నేను

(నెచ్చెలి-2023 పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కవిత)

– ములుగు లక్ష్మీ మైథిలి

నేను లేని ఇల్లు లేదు
నేను లేక ఈ జగతి లేదు
ప్రతి ఇంట్లో
అనుబంధాల పందిరి వేస్తాను
మన ఆడపడుచుల పొత్తిళ్ళ నుండి
చెత్త కుప్పలోకి విసిరేసే
కర్కశత్వానికి సవాల్ ను నేను

కొలతలు తప్ప
మమతలు తెలియని మృగాళ్ళు
ఉన్న జనారణ్యంలో
సమానతలంటునే
సమాధి చేస్తారు
ఎన్నో మైళ్ళ పురోగమనంతో
అలుపెరగని పయనాన్ని
బాధ్యతల బరువును మోస్తూ
ఏ నిశిరాత్రికో నిదుర పోతాను

మళ్ళీ ఉదయసింధూరాన్ని
నుదుటి పై దిద్దుకుని
పాదాలకు
పరుగు లేపనం అద్దుకుంటాను
అవును ఆడపిల్లనే
నేనెప్పుడూ
చావు అంచుల మీదే ఉంటాను

నా గెలుపుకు అడ్డొస్తే
పసితనపు పిడికిలి
మళ్ళీ బిగుసుకుంటుంది
ఇకనైనా… నన్ను
ఆత్మ విశ్వాసంతో ఎదగనివ్వండి
మీ ఆలోచనను, ఆచరణను
మీ వ్యవస్థను మార్చుకోండి
నన్ను నన్నుగా బతకనివ్వండి!

*****

Please follow and like us:

17 thoughts on “నేను (నెచ్చెలి-2023 పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కవిత)”

    1. మీ చక్కని స్పందనకు ధన్యవాదాలు సార్ 🙏

  1. *నేను* చక్కటి కవిత. ఆడ వాళ్ళ జీవితం గురించి బాగా రాశారు. పాదాలకు పరుగు లేపనం అద్దుకుంటాను అనే మాటలు చాలా బాగున్నాయి.

    1. మీ అమూల్యమైన సమీక్షకు ధన్యవాదాలుడి

  2. ఒక ఆడపిల్ల గురించి చాలా బాగా రాశారు అమ్మ🙏

    1. మీ ఆత్మీయ స్పందనకు ధన్యవాదాలు లహరి గారు

    2. మీ అమూల్యమైన సమీక్షకు ధన్యవాదాలండి

  3. ఒక ఆడపిల్ల గురించి చాలా బాగా చెప్పారు.
    కవిత చాలా బాగుంది.

    1. మీ ఆత్మీయ స్పందనకు ధన్యవాదాలండి

  4. ఒక మహిళ ఐన రచయిత్రి, కవయిత్రి “నేను” అనే చక్కని కవితను రాశారు. కుటుంబం తానెంత తాపత్రయ పడుతుందో వివరిస్తూనే “ఇకనైనా… నన్ను ఆత్మ విశ్వాసంతో ఎదగనివ్వండి
    మీ ఆలోచనను, ఆచరణను మీ వ్యవస్థను మార్చుకోండి నన్ను నన్నుగా బతకనివ్వండి! ” అని ధైర్యంగా వెల్లిబుచ్చారు. తన ప్రాముఖ్యను బల్ల గుద్ది మరీ చెప్పారు. మంచి కవితను అందించిన సోదరి ములుగు లక్ష్మీ మైథిలికి అభినందనలు. ప్రచురించిన నెచ్చెలికి ధన్యవాదాలు

    1. మీ ఆత్మీయ స్పందనకు ధన్యవాదాలు లహరి గారు

    2. మీ అమూల్యమైన సమీక్షకు హృదయపూర్వక ధన్యవాదాలు సార్ 🙏🙏

    3. మీ అమూల్యమైన సమీక్షకు హృదయపూర్వక ధన్యవాదాలు సార్

  5. “నేను” అనే రెండు అక్షరాలలో మగువ జీవితాన్ని చాలా చక్కగా కూర్చారు.
    అద్భుతంగా చెప్పారు. మైధిలి గారికి అభినందనలు. మీరు ఇంకా ఇలాంటి ఆవిష్కరణలు ఎన్నెన్నో చేయాలని కోరుకుంటున్నాను.

    1. మీ ఆత్మీయ స్పందనకు హృదయ పూర్వక ధన్యవాదాలు మేడం

  6. చేయి తిరిగిన రచయిత్రి. ‘కొలతలు తప్ప, మమతలు తెలియని’..అద్భుత ప్రయోగం. చిన్నదైన చిక్కని కవిత. మైథిలి గారికి అభినందనలు.

    1. మీ అమూల్యమైన స్పందనకు హృదయ పూర్వక ధన్యవాదాలు సార్ 🙏🙏

Leave a Reply

Your email address will not be published.