టుకుంటే ఏనుగు తొండంతో ఆ రూపాయి బిళ్ళ తీసుకొని మావటివాడికిస్తోంది. ఆ తర్వాత తొండం ఎత్తి భక్తులను ఆశిర్వదిస్తుంది. మావటివాడు మాత్రం భక్తులిచ్చిన ఆహార్యాన్నంతా దాచిక్పెట్టి కొంచెం కొంచెంగా ఏనుగుకు పెడతాడు. ఏనుగుతో తాను లభాపడతాడు తప్ప ఏనుగు కడుపు నింపాలని చూడడు. ఏనుగు ఎప్పుడూ అర్థకలితో ఉంటుంది పాపం. అయినా మావటివాణ్ణి వదిలి వెళ్ళడానికి ఎప్పుడూ ప్రయత్నించలేదు ఏనుగు.
ఆ ఎదురుగా ఉన్న చెట్లపై కొన్ని కోతులు నివసిస్తుంటాయి. అవి కూడా భక్తులు తెచ్చే ఆహారపదార్థాలు తినే జీవనం సాగిస్తుంటాయి. కోతులు భక్తులు తమకు ఆహారం పెట్టేదాకా ఆగవు. వాళ్ళ చేతుల్లోని అరటి పండ్లు, కొబ్బరి చిప్పలు, ప్రసాదాలు లాక్కుని తినేస్తుంటాయి. అందుకే భక్తులు కోతులకు కనబడకుండా కవర్లలో వేసుకొని వెళుతుంటారు. మన కోతులు ఏమైనా తెలివి తక్కువయా! కవర్లకు కవర్లే వాళ్ళ దగ్గర లాగేసుకొని ప్రహరి గోడపై పెట్టుకొని కావల్సినవి తీసేసి చెత్తంతా ఎక్కడిదక్కడ పడేసి వెళ్ళిపోతాయి. ఇది కోతుల దౌర్జన్యం.
ఒక రోజు ఒక కోతి ఏనుగుని చూసి ఇలా అడిగింది. నువ్వు ఎందుకు ఈ మావటివాడి వద్ద బందీగా పది ఉన్నావు? వాడేమో నీ కడుపు మాడుస్తాడు. నీకు తిండి పెట్టడు. భక్తులు ఇచ్చే ఆహారం కూడా నిన్ను తిననివ్వడు. నువ్వు గొలుసు తెంపేసుకోని అడవిలోకి పారిపోవచ్చు కదా! అక్కడ నీకిష్టమైనవన్ని నీకు నచ్చినట్లు తినవచ్చు. ఇంకా అడవి అంతా స్వేచ్చగా తిరగచ్చు. చెరువుల్లో, నదుల్లో ఎంత సేపైనా జలకాలాడవచ్చు. నీటిలో ఆటలంటే నీకిష్టం కదా! పోనీ అలా అడవికి వెళ్ళడం ఇష్టం లేకపోయినా మావటివాడి దగ్గర నుంచి ఆహారం లాగేసుకోవచ్చు కదా! వాడేమైనా బలవంతుడా! నీ ధాటికి సింహం కూడా ఎదురు నిలవలేదు. ఎందుకని అల్త మౌనంగా అన్ని భరిస్తున్నావు.
దానికి సమాధానంగా ఏనుగు ఇలా చెప్పింది. నిజమే మిత్రమా! నువ్వు చెప్పినట్లు మావటివాడు మోసగాడే. సరైన తిండి పెట్టకుండా నన్ను మాడుస్తున్నాడు. నేను గొలుసు తెంచుకొని పారి పోవాలంటే ఎంత సేక్పు పడుతుంది. మావటివాడి దగ్గర నుంచి ఆహారం లాక్కోవాలన్న ఎంత పని. కానీ నేను మాటకు కట్టుబడి ఉన్నాను. నీతికి, నిజాయితీకి నిదర్శనంగా ఉన్నాను. నా వల్ల మావటివాడి కుటుంబం అంత బతుకుతోంది. వాళ్ళు నామీదే ఆధార పది బతుకుతున్నారు. నేను అడవిలోకి పారిపోతే వాడి కుటుంబం రోడ్డు మీద పడుతుంది. ఇంకా రోజు భక్తులు ఎంతో భక్తితో నా దగ్గరకు వస్తారు. నా ఆశీర్వాదం తీసుకుంటారు. వాళ్ళు భక్తితో పండ్లు, గరిక తెచ్చిస్తారు. వారు ఇచ్చినపుడు స్వీకరించాలి గానీ బలవంతంగా భక్తుల దగ్గర నుంచి లాక్కో కూడదు అని నేను నిర్ణయించుకున్నాను. పిల్లా పాపలతో ఎన్నో కుటుంబాలు వచ్చి దేవుడితో సమానంగా నాకు నమస్కరిస్తారు. ఇంతటి ఆనందం అడవిలో దొరుకుతుందా! కేవలం నా కడుపు నిండడం కోసం ఇంత ఆనందాన్ని కోల్పోదల్చుకోలేదు. మరొక విషయం ఏమంటే పర్వదినాల సమయంలో గుడిలోని స్వామి వారిని నాపై ఎక్కించి ఊరేగిస్తారు. ఆ సమయంలో నన్ను కూడా సర్వాంగ సుందరంగా అలంకరిస్తారు. స్వామిని మోసే క్పల్లకిగా నేను మారుతున్ననంటే దానిని మించిన సంతోషం కలదా ఈ లోకంలో. కొన్ని వేల లక్షల మంది, ఉత్సవాల సమయంలో దేవాలయానికి వస్తారు. అన్ని లక్షల మంది భక్తుల మధ్య నేను స్వామి వారిని నాపై ఎక్కించుకుని తిరుగుతుంటే, వారంతా భక్తి పారవశ్యంతో దండాలు పెడుతుంటే నా జన్మ ధన్యమైనట్లు గా భావిస్తాను నేను. ఈ ఆనందంలో కొంత స్వేచ్చను కోల్పోయినా నేనేమి బాధపడటం లేదు. ఇక ఆహారం విషయం అంటావా? అడవిలో కూడా ఎండాకాలంలో ఆహారం కోసం చాల దూరం తిరగాల్సి వస్తుంది కదా! అంతే కాకుండా పులులు, సింహాలు ఎప్పుడూ దాడి చేస్తాయో అని అనుక్షణం అప్రమత్తంగా ఉండాలి. ఇక్కడ పూర్తిగా కడుపు నిండక పోయిన ఎక్కువగా బాధపడను.ఆలయానికి వచ్చే భక్తుల్ని చూస్తూ వారిని ఆశీర్వదిస్తూ సంతోషంతో కడుపు నింపుకుంటాను. ఏదైనా ఒకటి కావాలంటే మరొకటి కోల్పోవాలి అదే జీవితం.
ఏనుగు మాటలు విన్న కోతి ఆనందంగా చప్పట్లు కొట్టింది అందుకే “ఏనుగు బతికినా వెయ్యే, చచ్చినా వెయ్యే” అని మానవులు అంటారు. మానవులు నీకు అత్యంత ఉన్నత స్థానాన్ని ఇచ్చారు. ఆ స్థానాన్ని నిలబెట్టుకునే క్రమంలో కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు తప్పవు. విషయాన్నీ చక్కగా విశదీకరించావు మిత్రమా శెలవు” అంటూ కోతి వెళ్ళిపోయింది.

    *****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.