చిత్రం-43

-గణేశ్వరరావు 

 
 
మాఁలీ క్రేబ్ఏపిల్ కోపం, కసి నిండిన మహిళా చిత్రకారిణి. 19వ శతాబ్దపు ఉద్యమ చిత్రకారుల్లా తాను నమ్మిన విశ్వాసాలకు ప్రాచుర్యం కలిగించేందుకు తన కళను వాడుతుంది. ఫోటో-పాత్రికేయురాలిగా వివాదాస్పద అంశాల మీద దృష్టి పెట్టి అధివాస్తవికత చిత్రాలు చిత్రీకరిస్తూ Wall street అక్రమణ వీధి పోరాటంలో పాల్గొని పలు ఉద్యమాలకి దృశ్య గీతంగా మారింది –  Guantanamo ఖైదీలను, లిబియా పోరాట వీరుల ను, బైరూట్ శరణార్ధులను, ఫెర్గూసన్ పోలీసుల బాధితులను నల్లని రేఖా చిత్రాలుగా తన శైలిలో చూపించింది. రెండు వాల్యూమ్ లు ఇప్పటికే వచ్చాయి, ‘రక్త స్రావం’ ఆమె వ్యక్తిగత ఆల్బమ్. కళాకారిణిగా ఆమె రూపొందడం తన 17వ ఏట, తన ఫొటోలను తగల పెట్టి మర్నాడే యూరప్ కి వెళ్తూ తన పేరు మార్చుకుంది, క్రేబ్ ఆపిల్ అన్నది తల్లి దండ్రులు పెట్టిన పేరు కాదు. తన బొమ్మలు అమ్ముడు కాకపోవడంతో, న్యూ యార్క్ లో 2000 సo. లో, తనని తనే అమ్ముకోవడం మొదలు పెట్టింది, నైట్ క్లబ్ లలో నగ్నంగా డాన్స్ చేసింది. సమాజాన్ని అలా చూసాక ఆమెలో చిత్రకారిణిగా మార్పు వచ్చింది, చీకటి మూలాలలోకి తొంగిచూస్తూ బాధితుల కోసం బొమ్మలు గీయసాగింది. ఆమె వేసిన కొన్ని నగ్న చిత్రాలు కొందరికి నచ్చకపోవచ్చు. కాని అందరూ ఆమె ప్రతిభను మెచ్చుకోకుండా ఉండలేరు, ఆమె కున్న ‘కెమెరా కన్ను’ని గుర్తించకుండా ఉండడం అసాధ్యం. ‘ఫోటో జర్నలిజం లా ఆర్ట్ లో కూడా సారాన్ని ఒడిసి పట్టు కోవచ్చు, కాగా చిత్రకళ ఆత్మా శ్రయ ధోరణిని అనుసరిస్తుంది, కళాకారుడుకి స్వేచ్ఛను కాదనలేము, తను నమ్మిన నిజాలనే ఆమె చిత్రాలు వ్యక్తీకరిస్తాయి’ అని అంటారామె. మొన్న వేసవిలో ఆమె ఉక్రెయిన్ వెళ్ళింది, రెండు వారాలు ఉంది, యుద్ధం అక్కడి జనజీవితాలని ఎలా మార్చేసిందో తన కళలో చిత్రించింది.
*****
Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.