అనుసృజన

మీనాకుమారి హిందీ కవిత-1

అనువాదం: ఆర్.శాంతసుందరి

అలనాటి మేటి హిందీ నటి మీనా కుమారి అసలు పేరు మాహ్ జబీన్. ఆమె కవయిత్రి అన్న విషయం మీకు తెలుసా? ఆమె మరణించాక గుల్జార్ ఆమె కవితలని సీడీగా రికార్డు చేశారు, మీనా కుమారి తన కవితలను స్వయంగా చదివి రికార్డ్ చేసిన వీడియోలు కొన్ని దొరికాయి. మూల (హిందీ) కవితలను తెలుగులో రాసాను, పాడుకోవడానికి వీలుగా ఉంటుంది. తెలుగు అనువాదం ఆమె కవితల్లోని భావాన్ని అర్థం చేసుకోవడానికి పనికొస్తుంది.
 
1. ఆబలాపా కోయీ ఇస్ దశ్త్ మే ఆయా హోగా
వరనా ఆంధీ మే దియా కిస్ నే జలాయా హోగా
(ఎవరో మతిభ్రమించిన మనిషి ఈ శిథిలాల్లోకి వచ్చి ఉండాలి
లేకపోతే ఈ గాలి వానలో ఇంకెవరు దీపం వెలిగిస్తారు?)
 
జర్రే జర్రే పే జడే హోంగే కుంవారే సజదే
ఏక్ ఏక్ బుత్ కో ఖుదా ఉసనే బనాయా హోగా
(ఒక్కొక్క ఇసుక రేణువు కీ ఏ అవివాహితుడో ప్రణమిల్లి ఉండాలి
ఒక్కొక్క ప్రతిమను దైవంగా మార్చి ఉండాలి!)
 
ప్యాస్ జలతీ హుయీ కాంటోం కీ బుఝాయీ హోగీ
రిసతే పానీ కో హథేలీ పే సజాయా హోగా
(కాలుతున్న ముళ్ళ దాహాన్ని తీర్చే ఉండాలి
కారుతున్న నీటిని అరచేతిలో అలంకరించుకుని ఉండాలి!)
 
మిల్ గయే హోంగే అగర్ కోయీ సునహరే పత్థర్
అపనా టూటా హుఆ దిల్ యాద్ తో ఆయా హోగా
(ఏవో బంగారు రంగు రాళ్లు దొరికినట్టున్నాయి
ఛిద్రమైన తన మనసు జ్ఞాపకం వచ్చే ఉండాలి!)

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.