చిత్రం-40

-గణేశ్వరరావు 

 
          కొందరికి చనిపోయిన తర్వాత గుర్తింపు వస్తుంది, అమెరికన్ ఫోటోగ్రాఫర్ డీయన్ ఏర్బస్ (Diane Arbus) 1971లో ఆత్మహత్య చేసుకున్నాక గుర్తింపు పొందింది. ఆమె ధనిక కుటుంబంలో పుట్టింది, వాళ్ళు ఫాషన్ వస్తువులు అమ్మే వారు, అయినా ఆమె మాత్రం ఎటువంటి మేక్ అప్ వేసుకునేది కాదు, సెంట్ వాడేది కాదు, మెడలో ఒక కెమెరా మాత్రం వేలాడుతూ వుండేది. భర్త ఎలాన్ తో ఫాషన్ యాడ్స్ ఫోటోలు తీసేది. స్టూడియో పని విసుగెత్తి, ఔట్ డోర్ ఫోటోగ్రఫీ చేపట్టి పేరు తెచ్చుకుంది. మ్యూజియంలు ఆమె చిత్ర ప్రదర్శనలలో ఫొటోలను తేదీల వారీగా కాని, ఇతివృత్తం ఆధారంగా కాని పెట్టలేదు, చూపరులు ఒక్కొక్క ఫోటోను శ్రద్ధగా గమనించి వాటిలోని గొప్పతనాన్ని అర్థం చేసుకోవాలన్న మాట.
 
          సాహిత్యం విషయానికొస్తే కొడవటిగంటి రచనలను సంకలనం చేసిన కేతు విశ్వనాథ రెడ్డి, కొ కు ఇతివృత్తం చుట్టూ అల్లిన కథలతో 1980లో వాల్యూ ములు తీసుకొస్తే, తర్వాత కొ కు సంకలనాలను తీసుకొచ్చిన విరసం, కథల కాలక్రమాన్ని అనుసరించింది.
 
          ఆర్ట్ గ్యాలరీలలో క్యురేటర్ ల పధ్ధతి వేరే ఉంటుంది. 1950లలో 35mm ఫిలిం, చేతి కెమెరా, కంటి లెవెల్ లో కెమెరాలు ఉండేవి. వాటిని వాడేటప్పుడు – సన్ లైట్ ఫోటోతీసే వస్తువు మీద పడేలా చూసే వారు; ’60 లలో రో లీఫ్లెక్స్ తో గుండె లెవెల్లో ఉంచుకొని తీయడం, ఎ స్ ఎల్ ఆర్, క్లోజ్ అప్, జూమ్ లెన్స్, ట్రై పా ఢ్, ఫ్లాష్. వచ్చాయి..డీయన్ ఏర్బస్ యుగoలో డిజిటల్ లేదు. ఆమె తనకు అందుబాటులో ఉన్న వాటితోనే అద్భుతమైన ఫోటోలు తీసింది. ఆమెది ప్రత్యేకమైన అభిరుచి..అస్తమిస్తూన్న సూర్యుడిని, మబ్బుల లోంచి తొంగి చూసే సూర్యుడిని , డిస్నీల్యాండ్ లో యంత్రాల పక్క పడివున్న బండలనూ తీసేది.
 
          మన కందుకూరి రమేష్ – చిక్కడపల్లి లోని వాద్యగాడు, బేగం పేట ఎల్లమ్మ గుడి గోడల మీద బొమ్మలు వేసిన వాడి గురించో రాసినట్లు – ఆమె అతి సామాన్యులు ..అనామకులు అయిన ఒక మరుగుజ్జునూ, గుడ్డి బిచ్చగాడిని , కొత్త కోణాలలో చూపే ప్రయత్నం చేసేది. సెల్ఫీలకు అలవాటు పడ్డ ఈ నాటి జనం ఆమెను మెచ్చుకుంటారా అన్నది అనుమానమే!
*****
Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.